వంట తయారీ విధానాలు మరియు పోషక విలువలు ఆహారం వండుట అనేది చాలా ప్రయోజనాలతో కూడుకున్న విలువల్ని పెంచే ఒక ప్రక్రియ. కాని ఈ ప్రక్రియ పోషక విలువలకు సంబంధించిన కొన్ని పరిమితులతో కూడుకున్నది. మొదటి ఉప విషయం : వంటకం – ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు కళ్ళకు ఇంపుగా చేసి మరియు నోటికి రుచిని ఇస్తుంది. ఆహారాన్ని శుద్ధి చేసి ఎక్కువ ప్రమాణాలని పెంచడంలో దోహదపడుతుంది. ఆహారం జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. అయినప్పటికిని, వండుట వలన కొన్ని పోషకాలను కోల్పోతాము. ఇది, వండే టప్పుడు ఎంతనీరు వాడతాము, ఆ నీటిని వదిలి వేస్తామా లేదా, వండు సమయం, వండే ఉష్ణోగ్రత మరియు బహిర్గతం చేసే ఉపరితల వైశాల్యం మీద ఆధారపడి ఉంటుంది. వండే విధానాలు సాంప్రదాయ పద్ధతి, స్వయం అభిరుచులు, వండే వంటకాన్ని బట్టి ఒక వంటని చాలా రకాలుగా వండు కోవచ్చును, ఈ వంటలు చేయు పద్ధతుల వల్ల ప్రయోజనాలు మరియు అప్రయోజనాలను క్రింద క్లుప్తంగా విశదీకరించబడినవి. వేపుట వేపుట అనేది వేడెక్కిన నూనెలో కాని, కొవ్వులో కాని వండే పద్ధతి. వేగంగా చేయు పద్ధతి ఆహారములు దోరగా కాని లేక బాగా వేయించవచ్చు. ఆహారాన్ని బాగా వేయించాలంటే, ఆ పదార్థాలను వేడినుండి కాపాడటానికి మరియు పోషక విలువలు పోకుండా ఉండటానికి గాను పదార్థాలను పూత పూయాలి. ఉదహరణకి పిండి, పాలు, గుడ్డు ఆహార పదార్ధాలకు పూతగా పూయవచ్చును. వైద్య చిట్కాలు : మంచి వేపిన పదార్థాల కోసం కొన్ని సూచనలు. శుభ్రమైన నూనెను గాని కొవ్వును వాడవలెను. సరైన ఉష్ణోగ్రతను వాడవలెను. (కొవ్వు సరిగా వేడెక్కక పోతే, పదార్థాలు నూనెను ఎక్కువగా పీల్చుకుంటాయి. నూనె వేడెక్కిందా లేదా అని చూడడానికి కొంచెం పిండిని వేసి చూడాలి) ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోకుండా, ఒక్కసారి కొన్ని ముక్కలు మాత్రమే వేపండి. నూనె/ కొవ్వును పదే పదే వేడి చేసినట్లైతే, పెరోక్సిడేషన్ మరియు రాన్సిడిటి వల్ల వాటిలో విష పదార్థాలు ఉండవచ్చును. అందుచేత ప్రతీసారి అదే నూనె/ కొవ్వును మళ్ళీ మళ్ళీ ఉపయోగించ కుండా, వేపడానికి కొద్ది మోతాదులోనే నూనె/ కొవ్వును ఉపయోగించాలి. సరైన సమయానికి ముక్కలు తిప్పుతూ ఉండాలి. పూత, ఆహారానికి సమానంగా ఉండాలి. వేపిన కొద్దిసేపటికి నూనె/ కొవ్వు తగ్గితే. మళ్ళీ కొంత కలప వచ్చును. ఉడక పెట్టుట మరిగే ద్రవంలో ఆవిరి ద్వారా వండుటను ఉడికపెట్టడం అంటారు. వ్రేళ్ళు, దుంపలు మరియు గట్టిగా ఉండు పదార్థాలు సాధారణంగా ఉడికించబడతాయి. ఎక్కువగా ఉడికించుట వలన పైపొరపోవడం, పోషకవిలువలు తగ్గిపోవడం, సువాసన తగ్గి పోవడం మరియు జీర్ణం కాక పోవడం జరుగుతాయి. నీటిలో కలిసిపోవు విటమిన్లు ద్రవం లోకి వచ్చి కలిసిపోతాయి. ఉడికించుట వలన ఎక్కువగా పోషకాలు పోతాయి. ఉడికించుట ద్వారా బాగావండుటకు వైద్య చిట్కాలు. నీటిని తక్కువగా వాడండి. పదార్థాలు మునిగేటట్టు వాడాలి. పదార్థాలు ఉడకక మునుపే నీరు ఆవిరై పోతే ఇంకా నీటిని చేర్చవచ్చు. బిగుతుగా పట్టే మూతఉన్న పెనం మాత్రమే వాడండి. దీనివల్ల ఆవిరి పోకుండా ఆపి త్వరగా వండవచ్చును. పోషకాలను, సువాసన కాపాడుటకు మరిగే నీటిలో కూరగాయలను వేయండి. ఒక సారిగా ఉడకనిచ్చి, మంట తగ్గించి బాగా ఉడికే వరకు ఉంచండి. ఆవిరిపెట్టుట ఆవిరిపెట్టుట అనేది కూడా వత్తిడితో ఆవిరి ద్వారా వండడం.ఇది వత్తిడితో చేయని పక్షంలో ఉడకపెట్టే విధానం కంటే చాలా మెల్లగా జరిగే ప్రక్రియ. మిగతా విధానాలతో పోలిస్తే ఆవిరితో వండిన ఆహారం చాలా తేలిగ్గా మరియు సులువుగా అరుగుతుంది. మాంసాహారం వండే టప్పుడు అతిగా వండుట లేక ప్రోటీన్లు గట్టి పడి పోవుట వంటి సమస్యలు తక్కువగా ఉంటాయి. పోషకాలను కోల్పోయే సమస్య ఈ పద్ధతి ద్వారా చాలా తక్కువగా ఉంటుంది. ప్రెషర్ కుకింగ్ అంటే ఆవిరిని వత్తిడితో వండుట. ఉష్ణోగ్రత 115 నుండి 120 డిగ్రీల సెల్సియస్ వరకు పెంచబడుతుంది. కావున వండుటకు సమయం తక్కువ పడుతుంది. పోషకాలను, ఇంధనాన్ని మరియు సమయాన్ని కాపాడు కొనుటకు ఇది చాలా ఉత్తమమైన పద్ధతి. ఈ పద్ధతి ఆహారాన్ని రుచిగా చేస్తుంది. ఆవిరి ద్వారా వండుటకు కొన్ని వైద్య చిట్కాలు పదార్థాలు ఉంచిన గిన్నెను పెట్టక మునుపే నీరు మరిగించు కోవలెను. స్టీమర్ లో ఉన్న నీటిని ఆవిరై పోనివ్వకూడదు. ఆవిరి చేయుటకు బిగుతుగా పట్టే మూతఉన్న పెనంను వాడవలెను. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు