ఇది ఎరుపా? కాదా? వస్తువులు: ఏమీ లేవు. దశలు ఎరుపు రంగులో ఉన్న రకరకాల వస్తువులను వేలితో చూపిస్తూ ఎరుపు రంగుని బిడ్డకు పరిచయం చేయండి. ఎరుపు రంగును సానుకూల పదాలతో సరదాగా బిడ్డకు వివరించండి. రకరకాల వస్తువులను చూపిస్తూ ఆ వస్తువు ఎరుపు రంగులో ఉందా లేదా అని బిడ్డను అడగండి. బిడ్డ తిరిగి చెప్పడానికి ప్రోత్సహించండి, అవసరమైతే సహాయం అందించండి. సరైన సమాధానం కోసం సానుకూల మద్దతు అందించండి మరియు బిడ్డకు మరి కష్టంగా అనిపిస్తే సున్నితంగా మార్గనిర్దేశనం చేయండి. కృత్యం ప్రాధాన్యత: రంగులను గుర్తించడాన్ని పరిచయం చేస్తుంది. అభిజ్ఞా కౌశలం పెంపొందుతుంది మరియు చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. తెరిచిన చేతులతో సవాల్ వస్తువులు: ఏమీ లేవు. దశలు మీ రెండు అరచేతులతో మరీ గట్టిగా పట్టుకోకుండా రెండు చేతులతో పిడికిలి బిగించండి. బిడ్డతో సరదాగా "నా చేయి తెరువు" అని అనాలి. బిడ్డ రకరకాల పద్ధతులతో మీ చేయి తెరిచే ప్రయత్నానికి అనుమతించండి. ఈ కృత్యాన్ని బిడ్డ ఉత్సాహంగా, ప్రోత్సాహభరితంగా మరలా మరలా చేసే విధంగా చూడండి. కృత్యం ప్రాధాన్యత: సూక్ష్మ కండరాల చలన నైపుణ్యాలు పెంపొందడంతోపాటు, పిడికిలి ఎలా తెరవాలో బిడ్డ నేర్చుకోవడంతో, చేతివేళ్ళు బలోపేతంగా మారటం మరియు పరిష్కారాత్మక నైపుణ్యాలు మెరుగుపడతాయి. నర్సరీ రైమ్ పాడండి వస్తువులు: ఏమీ లేవు. దశలు సరళమైన మరియు ఆకర్షణీయమైన నర్సరీ పద్యాన్ని ఎంచుకోండి. బిడ్డతో కలిసి సౌకర్యవంతమైన స్థితిలో కూర్చోండి లేదా నిలబడండి. ఎంచుకున్న నర్సరీ పద్యానికి భావవ్యక్తీకరణ జోడించి లయబద్ధమైన స్వరంతో పాడండి. బిడ్డకు సరదాగా అనిపించడానికి, పాటకు సున్నితమైన హావభావాలను కదలికలను జోడించండి. కలిసి పాట పాడటం ద్వారా కానీ, హావభావాలు వ్యక్తీకరించడం ద్వారా కానీ బిడ్డను ఈ కృత్యంలో పాల్గొనేలా ప్రోత్సహించండి. కృత్యం ప్రాధాన్యత: ఈ కృత్యం వల్ల భాషాభివృద్ధి మరియు పాడటంలో లయ మెరుగుపడుతుంది. కలిసి సరదాగా పాడటం ద్వారా బంధం బలోపేతం అవుతుంది. బయట చూద్దాం వస్తువులు: ఏమీ లేవు. దశలు మీ బిడ్డను మీతో కలిసి నడవడానికి బయటకు తీసుకు వెళ్ళండి. చుట్టూ ఉండే అన్ని వస్తువులను వేలితో చూపిస్తూ బిడ్డతో మాట్లాడండి. బిడ్డ ఏమేమి చూసింది తిరిగి చెప్పే విధంగా ప్రోత్సహించండి. ప్రకృతి, రంగులు, ఏదైనా ఆసక్తికరమైన విషయాలను బిడ్డతో చర్చించండి. ప్రశ్నలు అడగటం మరియు పరిశీలనలను పంచుకోవడం ద్వారా దీనిని పరస్పర సంభాషణగా మార్చండి. కృత్యం ప్రాధాన్యత: పరిసరాల గురించి ఉత్సుకతను, పరిశీలనా నైపుణ్యాలను ప్రోత్సహిస్తుంది. పరస్పర సంభాషణ మరియు తిరిగి చెప్పడం ద్వారా పిల్లల్లో భాషాభివృద్ధి జరుగుతుంది. ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ