మన శరీరంలో కణజాలాల నిర్మాణానికి, నిర్వహణకు, పాత కణజాలాలకు బదులుగా కొత్తవి ఏర్పరచడానికి మాంసకృత్తులు పనిచేస్తాయి. మనం తీసుకున్న ఆహారంలో గల మాంసకృత్తులలో ప్రత్యేక పనులను నిర్వహించడానికి ప్రత్యేకమైన మాంసకృత్తుల అణువులు ఉంటాయి. మన శరీరం వాటిని వినియోగించుకుటుంది. ఉదాహరణకు రక్త కణాలలో హిమోగ్లోబిన్లో భాగంగా తయారైన మాంసకృత్తులు, ప్రాణవాయువు (ఆక్సీజన్) శరీరంలోని ప్రతి భాగానికి అందజేస్తాయి. మాంసకృత్తులు అధికంగాగల ఆహార పదార్ధాలుః మాంసం, పాలు, గ్రుడ్లు, లెగ్యూమ్ వంటి పప్పులు మరియు సోయాబీన్. మాంసకృత్తులను మన శరీరం ఎలా వినియోగించుకుటుంది ? మనం తీసుకున్న ఆహారంలోగల మాంసకృత్తులు జీర్ణప్రక్రియలో సూక్ష్మ ప్రమాణాలైన అమైనో ఆమ్లాలుగా విడగొట్టబడి శోషింపబడతాయి. మనశరీరం యొక్క కణజాలాల నిర్మాణానికి, నిర్వహణకు ఈ అమైనో ఆమ్లాలు వినియోగింపబడతాయి. భిన్న అమైనో ఆమ్లాలు ఉన్నప్పటికిని, వీటిలో మానవ ఆరోగ్యానికి అతిముఖ్యమైనవి 22 మాత్రమే. ఈ 22 అమైనో ఆమ్లాలలో, 13 అమైనో ఆమ్లాలను మన శరీరమే తయారు చేసుకుంటుంది. మనం తీసుకున్న ఆహారం ద్వారా మిగిలిన తొమ్మిది అమైనో ఆమ్లాలు మన శరీరానికి అందుతాయి. వాటినే అత్యావశ్యక అమైనో ఆమ్లాలు అంటాము. మాంసకృత్తుల నాణ్యత మాంసకృత్తులు సంపూర్ణం, అసంపూర్ణమని రెండువర్గాలుగా ఉన్నాయి. తొమ్మిది ఆవశ్యక అమైనో ఆమ్లాలను గల మాంసకృత్తులను సంపూర్ణ మాంసక్రత్తులని పిలుస్తారు. ఉదాహరణకు జంతువుల నుండి లభించే మాంసకృత్తులు, అవి మాంసం, పాలు. శాకీయ మాంసకృత్తులన్నింటిలో ఎక్కువగా అంటే అపరాలు అసంపూర్ణ మాంసకృత్తులుగా చెప్పబడతాయి. ఎందుకంటే ఇందులోఒకటిలేదా అంతకంటేఎక్కువ ఆవశ్యక అమైనో ఆమ్లాలు లోపిస్తాయి. మాంసకృత్తులు ఎవరెవరికి ఎంత కావాలి? భారతీయులకు సూచించిన పోషకాహరం సమూహం శరీరం బరువు (కిలోగ్రాములలో) వివరాలు మాంసకృత్తులు రోజుకి ( గ్రాములలో) పురుషులు 60 స్థిరంగా కూర్చుని చేసే పనికి 60 మితంగా చేసేపనికి 60 అధికంగా చేసే పనికి 60 స్త్రీలు 50 స్థిరంగా కూర్చుని చేసే పనికి 50 మితంగా చేసేపనికి 50 అధికంగా చేసే పనికి 50 గర్భవతులకు, బాలింతలకు ప్లస్15 బాలురు 35.14 0-6నెలలు ప్లస్25 6-12నెలలు ప్లస్18 10-12సంవత్సరాలు 54 బాలికలు 31.5 0-6నెలలు ప్లస్25 6-12నెలలు ప్లస్18 10-12సంవత్సరాలు ప్లస్57 మాంసకృత్తులతో కూడిన ఆహారపదార్ధాలు ఆహారాలు తినదగిన మాంసకృత్తులలో గల పోషకాలు( 100 గ్రా) సోయాబీన్ 43.5 కందులు,మినుములు, పెసలు,లెంటిల్ మరియు ఎర్రపప్పు 22 వేరుశనగలు,జీడిపప్పులు,బాదం 23 చేపలు 20 మాంసం 22 ఆవుపాలు 3.2 గేదెపాలు 4.3 గ్రుడ్డు(సుమారుగా44గ్రాములు) 13.3(ఒకగ్రుడ్డు కి) ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు