ఒకేలా ఉన్న వస్తువులను వర్గీకరించడం వస్తువులు: 2 వేర్వేరు వస్తువులకు సంబంధించి ఒక్కొక్కటి 4 చొప్పున (4 కప్పులు, 4 చెంచాలు, 4 ఆకులు మరియు 4 కర్రలు వంటివి). దశలు బిడ్డ తో కూర్చుని, ఆ వస్తువులతో వారిని ఆడుకోనివ్వండి. కప్పులు ఎలా ‘ఒకేలా’ ఉన్నాయో మరియు చెంచాలు ఎలా ‘ఒకేలా’ ఉన్నాయో (లేదా ఆకులు మరియు కర్రలు) పిల్లలకు చూపించండి. వస్తువులన్నింటిని కలపండి మరియు అన్నీ ‘ఒకేలా’ ఉన్న వస్తువులను వేరు చేసి ఒక దగ్గర పెట్టమని పిల్లలకు చెప్పండి. పిల్లలు అలా చేసినప్పుడు వారిని ప్రశంసించండి. వివిధ వస్తువులతో ఆటను పునరావృతం చేయండి. కృత్యం ప్రాధాన్యత: అభిజ్ఞా నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. క్రమబద్ధీకరణ భావనను పరిచయం చేస్తుంది మరియు సమస్య పరిష్కారాన్ని ప్రోత్సహిస్తుంది. కలిసి ఊడ్చుకోవటం వస్తువులు: చీపురు, చేట, చెత్తబుట్ట. దశలు ఊడ్చేటప్పుడు మీతో చేరమని మీ బిడ్డను ఆహ్వానించండి. "ఇది కలిసి ఊడ్చే సమయం!" అని చెప్పండి. మీరు ఊడ్చేటప్పుడు బిడ్డను చేట పట్టుకోమని అడగండి. ఆ దుమ్మును చెత్తబుట్టలో పడేయమని వారిని ప్రోత్సహించండి. ఒకరి కోసం ఒకరు చేటను పట్టుకుని కలిసి ఉడుక్కోవాలి. సహాయం చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పి, అవసరమైతే పిల్లలకు సానుకూలంగా క్రమశిక్షణ అలవాటు చేయండి. కృత్యం ప్రాధాన్యత: పిల్లలను రోజువారీ పనులలో నిమగ్నం చేస్తుంది. పరిశుభ్రత మరియు సహకారం పట్ల సానుకూల వైఖరిని పెంపొందిస్తుంది, విలువైన జీవిత నైపుణ్యాలను ప్రోత్సహిస్తుంది. చర్యలు మరియు అభినందనలు వస్తువులు: ఏమీ లేదు. దశలు మీరు చెప్పిన చర్యలను చేయమని పిల్లలను ప్రోత్సహించండి. కొంచెం దూరం నడిచి, పిల్లవాడికి "బై బై" చెప్పడానికి చేతులు ఊపమని అడగండి. పిల్లలకు ఒక వస్తువు ఇచ్చి, వారు 'ధన్యవాదాలు' అని చెబుతారో లేదో చూడండి. పిల్లలను 'చప్పట్లు కొట్టమని' అడగండి, వారు చర్యలను సరిగ్గా అనుసరించిన ప్రతిసారీ పిల్లలను ప్రశంసించండి! కృత్యం ప్రాధాన్యత: అనుకరణ మరియు చర్య గ్రహణశక్తి పెరుగుతుంది. భాషా అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఆడుకునే సమయంలో చర్యలకు సంబంధించిన పదాలపై దృష్టి సారించడం వలన ఉల్లాసభరితమైన పరస్పర సంభాషణ సమయాన్ని సృష్టిస్తుంది. తలుపులు తెరవడం మరియు మూయడం వస్తువులు: పిల్లల కోసం సురక్షితమైన తలుపు లేదా అల్మారాలు. దశలు పిల్లలకు సురక్షితమైన తలుపు లేదా అల్మారాను ఎంచుకోండి. తలుపు తెరవడం మరియు మూయడం చూపించండి. ఆ చర్యను అనుకరించమని పిల్లలను ప్రోత్సహించండి. వారి ప్రయత్నాలను ప్రశంసించడానికి సానుకూల పదాలను ఉపయోగించండి. దీనిని "ఓపెన్" మరియు "క్లోజ్" అనే ఉల్లాసభరితమైన ఆటగా మార్చండి. కృత్యం ప్రాధాన్యత: సూక్ష్మ కండర చలన నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది, కారణం మరియు ప్రభావాన్ని పరిచయం చేస్తుంది మరియు ప్రదేశాలపై అవగాహనను పెంపొందిస్తుంది. ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ