ఉప్పు మన ఆహారానికి ముఖ్యమైన సంకలనాత్మక పదార్ధం. మనదేశంలో వాడే ఉప్పు ముఖ్యంగా సముద్రపు ఉప్పు, అందులో కేవలం సోడియం క్లోరైడ్ (యన్ ఏ సి యల్)మాత్రమే ఉంటుంది. మన దేశంలో ప్రతీరోజుకి రమారమి 15గ్రాములు తీసుకుంటాం. ఉప్పు ఎక్కువగా తీసుకోవటం వల్ల రక్తపోటు కలుగవచ్చు సహజమైన ఆహారపదార్ధాల వల్ల లభించే ఉప్పు గణనీయమైంది కాదు. మనం ఆహారపదార్ధాల్లో చేర్చే ఉప్పే గణనీయమైంది ఎలెక్ట్రాలైట్ సమతుల్యతను సంతృప్తపరచేందుకు గానూఉప్పు మరియూ పొటాసియం లను సరైన నిష్పత్తితో తీసుకోవాలి. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు