పోషకాహార నిరోధక కారకాల ఆంశికాలు ఆహారపదార్ధాలలో ఉండి, మనం తి నే ఆహారంలో గలపోషకాలవినియోగంలో జోక్యం చేసుకుటాయి. ట్రిప్సిన్ ఆటంక కారకాలు పప్పులు (లెగ్యూమ్ జాతి) కుటుంబపు మొక్కల లోను, గుడ్డులోని తెల్లసొన వంటి కొన్ని జంతు సంబంధిత ఆహార పదార్ధాలలోని మాంసకృత్తులలో ఈ అవరోధకాలు ఉంటాయి. ఆహార నాళంలోగల ట్రిప్సిన్ అనే ఎంజైమ్ చర్యలను అవరోధపరచి, మాంసకృత్తుల జీర్ణక్రియకు ఆటంకపరచి వాటి వినియోగాన్ని తగ్గిస్తాయి. ఇవి వేడిమితో నశిస్తాయి. సోయాబీన్, లైమీ బీన, మరియు రాజ్మా, చిక్కుడు, బాతు గుడ్డులోని తెల్లసొనలో గల ట్రిప్సిన్ను ఆటంకపరచే కారకాలను నశింపజేయాలంటే వీటిని అత్యధిక వేడిమికి గురిచేయడం అవసరం. దీనిద్వారా ట్రిప్సిన్ ను ఆటంకపరచేకారకాలు స్తబ్దత చెందుతాయి.ఆహారంలోగపోషకాలైన మాంసకృత్తుల వినియోగాన్ని మెరుగుపరచబడుతాయి. ఫైటేట్లు విత్తనాలలో విస్తారంగా వ్యాపింపజేయబడ్డాయి.శుద్ధిచేయని వరి వంటిఆహార ధాన్యాలు, చిరుధాన్యాలైన జొన్నలలో ఈఫైటేట్లు అత్యధికంగా ఉన్నాయి.ఫైటేట్లతో ఇనుము, జింక్, కాల్షియమ్,మెగ్నీషియమ్లు బంధింపబడి వాటి శోషణకు అవకాశమేర్పడదు. మొలకెత్తిన విత్తనాలలోఫైటేట్ల పరిమాణంతగ్గి ఇనుపధాతువు మెరుగుపరచబడుతుంది. టేనిన్లు లెగ్యూమ్ (పప్పులు) మొక్కలలోను, సుగంధద్రవ్యాలలోను, చింత పసుపు, కొన్ని కాయగూరలలోను, పండ్లయందు, చిరు ధాన్యాలైన సజ్జలు (బజ్రా), రాగులు, జొన్నలలోని బీజకవచములలో అత్యధిక గాఢతలో టేనైన్లు ఉంటాయి. ఇవి ఇనుముతో తక్షణమే బంధమై ఉండడం వలన ఇనుప ధాతువు శోషణంలో జోక్యముంటుంది. లెగ్యూమ్ ( పప్పులు) జాతుల మొక్కలలోని బీజ కవచములను తొలగించడంవలన, చింత, పసుపు, మొదలగు వాటి పరిమిత వినియోగంతో టేనిన్ పరిమాణం మనం భుజించే ఆహారంలోతగ్గడం వల్ల ఇనుప ధాతువు శోషణం మెరుగవుతుంది. ఆక్జలేట్లు ఆక్జలేట్లు లభించే మూలాలుః ఉలవలు , కేసరిపప్పు వంటి లెగ్యూమ్ (పప్పులు) జాతి మొక్కలు, తోటకూర, పుదీన, ములగాకులు వంటి ఆకుకూరలు. చింత చిగురు, అరటికాయలు, అరటిపువ్వు, నువ్వులు, తేయాకు, కోకోలలో ఇవి లభిస్తాయి. కాల్షియమ్ శోషణంలో ఇవి అవరోధం కల్గించి ,కరగని లవణాలుగా కాల్షియాన్ని రూపొందిస్తాయి. అధికంగా ఆక్జలేట్ పరిమాణముంటే మూత్ర నాళాలలో రాళ్ళు ఏర్పడతాయి. అందువల్లఎవరికై నా మూత్రంలో రాళ్ళు ఏర్పడిబాధపడ్తుంటేవారు ఆక్జలేట్ ఎక్కువగాఉన్న ఆహారపదార్ధాలను తి నకూడదు. గొయిట్రొజెన్లు / థైరాయిడ్ విరోధక పదార్ధాలు మొక్కల నుండి లభించే ఆహారంలో ఉండే ఈ పదార్ధాలు అయొడిన్ శోషణానికి నిరోధంకలిగిస్తుంది , వీటిని అధికంగా తీసుకునే వారికి అయోడిన్ లోపం ఏర్పడి గొయిటర్ వ్యాధికి గురౌతారు. అందువలన వీటిని గొయిట్రొజెన్ లని అంటారు. బ్రాసికా జాతికి చెందిన (ముల్లంగి , రేప్ సీడ్, ఆవాలు, టర్నిప్స్ ) మొక్కల ఆకులు, కాయగూరలలోను ఇవి ఉంటాయి. క్రూసిఫెరే కుటుంబానికి చెందిన (క్యాబేజి,కాలిఫ్లవర్ ,మొదలగునవి). సోయాబీన్స్ మరియు ఇతర లెగ్యూమ్ల (పప్పులు) లోను, సెనగలు, సజ్జలు, బఠాణి, యందుకూడ కొన్ని గొయిట్రొజెన్స్ ఉంటాయి. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు