నేరేడు సుగుణాల రేడు మీకు తెలుసా? నల్లగా నిగానిగలాడే నేరేడు పండును చూస్తేనే నోరూరి పోతుంది. కండ తక్కువ, గింజ పెద్దది కనుక ఎన్ని తిన్నా తిన్నట్టే ఉండదు. ఇవి రుచి లోనే కాదు ఆరోగ్యానికే మేలయినవి. వీటితో ఎన్ని లాభాలున్నాయంటే. నేరేడు పండు తినడం వల్ల శరీరానికి అవసరమైన కాల్షియం ఐరన్, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, సోడియం, సల్ఫర్, థియామిన్, రిబోఫ్లోవిన్, ఫోలిక్ యాసిడ్, ఎ, బి1, బి2, బి3, బి5, బి6, సి విటమిన్లు అందుతాయి. రక్తపోటును తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తాయి. గుండెకు మేలు చేస్తాయి. బరువు తగ్గడంలో తోడ్పడతాయి. కీళ్ల నొప్పులను నివారిస్తాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి. గొంతు సమస్యలను నివారిస్తాయి. జుట్టు రాలదు. కుదుళ్ళు ధృడంగా ఉంటాయి. శరీరంలో చేరిన మలినాలను హరిస్తాయి. కాలేయాన్ని సంరక్షిస్తాయి. మూత్ర పిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మం కాంతితోమెరిసేలా చేస్తాయి. మెదడు పనితీరుని మెరుగుపరుస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణ ప్రక్రియ సాఫీగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడుతున్నవారు వీటిని తీసుకోవడం వల్ల సత్వర ప్రయోజనం ఉంటుంది. ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యాలను తగ్గిస్తాయి. నేరేడు గింజలు మధుమేహం నుంచి ఉపశమనం కలిగిస్తే, ఆకులు అలర్జీలను తగ్గిస్తాయి. ఆధారం : పాడిపంటలు