ప్రత్యేకమైన ఎంజైమ్‌లలో జింక్ ప్రధానమైన మూలకంగా కలిసి ఉంటుంది. మనశరీరంలో గల రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడి అనారోగ్యాలను, అంటు వ్యాధులను ఎదుర్కుంటుంది. కణ విభజనకు, కణ పెరుగుదలకు తోడ్పడి గాయం తగిలినపుడు గాయాలనుమాన్చడానికి సహకరిస్తుంది. ఇది ఒక మంచి ఏంటి ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. మన కంటి రెటీనా పొరలోగల రాద్ కణాలలో గల విటమిన్(ఎ) సక్రమంగా పనిచేయడానికి ఇది అవసరం. దీని వలన రాత్రి సమయంలో దృష్టి బాగుంటుంది. జింక్ సమృద్ధిగాగల ఆహారపదార్ధాలుః ఆల్చిప్పలు, గొడ్దుమాంసం, పందిమాంసం, గొర్రెపిల్ల, చిక్కుళ్ళు, బఠాణీలు, లెంటిల్స్, మరియు బఠాణి గింజల వంటిలెగ్యూమ్లు, పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడి విత్తనాలు వంటి గింజలు, గోధుమ వంటి ధాన్యాలు పుదీనా, బెండ, కేరట్ల వంటి అనేక రకాల కాయగూరలలో ఉంటుంది. జింక్ సంబంధిత పోషకాలలో అవ్యవస్థలు మనం భుజించే ఆహారంలో కావలసిన జింక్ కొరకు సూచనలు శిశువులకు- రోజుకి 5 మిల్లీగ్రాములవరకు 10 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు - రోజుకి 10 మిల్లిగ్రాముల వరకు,పెద్దలకు రోజుకి 15 మిల్లీగ్రాముల వరకు మన శరీరానికి ఆహారపదార్ధాలు మరియు నీటి లో నుండి అందే జింక్ లో నుండి శరీరం బరువులో 1కిలోగ్రాముకి ఒక మిల్లీగ్రాముచొప్పున జింక్‌ను తీసుకోగల్గే సంపూర్ణ సామర్ధ్యత పరిమితి మటుకే కలిగి ఉంటుంది. జింక్ లోపం స్థాయి శిశువులలో: జన్యు సంబంధమైన అపక్రమం ఫలితంగా చిన్నప్రేవులు తగినంతగా జింక్‌ను శోషణం చేసుకోలేకపోవడం వలన జింక్ లోపం ఏర్పడుతుంది. పాలు తాగే దశ నుంచే జింక్ లోప లక్షణాలు కన్పిస్తాయి. శరీరంపై తీవ్రమైన చర్మగాయాలు (పొడలు), డయేరియా ( అతిసారవ్యాధి), జుట్టురాలిపోవడం, అభివృద్ధిలేకపోవడం. చికిత్సలోపించిన పిల్లలు శిశుదశ వరకు మాత్రమే జీవించుతారు. పెద్దలలో: జింక్ లోపంతో అభివృద్ధి జరగదు. ప్రత్యుత్పత్తి కణాల అభివృద్ధి తగ్గుతుంది. ఇది పురుషులలో సంతానోత్పత్తిశక్తిని లేకుండాచేస్తుంది. మూత్రాశయ కండరాల సంకోచాలు దెబ్బతిని గర్భవతులకు నొప్పులు రావడం కష్టమౌతుంది. జింక్ అధికస్థాయిలో ఉంటే సామాన్యంగా జింక్ విష తుల్యం కాని చిన్నపాటి లోహం. దీర్ఘకలంగా జింక్‌ను ఎక్కువగా తీసుకుంటే, రాగి, ఇనుము మరియు కాల్షియమ్ల జీవక్రియలలో జోక్యం వలన తీవ్ర రక్తహీనత, రోగనిరోధక శక్తి ఆణగద్రొక్కబడుతుంది. గర్భందాల్చిన సమయంలో స్త్రీలు అధిక మోతాదులో జింకు తీసుకున్నట్లయితే పుట్టే శిశువుపై తీవ్ర వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు