నటిద్దాం - జంతువులు మరియు పక్షులు వస్తువులు: ఏమీ లేవు. దశలు మీ బిడ్డకు ఇష్టమైన జంతువుల గురించి మాట్లాడండి. చేతులను ఉపయోగించి పిల్లి మరియు పక్షులుగా చేసి చూపించండి. మీరు మీ బిడ్డ కలిసి గర్జించినట్లు, పక్షి కూత లాగా, పిల్లి లాగా 'మ్యావ్' అనే ధ్వనులు చేయండి. నేలమీద మీ బిడ్డతో పాటు కూర్చుని జంతువులలాగా నటిస్తూ కలిసి ఆడుకోండి. ఈ ఆట సమయాన్ని బిడ్డతో కలిసి నవ్వుతూ, సరదాగా గడపండి. కృత్యం ప్రాధాన్యత: ఈ కృత్యం వలన పిల్లలలో ఊహాశక్తి, పదజాలం అభివృద్ధి పెరుగుతుంది. తేలికగా, స్నేహపూర్వకమైన జంతువుల ఆట ద్వారా పిల్లలకు ఆనందాన్ని ఇస్తుంది. కప్పులతో అంతస్తులు నిర్మాణం వస్తువులు: ప్లాస్టిక్ లేదా లోహాల కప్పులు. దశలు ప్లాస్టిక్ లేదా లోహాల కప్పులను సేకరించండి. కప్పులను ఒకదానిమీద ఒకటి అంతస్తుల నిర్మాణం లాగా ఎలా పెట్టాలో బిడ్డకు వివరించండి. ఆ కప్పుల నిర్మాణాన్ని కదిపి పడవేయటాన్ని బిడ్డతో కలిసి సరదాగా చేయండి. బిడ్డను సొంతంగా కప్పుల నిర్మాణాన్ని నిర్మించమని ప్రోత్సహించండి. బిడ్డతో కృత్యాన్ని చర్చించి ఆటలో ఉపయోగించే వివరణాత్మక పదాలను గురించి ప్రశ్నలు అడగండి. కృత్యం ప్రాధాన్యత: ఈ కృత్యం పిల్లలకు ఆహ్లాదకరమైన మరియు ఆకర్షణీయమైన అనుభవాన్ని అందిస్తుంది. ఈ కృత్యం వల్ల పిల్లలకు కొత్త అంశాలు తెలుసుకోవడానికి, సంభాషణ జరపడానికి మరియు చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచం గురించి అవగాహన పెంపొందుతుంది. పైన మరియు క్రింద వస్తువులు: రకరకాల వస్తువులు మరియు ఒక పాత్ర. దశలు బిడ్డ రకరకాల వస్తువుల గురించి తెలుసుకునేలా చేయండి. బిడ్డకు 'పైన' మరియు 'క్రింద' అనే పదాలను ఉపయోగిస్తూ వస్తువులను పాత్ర పైన మరియు క్రింద ఎలా పెట్టాలో చూపించండి. మీరు 'పైన' మరియు 'క్రింద' అని చెబుతున్నప్పుడు ఆ పదాలను బిడ్డ సొంతంగా పలుకుతూ వస్తువులను పాత్ర పైన మరియు క్రింద పెట్టే విధంగా ప్రోత్సహించండి. బిడ్డ విజయవంతంగా వస్తువులను సరైన స్థలంలో పెట్టినప్పుడు ఉత్సాహకరమైన స్వరంతో అభినందించండి. కృత్యం ప్రాధాన్యత: పైన, క్రింద వంటి పదాలను పరిచయం చేయడం ద్వారా బిడ్డకు వస్తువుల క్రమబద్దీకరణ మరియు ఏది ఏ ప్రదేశంలో పెట్టాలో అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఈ కృత్యం వలన పిల్లలలో అభిజ్ఞా కౌశలం మరియు కండరాల అభివృద్ధి జరుగుతుంది. లయబద్ధంగా పాడుట వస్తువులు: ప్లాస్టిక్ పాత్ర, చెంచాలు మరియు తాళాలు. దశలు ఒక ప్లాస్టిక్ పాత్రలో చెంచాలు మరియు తాళాలు ఉపయోగించి ఇంట్లోనే ఒక వాయిద్య పరికరాన్ని తయారు చేయండి. వంట చేసే సమయంలో వంట పాత్రలను అటు ఇటు కదపడం ద్వారా వచ్చే ధ్వనులతో ఒక లయబద్ధమైన స్వరాన్ని సృష్టించండి. చప్పట్లతో ఒక లయబద్ధమైన ధ్వని చేస్తున్నప్పుడు బిడ్డ అదే రకమైన ధ్వని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడో లేదో గమనించండి. బిడ్డ సొంతంగా రకరకాల ప్రయత్నాలతో ధ్వనులు సృష్టించడానికి అవకాశం ఇవ్వండి. బిడ్డ సృష్టించిన ఆ ధ్వనులను మీరు కూడా అనుకరించండి. వివిధ రకాల ధ్వనులు మరియు ధ్వనుల నమూనాలను బిడ్డతో చర్చించండి. పిల్లల దృష్టి మరియు సృజనాత్మకతను ప్రోత్సహించండి. కృత్యం ప్రాధాన్యత: ఈ కృత్యం వలన పిల్లలలో శ్రవణ సామర్థ్యం, కొత్త ధ్వనులు తెలుసుకోవడం, అభిజ్ఞా కౌశలం మరియు ప్రత్యేక నమూనాలపై అవగాహన పెంపొందుతుంది. ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ