కాల్షియమ్ బలవైున ఎముకల నిర్మాణానికి, ఆరోగ్యకరమైన దంతాల ధృఢత్వానికి దోహదం చేస్తుంది. అస్థికండరాల మరియు హృదయకండరాలు పనిచేయుటకు రక్తం గడ్డకట్టడానికి , ఇతర కార్యకలాపాలకు కాల్షియమ్ ఆవశ్యకత ఉంది. కాల్షియమ్ అత్యధికంగా ఉండే ఆహార పదార్ధాలు. పాలు, జున్ను, పెరుగు (యొగర్ట్) వంటి పాల ఉత్పత్తులలో(జంతు సంబంధపు అహారాలలో అధికం) పుదీన లేదా తోటకూర లేదా ముల్లంగి ఆకులు వంటి ఆకు కూరలలో (కాయగూరలలో అధికంగా) రాగుల వంటి చిరు ధాన్యాలు జామ ,పియర్స్, మరియు సీతాఫలం వంటి పండ్లు, వీటన్నింటిలొ కాల్షిమ్ ఉంటుంది. కాల్షియమ్ను మన శరీరం ఎలా వినియోగించుకుంటుందిః బాల్య, కౌమా రదశలలొ గల పిల్లలకు కాల్షియమ్ను ప్రతీరోజు క్రమం తప్పకుండా తగినంతగా అందిస్తే ఎదుగుదలలో లోపం ఎముకల బలహీనత లేకుండా చేయవచ్చు. ఒక వ్యక్తికి పదిహేడేళ్ళు నిండే నాటికి తన శరీరం లోని ఎముకలు తాను వయస్కుడైనప్పుడు కావలిసిన పూర్తి కాల్షియమ్ పరిమాణం లోని 91% కాల్షియమ్ ను సమకూర్చుకుంటాయి. పదిహేడేళ్ళ వయస్సు నాటికి వయస్కుల కాల్షియం సాంద్రతలోని 91శాతం కాల్షియమ్ నిల్వ ఉంటుంది. 35 ఏళ్ళ వయసులో స్త్రీ పురుషులిద్దరి లో ఎముకలు పూర్తి స్థాయి సాంద్రతను కల్గి ఉంటాయి. 40వ పడికి వచ్చేటప్పటికి ఎముకలలో గల కాల్షియమ్ పరిమాణం తగ్గె ప్రమదం ఉంది. దీనిని నివారించుకునేందుకు శరీరంలో కాల్షియమ్ సాంద్రతను పెంచుకోవడం అవసరం. వరి, గోధువు వంటి ప్రధాన ఆహార ధాన్యాలలోలేదా ఆకు కూరలలొ ఫైటేట్లు, ఆక్జలేట్లు ఉండి కాల్షియమ్ను బంధించడం వలన శోషణప్రక్రియ లో అవరోధం ఏర్పడుతుంది. కాల్షియమ్ లోపం వలన ఎముకలు గుల్లబరుతాయి. వివిధ వయసుల వారికి అవసరమగు కాల్షియమ్ సంవత్సరం లోపు 525 1 - 3 సంవత్సరాలు 350 4 – 6 సంవత్సరాలు 450 7 – 10 సంవత్సరాలు 550 గుర్తుంచుకోవలసిన ఆరోగ్య చిట్కా చూలింతలు, బాలింతలకు కాల్షియమ్ ఆవశ్యకత అధికంగా ఉంటుంది. కాబట్టి కాల్షియమ్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం అవసరం. ఎందుకో మీకు తెలుసా? పిండం పెరుగుదలకు కావలసిన కాల్షియమ్ను గర్భవతులు తీసుకోవలసి ఉంటుంది. అట్లాగె పాల ద్వారా బాలింతలనుంచి బిడ్డకు కాల్షియమ్ చేరుతుంది. ఆహారం లో తల్లికి గనుక తగినంత కాల్షియమం అందకపోతే ఆమె ఎముకలనుండి పీల్చబడిన కాల్షియమ్ పిండం పెరుగుదలకు సరిపడుతుంది. అదేవిధంగా పసిపిల్లలకు పాలిచ్చేటప్పుడు పాలద్వారా కాల్షియమ్ అందుతుంది. దీని ఫలితంగా ఆమె ఎముకలు పెళుసుబారి, బలహీనమౌతాయి. సరిపడినంతగా పాలు, ఆకుకూరలు తీసుకోవాలని సూచించడవైునది. భారత దేశంలో గల స్త్రీలలొ చూలింతలకు, బాలింతలకు తడి సున్నం పూసిన తవులపాకులు నమలడమనే అభ్యాసం సాధారణంగా ఉండడంతో వారిలొ కాల్షియమ్ వృద్ధి చెందుతుంది. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు