అల్పాహారం సజ్జతో క్యారట్, ఉల్లిపాయ ఊతప్పం కావలసిన పదార్థాలుసజ్జలు - 1/4 కప్పుసజ్జపిండి - 1 1/4 కప్పు తరిగిన క్యారట్ - 1/2 కప్పు తరిగిన ఉల్లిపాయలు - 1/2 కప్పుతరిగిన పచ్చిమిరపకాయలు - 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్ - 1 టీ స్పూన్తరిగిన కొత్తిమీర - 1/4 కప్పునిమ్మరసం - 1/2 టేబుల్ స్పూన్ పసుపు - 1/4 టీ స్పూన్కారం - 1 1/2 టీ స్పూన్నూనె - 1 1/2 టీ స్పూన్విధానం: సజ్జలను1/2 కప్పు నీరు, ఉప్పు వేసి కుక్కర్ లో ఉడకబెట్టాలి. 5 విజిల్స్ వచ్చాక దించాలి. దించాక ఉడికిన సజ్జల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ సజ్జల్ని మిగతా క్యారట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్ తరిగిన కొత్తిమీర, నిమ్మరసం, పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని 1/4 టీ స్పూన్ నూనెతో దాని మీద రుద్దాలి. 1/4 కప్పు పిండి తీసుకొని 125 మీ.మీ. లో దాని మీద ఊతప్పంలా వేసుకోవాలి. దీనిని అల్లం చెట్నితో తింటే రుచిగా ఉంటుంది. సజ్జతో కాక్రాలు కావలసిన పదార్థాలుసజ్జ పిండి - 1/2 కప్పుగోధుమ పిండి - 2 టేబుల్ స్పూన్అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1/2 టేబుల్ స్పూన్తరిగిన పచ్చిమిరప - 1/4 టేబుల్ స్పూన్నువ్వులు - 1/2 టేబుల్ స్పూన్పసుపు - 1/4 టేబుల్ స్పున్నూనె - 1 టేబుల్ స్పూన్నెయ్యి - కొంచెంఉప్పు – తగినంతవిధానం: పైన చెప్పిన అన్ని వస్తువుల్ని కలిపి కొంచెం వేడి నీటితో ముద్దలుగా చేసుకొని వాటిని 7 భాగాలుగా 75 మి.మీ. లలో ఉండేటట్లు రుద్దుకొని వాటిని ఒక మస్లిన్ క్లాత్ లో ఉంచి కాక్రాల్లాగా వత్తుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని వత్తుకున్న కాక్రాలను నూనె తో వేయించుకోవాలి. సజ్జతో జావ కావలసిన పదార్థాలుసజ్జలు - 1 టేబుల్ స్పూన్ఖర్జూరం - 2పాలు - 1/2 కప్పువిధానం: సజ్జలు, ఖర్జూరాన్ని 1/2 కప్పు నీటిలో వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టాలి. తర్వాత దించి చల్లార్చి ఆ మిశ్రమాన్ని 1/2 కప్పు పాలల్లో వేసి మెత్తగా అయ్యే వరకు ఉంచాలి. తర్వాత వేరొక గిన్నెలో వేసి మెత్తగా అయిన మిశ్రమాన్ని ఉడకబెట్టుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. సజ్జతో కంబు కావలసిన పదార్థాలుసజ్జ పిండి - 1 కప్పు బియ్యం పిండి - 1/2 కప్పు ఉప్పు - తగినంతపచ్చిమిరపకాయలు - 2నూనె - తగినంత మినపపప్పు - 1 టీ స్పూన్ ఎండుమిరపకాయలు - 1కొబ్బరి పొడి - 1/4 కప్పు నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్విధానం: సజ్జపిండి, బియ్యం పిండి, ఉప్పు , కొంచెం వేడి నీరు వేసి కలుపుతూ పిండిలాగా చేసుకోవాలి. కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు. ఈ పిండిని ఇడ్లీ పాత్రలో వేసి ఉడకబెట్టాలి. ఇలా ఉడకబెట్టిన దానిని తాళింపు లేకుండా కొబ్బరి చట్నితో కూడా తినొచ్చు. అలా కాకుండా కడాయి తీసుకొని అందులో నూనె వేసి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, మినపపప్పు, కొబ్బరిపొడి, నిమ్మరసం వేసి అందులో ఈ ఉడకబెట్టిన తాళింపు వేసుకొని కూడా తినవచ్చు. సజ్జతో కిచు కావలసిన పదార్థాలుసజ్జ పిండి - 1 కప్పుపచ్చిమిరపకాయలు - 5జీలకర్ర - 1 టీ స్పూన్ వెల్లుల్లి - 2 లేదా 3పసుపు - చిటికెడు నువ్వులు - 1 టేబుల్ స్పూన్నూనె - 1-2 టేబుల్ స్పూన్ నీరు - 3 కప్పులు ఉప్పు - తగినంత యోగర్ట్/ పెరుగు- 2 టేబుల్ స్పూన్విధానం: ఒక పెద్ద గిన్నె తీసుకొని 3 కప్పుల నీరు మరగబెట్టాలి. కడాయి తీసుకొని అందులో నూనె వేసి పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పసుపు, నువ్వులు వేసి తాళింపులా చేసుకొని అందులో సజ్జ పిండి , వేడి చేసిన నీరు కలిపి బాగా ఉడకబెట్టాలి. ఏదైనా చట్నీతో తింటే రుచిగా ఉంటుంది. సజ్జ వడలు కావలసిన పదార్థాలుసజ్జ పిండి - 1 1/2 కప్పుకారం - 1 టేబుల్ స్పూన్పసుపు - 1/2 టేబుల్ స్పూన్కొత్తిమీర పొడి - 1 టేబుల్ స్పూన్నువ్వులు - 1 టేబుల్ స్పూన్నూనె - 2 కప్పులుకొత్తిమీర ఆకులు - 1 కప్పుపెరుగు - 1 టేబుల్ స్పూన్ఉప్పు - తగినంతనీరు - ½ కప్పువిధానం: సజ్జ పిండిని ఒక గిన్నెలో వేసుకొని అందులో కారం, పసుపు, కొత్తిమీర పొడి, నువ్వులు, ఉప్పు, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కలుపుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని డిస్క్ ఆకారంలో వడల్లాగా వత్తుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో నూనె వేసి వడలను వేయించుకోవాలి. భోజనము సజ్జతో క్యాలీప్లవర్ రోటి కావలసిన పదార్థాలుక్యాలీప్లవర్ - 3/4 కప్పు సజ్జపిండి - 1/2 కప్పుతరిగిన తెల్ల ఉల్లిపాయలు - 1 1/2 టేబుల్ స్పూన్తరిగిన పచ్చ ఉల్లిపాయలు - 1 1/2 టేబూల్ స్పూన్విధానం: పైన చెప్పిన వస్తువుల్ని కలిపి కొంచెం నీరు వేసి ముద్దగా చేసుకోవాలి. ఆ ముద్దను 6 చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఒక్కొక్కదాన్ని పలుచని రోటి లాగా చేసుకోవాలి. ఆ రోటీలను కొంచెం నూనె వేసి ప్యాన్ మీద వేయించుకోవాలి. సజ్జ పాలకూర పరోటా కావలసిన పదార్థాలుసజ్జ పిండి - 1 కప్పుక్యారట్ - 1/2 కప్పుపాలకూర - 1/2 కప్పుపచ్చిమిరపకాయల పేస్ట్ - 1 టీ స్పూన్వెల్లుల్లి పాయ పేస్ట్ - 1 టీ స్పూన్ ఉప్పు - తగినంతనూనె – తగినంతవిధానం: పైన చెప్పిన అన్నింటిని ఒక గిన్నెలో వేసి పరోటా పిండిలా కలుపుకోవాలి. దానిని 8 భాగాలుగా విడదీసి పరోటాలాగా రుద్దుకోవాలి. కొంచెం నూనె వేసి వేయించుకోవాలి. సజ్జలతో ఆలు రోటి కావలసిన పదార్థాలుసజ్జపిండి - 2 కప్పులు ఉడకబెట్టిన ఆలు - 3/4 కప్పులు ఉల్లిపాయలు - 1/4 కప్పులు అల్లం - పచ్చిమిరప పేస్ట్ - 2 టీ స్పూన్ ఆం చూర్ - 1 టి స్పూన్గరం మసాలా - 1/2 టీ స్పూన్ ఉప్పు - తగినంత నెయ్యి - 2 టీ స్పూన్విధానం: పైన ఉన్న అన్ని పదార్థాలను ఒక గిన్నెలో వేసి పిండిలాగా బాగా కలుపుకోవాలి. కావాలంటే వేడి నీరు ఉపయోగించవచ్చు. కలుపుకున్న ఈ పిండిని మొత్తం 8 భాగాలుగా చేసుకొని , రోటీలాగా రుద్దుకొని, ఒక్కొక్క రోటికి 1/4 టీ స్పూన్ నెయ్యి ఉపయోగించి కాల్చుకోవాలి. సజ్జలు పెసరపప్పు కిచిడి కావలసిన పదార్థాలుసజ్జలు - 1/2 కప్పు పెసరపప్పు - 1/2 కప్పునెయ్యి - 2 టీ స్పూన్ఉప్పు - తగినంతజీలకర్ర - 1టీ స్పూన్ఇంగువ - కొంచెం పసుపు - 1/4 టీ స్పూన్ఉల్లిపాయలు, కొత్తిమీర అలంకరణకువిధానం: సజ్జలు, పెసరపప్పు, ఉప్పు, నీరు సరిపడా కుక్కర్ లో వేసి ఉడకబెట్టి 4 విజిల్స్ వచ్చాక దించి ప్రక్కన పెట్టుకోవాలి. వేరొక ప్యాన్ తీసుకుని నెయ్యి వేసి జీలకర్ర, ఇంగువ, పసుపు వేసి తాళింపు చేసుకుని అందులో ఉడకబెట్టుకున్న సజ్జలు, పెసరపప్పును వేసి కిచిడిలా చేసుకుని, ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. స్నాక్స్ సజ్జ బూరెలు కావలసిన పదార్థాలుసజ్జ పిండి - 2 కప్పులుబెల్లం - 1 కప్పునీరు - 2 కప్పులుకొబ్బరి - 1/2 కప్పునూనె – వేయించుకోడానికివిధానం: బెల్లాన్ని 2 కప్పుల నీరు వేసి మరగబెట్టాలి. పాకంలా అయ్యాక ఇందులో ఇలాచి పౌడర్, కొబ్బరి పొడి, సజ్జ పిండి వేసి మెత్తటి పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని వేరొక ప్యాన్ లో కొంచెం నూనె వేసి కాగబెట్టాలి. కొన్ని అల్యూమినియం / ప్లాస్టిక్ షీట్ తీసుకొని దాని మీద నూనెతో aద్ది పిండిని బూరెల్లాగా ప్రెస్ చేసుకొని చిన్నగా కాగిన నూనెలోకి వదలాలి. అప్పుడు అవి బూరెల్లా ఉబ్బుతాయి. సజ్జ లడ్డూలు కావలసిన పదార్థాలుసజ్జ పిండి - 2 కప్పులునెయ్యి - 2 టేబుల్ స్పూన్లుతరిగిన బెల్లం - 1 కప్పుఇలాచీ పౌడర్ - 1/2 టేబుల్ స్పూన్విధానం: సజ్జ పిండిని మెత్తని ఉండలా చేసుకొని, దానితో రెండు చపాతీలు చేసి బాగా కరకరలాడే విధంగా వేయించుకోవాలి. ఆ చపాతీలను మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ పౌడర్ ను ఒక ప్యాన్ లో వేసి బాగా వేయించుకొని తీసి ప్రక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి, బెల్లం, ఇలాచీ పౌడర్ వేసి బాగా మరగనివ్వాలి. బెల్లం కరిగాక సజ్జ పిండి పౌడర్ వేసి ముద్దలాగా చేసి లడ్డులాగా చుట్టుకోవాలి. సజ్జతో బిస్కెట్లు కావలసిన పదార్థాలువెన్న - 1/2 కప్పు బ్రౌన్ షుగర్ - 1 కప్పు గ్రుడ్లు -2బాదం ఎసెన్స్ - 1 టీ స్పూన్ సజ్జ పిండి - 2 కప్పులు బేకింగ్ సోడా - 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ - 1/2 స్పూన్ఉప్పు - 1/4 టీ స్పూన్ఇంగువ - 1/2 టీ స్పూన్ జీడిపప్పు - 1/4 కప్పువిధానం: వెన్నని బాగా గిలక్కొట్టాలి. అలానే గిలకొడుతూ క్రమక్రమంగా చక్కెర వేస్తూ కలపాలి. తర్వాత గ్రుడ్లు, ఎసెన్స్ వేసి బాగా కలపాలి. తర్వాత సజ్జ పిండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ , ఉప్పు, జీడి పప్పు వేసి బాగా కలుపుకోవాలి. వీటన్నింటిని మెల్లగా కలుపుతూ ఉండాలి. తర్వాత ఈ పిండిని ఒక ఫ్లాస్టిక్ షీట్ మీద వేసి చపాతీ పిండిని చేసే కర్రతో రుద్దాలి. తర్వాత కట్టర్ తో బిస్కెట్స్ లా కట్ చేసుకొని ఆ బిస్కెట్ లను 350 డీగ్రీల వద్ద బేక్ చేయాలి. 10 నిమిషాల తర్వాత తీసి చల్లార్చి గాలి చొరబడిన డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఆధారం : కుమారి ఐ. ప్రసన్న, విద్యార్ధి, ఐ.డి.నెం: హెచ్.హెచ్. 2012/010.