ఎర్ర రక్తకణాలలో ఎర్ర రంగునిచ్చే హీమోగ్లోబిన్ లోని ప్రధాన భాగము ఇనుము. మన శరీరమంతటా ఆవ్లుజని సరఫరా కావడానికి హిమోగ్లోబిన్ తోడ్పడుతుంది. దీనికొరకు శరీరంలోని ఊపిరతిత్తులనుండి ఆవ్లుజనిని మిగిలిన శరీరమంతటికి అందడానికి ఇనుము అవసరం అవుతుంది. ఇనుము లభించేపదార్ధాలుః ముఖ్యంగా ఎర్రమాంసం, గొడ్డు మాంసం, ట్యూనా, సాల్మన్చేప రకాలు, గుడ్లు, చిక్కుళ్ళు మరియు పప్పుధాన్యాలు(అపరాలు), ఎండుద్రాక్ష (రైసిన్స్) వంటిఎండు ఫలాలు(డ్రైఫ్రూట్స్), పుదీనా, వంటి ఆకు కూరలు, గోధుమ, ఓట్ల వంటి సంపూర్ణంగా మరియు సమృద్ధిగా ఇనుమును కల్గిఉన్న ధాన్యాలు, ఇంకను ఇనుమును కల్గిఉన్న ఇతర లవణాలు. మనశరీరము ఇనుమును ఎలా వినియోగించుకుంటుంది? చాలావరకు శరీరము ఇనుమును పునర్వినియోగించుకుంటుంది. శరీరంలో ఉండే కొంత ఇనుము కాలేయము, ప్లీహములలో నిల్వ ఉంటుంది. శరీరమునుక్రమబద్ధీకరించే ప్రక్రియలో భాగంగా డ్యుయోడినమ్ జెజునమ్ పై భాగము (చిన్న ప్రేవు) నందుశోషణమౌతుంది. ఇనుములోపమేర్పడినప్పుడు, శరీరం ఎక్కువ ఇనుమును శోషణముచేస్తుంది. అయినప్పటికినీ ఇనుమును తక్కువమోతాదులో తీసుకునే వ్యక్తికి రక్తహీనత ఏర్పడుతుంది. ఇనుము శోషణం కావడంలో ప్రోత్సాహపరచేవి, ఆటంకపరచేవి. ఇనుము శోషణంలో కొన్ని సాధారణ ప్రోత్సాహకాలుః మాంసం, చేపలు, ఆస్కార్బిక్ ఆమ్లం , మాలిక్ ఆవ్లుం, లాక్టిక్ ఆవ్లుంలేదా సిట్రిక్ ఆవ్లుం, టార్టారిక్ ఆవ్లుం మరియు ఆల్కహాల్(సారాయి)వంటి, ఆర్గానిక్ (సేంద్రియ, జీవ సంబంధ) ఆవ్లూలు. ఇనుము శోషణంకావడంలో సామాన్యంగా ఆటంకపరచేవిఃపోలీఫినాల్స్ (టానిక్ ఆవ్లుం వంటివి)పుదీన,టమాటాలు, చాక్లేట్లు,ఫైటేట్లు,కాల్షియమ్, భాస్వరంలలోగల ఆక్జాలిక్ ఆవ్లుం. స్త్రీ, పురుష భేదాన్ని బట్టి, శరీరధర్మ స్థితిని బట్టిఆయా వ్యక్తులకు చాలా కొద్దిపాటి ఇనుము (1-3 మిల్లీగ్రాములు) కావలసి ఉంటుంది. కాని శరీర శోషణం పరిమితంగా ఉండడం వలన మనం భుజించే ఆహారంలో ప్రతిరోజు మన అవసరం కంటే 10-25 పాళ్ళు ఇనుము మనకు అవసరమౌతుంది. గుర్తుంచుకోవలసిన ఆరోగ్య చిట్కా ఇనుము శోషణ వృద్ధిలో చేసేవి, చేయకూడనివి. చెయదగినవి మీరు భుజించే ఆహారంలో ప్రతిరోజు నిమ్మ, నారింజ వంటి సిట్రస్ జాతికి చెందిన పండు ఉంటే ఇనుము శోషణం వృద్ధి చెందుతుంది. ఇనుము అనుబంధ ఆహారపదార్ధాలను గర్భవతులు ఎక్కువ మోతాదు లో తీసుకోవలసిఉంటుంది. చేయకూడనివిః ఆన్నం తిన్న వెంటనే టీ(తేనీరు) సేవించరాదు. తేయాకులోగల టేనిన్లు ఇనుప ధాతువు శోషణన్ని తగ్గిస్తాయి. కాల్షియమ్ ఇనుము శోషణాన్ని ఆటంకపరుస్తుంది కాబట్టి కాల్షియమ్, ఇనుము అనుబంధ పదార్ధాలను కలిపి తీసుకోకూడదు. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు