కూరగాయలు యాంటిఆక్సిడెంట్లు విరివిగా ఉండటంతోపాటు వివిధాలైన పోషకాలను అందిస్తాయి. కూరగాయల్ని ఈ విధంగా సమూహాలుగా విభజించవచ్చు ఆకుకూరలు వేర్లు మరియూ దుంపలు మిగతా కూరగాయలు. అకుకూరలు ఎన్నోరకాల ఆకుపచ్చఅకుకూరలు వినియోగిస్తున్నారు.సాధారణంగా వాడేవి పాలకూర, కొయ్యతోటకూర, మెంతికూర, ములక్కాయలు, పుదీనా మొదలైనవి. ఆకుపచ్చఅకుకూరలలో అధికంగా కాల్షియం,ఐరన్,బీటా-కెరొటిన్,విటమిన్-సి, రైబోఫ్లోవిన్, ఫాలికామ్లాలు ఉంటాయి. వేర్లు మరియు దుంపలు సాధారణంగా తినే ముఖ్యమైన దుంపకూరలు కర్రపెండలం,బంగళాదుంప,చిలగడదుంప,క్యారట్,కంద,చేమదుంప ఇవన్నీ పిండిపదార్ధాలను పుష్కలంగా కలిగియుంటాయి, మన ఆహారములో శక్తిని కలిగించే ముఖ్యమైన వనరులు. క్యారట్ మరియు పసుపచ్చరకాల కందలో సమృద్ధిగా కెరటిన్,బంగాళాదుంపల్లో విటమిన్ సి లభిస్తాయి. కర్రపెండలం,కందలో కాల్షియం విరివిగా లభిస్తుంది. మిగతా కూరగాయలు ఈ సమూహములో ఆకుకూరలలోనికి, వేర్లు,దుంపలోనికి రానివి ఉంటాయి. ఎక్కువగా తినే కూరగాయల్లో బీన్సు , వంకాయలు, బెండకాయలు, గోరుచిక్కుడు, పొట్లకాయ, సొరకాయ లాంటివి , రామములగపళ్ళు ఇవి భోజనములో వైవిధ్యంగా ఉండటమేకాక విటమిన్ సి మరియు కొన్ని ఖనిజాలను కలిగియుంటాయి. ఈ కూరగాయలు పధ్య సంబంధమైన పీచుపదార్ధాలను కలిగియుండటమే గాక ఆహారానికి స్ధౌల్యాన్ని అందిస్తాయి. గుర్తుంచుకోవాల్సిన ఆరోగ్య సలహా అన్నీ కూరగాయలూ తాజాగా ఉన్నప్పుడు మంచి రుచిని కలిగిఉండి విరివిగా పోషక విలువల్ని ఇస్తాయి. పోషక విలువలు కోల్పోకుండా ఉండాలంటే వాటిని సరైన పద్ధతిలో శుభ్రపరచడం మరియూ తయారు చేసుకోవటం ముఖ్యం. కూరగాయల్ని తరిగేముందు శుభ్రంగా కడుక్కోవాలి మరియూ తరిగిన కూరలని నీటిలో నాననివ్వ కూడదు దేనికంటే అలాచేస్తే అవి నీటిలో కరిగిపోయ్యే విటమినులు కోల్పోతాయి కూరగాయలను తరిగిన వెంటనే వంటచేసేయ్యాలి తద్వారా ఎక్కువ విటమిన్లను కోల్పోకుండా ఉంటాయి.తరిగిన కూరగాయలు ఎక్కువసేపు వాతావరణములో ఉంటే కూడా విటమిన్లను కోల్పోతాయి. ఎక్కువ విటమిన్లు వేడిని తట్టుకొలేవు. కాబట్టి ఎక్కువగా ఉడికించటం,వేయించటం వల్ల విటమిన్లు తగ్గుతాయి. ఉదాహరణకు క్యాబేజీని ఉడికించటంవల్ల సగానికి పైగా విటమిన్లు నశిస్తాయి. పరిమాణం తో పాటు వైవిధ్యం కూడా ముఖ్యమైనదే.మనం ఆరోగ్యంగా ఉండేందుకు విభిన్నమైన కూరగాయలు విభిన్నమైన పోషకాలను సమకూరుస్తాయి.విభిన్నమైన వర్ణాలలో ఉండే వాటిని వాడండి . ముదురు ఆకుపచ్చఅకుకూరలు,పసుపు,కమలా మరియు ఎర్రరంగు కూరగాయలు. గుర్తుంచుకోదగ్గ ఆరోగ్య చిట్కాలు ఆకుపచ్చఅకుకూరలు చౌకగా దొరకటమేగాక పౌష్టికాహారం కూడా.కాబట్టి ప్రతిదిన ఆహారములో కనీసం50గ్రాముల ఆకుపచ్చఅకుకూరలు ఉండేలాచూసుకోవటం మంచిది. ఆకుపచ్చఅకుకూరలను పిల్లలు,గర్భిణీ మరియు బాలింతలు ఇలా అందరూ తినవచ్చు. ఏడాదిపొడవునా ఆకుపచ్చఅకుకూరలను ఉచితంగా పొందాలంటే వాటిని ఇంటిపెరడులో,పాఠశాలల్లో పెంచండి. పెరటిలో ములగ,మద్రి లాంటి చెట్లను పెంచినట్లైతే పెద్ద శ్రమలేకుండానే నిత్యమూ పచ్చ్టటిఆకుకూరలను పొందవచ్చు. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు