బాటిల్ మూతలను క్రమబద్ధీకరించడం వస్తువులు: వివిధ రంగుల్లో మూడు ప్లాస్టిక్ సీసాల మూతలు. దశలు సీసాల మూతలను వరుసలో పెట్టి వాటి రంగులను గురించి బిడ్డతో చెప్పండి. బిడ్డను సీసాల మూతలను వాటి రంగుగల మూతలతో సరి పోల్చమని అడగండి. రంగుల ప్రకారం మూతలను పెట్టడానికి బిడ్డ ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రోత్సహించండి. ఇద్దరూ కలిసి కృత్యాన్ని ఆస్వాదించండి. కృత్యం ప్రాధాన్యత: రంగులను గుర్తించడం మరియు క్రమబద్ధీకరించే నైపుణ్యాలు మెరుగవుతాయి. మూతలను చేతితో తీసుకుని సర్దటం వలన సూక్ష్మ కండరాల అభివృద్ధి జరుగుతుంది. చూడండి, నేను డ్రైవ్ చేయగలను వస్తువులు: ఏమీ లేవు. దశలు రకరకాల కదలికలు, ధ్వనుల ద్వారా కారు, విమానం మరియు మోటార్ బైక్ నడుపుతున్నట్లు నటించండి. ఊహాత్మకమైన ఆటలో బిడ్డ పాల్గొనేలా ప్రోత్సహించండి. మీరు చేస్తున్న ధ్వని, ఏ వాహనమునకు సంబంధించింది అని బిడ్డను అడగండి. రకరకాల ఊహాత్మకమైన ప్రయాణాలు చేయడం ద్వారా మీరు మీ బిడ్డ కలిసి సరదాగా గడపండి. కృత్యం ప్రాధాన్యత: సృజనాత్మకత మరియు ఊహాత్మక శక్తి పెరుగుతుంది. వస్తువులు, అవి చేసే ధ్వనులు చేయడం వల్ల భాషాభివృద్ధి జరుగుతుంది. నర్సరీ పద్యం వస్తువులు: ఏమీ లేవు. దశలు బిడ్డ కోసం మాత్రమే ప్రత్యేకంగా ఒక నర్సరీ పద్యాన్ని యాక్షన్ చేస్తూ పాడవలెను. నర్సరీ పద్యాన్ని తిరిగి చెబుతూ అనుకరించేలా బిడ్డను ప్రోత్సహించండి. ఈ కృత్యాన్ని పరస్పర చర్యగా, ఉల్లాసభరితమైన అనుభవంగా బిడ్డతో కలిసి ఆస్వాదించండి. కృత్యం ప్రాధాన్యత: గేయాన్ని పాడుతూ యాక్షన్ చేయడం వల్ల పిల్లల్లో భాషా నైపుణ్యాలు మెరుగుపడతాయి మరియు అనుకరణ మరియు సమన్వయం పెంపొందుతుంది. సరదా బంతి ఆట వస్తువులు: బంతి, వస్త్రంతో చేసిన బంతి, మేజోళ్ళతో చేసిన బంతి. దశలు మీ బిడ్డకు ఆడుకోవడానికి ఒక బంతినివ్వండి. కుటుంబ సభ్యులందరినీ ఒక వృత్తాకారంలో ఏర్పడమని చెప్పండి. వృత్తంలో కూర్చున్న ఒకరికి బంతిని విసరటం కానీ, దొర్లించడం కానీ చేయండి. బంతి తీసుకున్న వ్యక్తి మరొక వ్యక్తికి, బంతిని పై విధంగా విసరటం కానీ దొర్లించడం కానీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అందరూ కూడా పై విధంగా బంతిని ఒకరు నుంచి ఒకరికి పంపుకుంటూ సరదాగా గడపాలి. రకరకాల ఆటలను తెలుసుకుంటూ, అందరూ కలిసి సరదాగా గడపాలి. కృత్యం ప్రాధాన్యత: బంతిని తీసుకోవడం, విసరటం, పట్టుకోవడం వలన పిల్లల్లో స్థూల కండరాల అభివృద్ధి మెరుగుపడుతుంది. ఈ కృత్యం వల్ల ఇతరులతో సంభాషణ మరియు సమన్వయం ఎలా జరుపుకోవాలో పిల్లలకు తెలుస్తుంది. ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ