హిమోగ్లోబిన్ సాధారణ స్థాయిని నిర్వహించెటందుకు రాగి అవసరమౌతుంది. చాలా ఎంజైమ్ వ్యవస్థలలొ ఇది భాగమౌతుంది. మనం భుజించే ఆహారంలో రోజుకి 2విుల్లీ గ్రాముల రాగి తప్పనిసరిగా ఉండాలని సూచించడం జరిగింది. సముద్ర సంబంధిత ఆహారపదార్ధాలలొ గుల్లచేపలు (ఆయిస్టర్లు), పీతలు, ఎండ్రకాయల వంటివి (లోబ్ స్టర్లు), మాంస సంబంధిత ఆహారాలు, గింజలు మరియు బాదంపప్పులు, నువ్వులు, పొద్దుతిరుగుడు విత్తనాలు, సోయాగింజలు వంటి ఎండిన లెగ్యూమ్లు రాగి లభించే ఆహారాలు. రాగిలోపం వలన నూయట్రోపినియా (తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గడం), రక్తహీనత, ఎముకల జబ్బులకు దారితీస్తుంది. రాగి ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే విషపదార్ధంగా మారుతుంది. కడుపులో త్రిప్పడం (వాంతి వస్తున్నట్లుగా ఉండడం), వాంతులు కావడం, తీవ్రవైున విష పదార్ధంతో మరణం కూడ సంభవించవచ్చు. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు