ఈ వీడియో లో పోషకాహార లోపాలకు సంబంధించిన సూచనలు, పరిమాణాలు మరియు నిరోధం - తెలుగు వివరించటం జరిగింది. పోషకాహార లోపాల సూచనలు తరచుగా అస్వస్థత బారిన పడటం, త్వరగా అలసిపోవడం మరియు నెమ్మదిగా అర్థం చేసుకునే స్వభావం ఉన్నపిల్లలు పోషకాహార లోపంతో బాధించబడుతున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. కాన్పు అయినప్పటి నుంచి రెండు సంవత్సరాల వయస్సు వచ్చే వరకు బిడ్డలకు పోషకాహార లోపాలు సంక్రమించే ప్రమాదం ఉంటుంది. సంపూర్ణ దీర్ఘకాలిక అభివృద్ధికి ఇది ఎంతో ముఖ్యమైన కాలం. బిడ్డ పుట్టడానికి ముందు నుంచే పోషకాహార లోపం ప్రారంభం అవుతుంది, అది కౌమార దశ, ఆపైన యవ్వనంలోనూ, ఇలా జీవితాంతం వెన్నంటి ఉంటుంది. ఈ సమస్యను ఉత్క్రమణం చేయలేం. ఉత్క్రమణం చేయలేని సంచిత ఎదుగదల మరియు అభివృద్ధిని మరియు తల్లి ఆరోగ్యం విషయంలో రాజీపడే లోపాలు అభివృద్ధి చెందడాన్ని నిరోధించడానికి, బిడ్డ ఆరోగ్యానికి, జీవితచక్రంలోని అన్ని దశల్లో పోషకాహార లోపాన్ని నిరోధించడం అనేది ఎంతో కీలకం. చనిపోయిన మొక్క ఏవిధంగా మట్టిలో పోషకాలు, నీరు, తాజా గాలి మరియు సూర్యకాంతి లేకుండా తిరిగి జీవం పోసుకోదో అదేవిధంగా సరైన పోషణం మరియు సంరక్షణ లేకుండా పిల్లలు ఆరోగ్యవంతమైన వయోజనులుగా ఎదగలేరు. పగిలిపోయిన మట్టి కుండను ఏవిధంగా అయితే అతకలేమో, అదేవిధంగా జీవితం తొలినాళ్లలో పోషకాహార లోపంతో బాధించబడ్డ చిన్నారుల ఆరోగ్యాన్ని తిరిగి పున:స్థాపించడం కష్టం అవుతుంది. ప్రధాన ఉద్దేశ్యం పోషకాహార లోపం వల్ల చోటు చేసుకునే సంకేతాలు, ప్రమాదకరమైన పరిమాణాల గురించి మరియు తీసుకోవాల్సిన చర్యల గురించి సమాజాన్ని ప్రోత్సహించడం మరియు పోషకాహార లోపాన్ని నిరోధించుకోవడానికి చేయగల సరళమైన పనుల గురించి వివరించడమే ఈ వీడియో ప్రధాన ఉద్దేశ్యం. సమాజంలోని అధిక సంఖ్యాకులకు ఇది ఉద్దేశించబడింది. అందించిన వారు: కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, భారతదేశ ప్రభుత్వం మరియు ఇతర అభివృద్ధి భాగస్వాముల యొక్క క్రియాత్మక మద్దతుతో