ఈ సమూహములో పాలు,పాలపొడి,పెరుగు,మజ్జిగ,పన్నీర్ వగైరాలున్నాయి. శిశువులకు,పిల్లలకు పాలు మంచి ఆదర్శమైన ఆహారము,మరియు అన్ని వయసులవారికి మంచి అనుంబంధఅహారము. మంచి నాణ్యతగల మాంసకృత్తులకు ఇది మంచి ఆధారవనరు. పాలలో కాల్షియం,రైబోఫ్లోవిన్,విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి కానీ ఐరన్,విటమిన్ సి తక్కువగా లభిస్తాయి. మాంసాహారం తిననివారికి విటమిన్ బి 12 పాలలోనే లభ్యమవుతుంది. పాలలో సహజంగా ఉండే పోషక పదార్ధాలన్ని - పెరుగు, జున్ను వంటి వాటిలో కూడా ఉండాలంటే వీటిలోని నీరును తొలగించకూడదు. మీగడ తీసిన పాలలో క్రొవ్వు ఉండదు కానీ మాంసకృత్తులు మరియు తేమ లేని చక్కెర పుష్కలంగా ఉంటాయి. పెరుగులో కాల్షియం,ఫాస్ఫరస్,రైబోఫ్లోవిన్,విటమిన్ బి2,మరియు అయోడిన్ బాగా ఉంటాయి.అలాగే ఇందులో విటమిన్ బి12, పాంటోథెనిక్ యాసిడ్-విటమిన్ బి5,జింకు,పొటాసియం,మాంసకృత్తులు, మాలిబ్డినమ్ కూడా అధికంగా లభిస్తాయి. గుర్తుంచుకోదగ్గ ఆరోగ్యచిట్కాలు పచ్చిపాలల్లో బాక్టీరియా ఉండటంవల్ల అవి త్రాగటం ప్రమాదకరం.ఈ బాక్టీరియా వల్ల విరేచనాలు, క్షయ, బ్రుకెల్లోసిస్, టైఫాయిడ్ (సన్నిపాత జ్వరం)కు దారితీయవచ్చు.పాలను కాచటం వల్ల బాక్టీరియా సంహరింపబడుతుంది. అదేవిధంగా పట్టణప్రాంతాలలో పాలను పాశ్చరైజ్ చేస్తారు తద్వారా ప్రమాదకరమైన బాక్టీరియా నాశనమవుతుంది, పాలను తాగేందుకు అనువుగా అందులోని క్రొవ్వును సమానంగా సర్దుబాటుచేసేందుకు హోమోజనైజుడ్ చేస్తారు. కొందరికి పాలంటే పడదు (పాలచక్కెర – లాక్టోస్ సహించకపోవడం) వారు పెరుగును వినియోగించవచ్చు. పాలను తాగడం,పాల ఉత్పత్తులను వాడటం వల్ల శరీరం కాల్షియంను ఎక్కువగా నిలుపగలుగుతుంది. పెరుగు వల్ల శరీరములో రోగనిరోధకశక్తి పెరుగుతుంది అదేవిధంగా ఎముకల నిర్మాణానికి తోడ్పడుతుంది. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు