ఫుడ్ ప్రోససింగ్ పంటకోత సమయనుండి దుకాణాలకు చేరు వరకు ఆ పదార్ధాలు ఏమేమి చేయబడతాయో ఆ ప్రక్రియనంతా ఫుడ్ ప్రోససింగ్ అంటారు. ఎటువంటి రకమైన ఆహారమైన, తినడానికి ముందు ప్రోససింగ్ చేయబడతాయి. నిల్వ ఉంచు కొనుటకు వీలుగాను, జీర్ణించుటకు సులువు గాను, ఎక్కువగా ఉన్నప్పుడు దాచు కోడానికి వీలుగా ఫుడ్ ప్రోససింగ్ చేయబడుతుంది. ఫుడ్ ప్రోససింగ్ లో రకాలు ప్రధమ దశ ప్రోససింగ్ – ఈ దశ కోతకి వచ్చిన పంటను తినగలిగే ముడిపదార్ధంగా మారుస్తుంది.ఉదాహరణకి – ఊక తీయడం , మరలో వేయడం, నూరుట, పంటలనుంచి బియ్యం, గోధుమలు, పప్పులుగా మార్చుట, పాలనుంచి క్రీమ్ ని తీయుట. రెండవ దశ ప్రోససింగ్ – శుద్ది చేసిన పిండి, శుద్దిచేసిన నూనె, పంచదార, చల్లగా గడ్డ గట్టిన పదార్ధాలు, డిహైడ్రేటెడ్ పదార్ధాలను ఇస్తుంది. మూడవదశ ప్రోససింగ్ – ఈ పద్ధతిలో తినటానికి తయారుగా ఉంచబడే పదార్ధాలను చేయుటకు గాను చాలా ఎక్కువ క్లిష్టమైన సాంకేతిక పద్దతుల్ని ,మిశ్రమాలను వాడతారు.ఈ పద్దతిలో డబ్బాలలో ఉంచే ఆహారం, బేకరి ఆహారం, కూల్ డ్రింకులు, క్షణం లో చేసే (ఇన్ స్టాంట్) ఆహార పదార్ధాలు మొదలైనవి చేస్తారు. ప్రోసెస్డ్ ఆహారం లో అందుబాటులో ఉండు పోషకాలు. ప్రోసెస్డ్ ఆహారం వేర్వేరు పధ్ధతుల ద్వారా తయారవుతుంది కాబట్టి. పోషకాలు కోల్పోతాయి. రొట్టెలో, నూడుల్స్ లో, ధాన్యాలలో బి-కాంప్లెక్స్ విటమిన్లు మరియు పీచు పదార్ధాలు లోపిస్తాయి. పచ్చళ్ళు, జామ్ లు, సాస్ లు, అప్పటి కప్పుడు తయారు చేసుకునే సూప్ లు, డబ్బాలలో ఉంచే ఆహారం మరియు డిహైడ్రేటెడ్ పదార్ధాలలో కొవ్వు రూపంలో మరియు షుగర్ రూపం లో చాలా కెలరీల శక్తి ఉంటుంది. కాని ప్రోటీన్, విటమిన్ మరియు పీచు పదార్ధాలు లోపిస్తాయి. చాకెట్లు, బంగాళాదుంపచిప్స్, మిఠాయిలు, సోడాతో కూడిన పానీయాలు, కాపాడగల పోషకాలు లేకుండా ఖాళీ కెలరీలను అందిస్తాయి (కొవ్వు, షుగరుతో). కొన్ని ప్రోసెస్డ్ ఆహారాలు మాత్రం విటమిన్లు మరియు ఖనిజాలతో నిండి ఉంటాయి. ఉదాహరణకి - కాల్షియం మరియు ఐరన్ తో కూడిన ధాన్యపు ఆహారాలు. ఇలాంటి ఆహారాలలో ఎక్కువ, షుగరు, తెల్లపిండి, ప్రోసెస్డ్ మరియు హైడ్రోజినేటడ్ నూనెలు ఎడిటివ్ లు, కృత్రిమ విటమిన్లు కలిగి ఉంటాయి. సరైన రీతిలో వినియోగించకపోతే ఇవిచాలా ప్రమాదకరం. ఫుడ్ ప్రోసెసింగ్ కొన్ని సందర్భాలలో ఆహార పదార్ధాల యొక్క పోషకవిలువలను పెంచుతాయి. ఉదాహరణకి - ఎక్కువ వేడి చేయడం వలన, ఆ ఉష్ణోగ్రత ఆహారంలో ఉన్న వ్యతిరేక పోషక కారకాలు అయిన ట్రిప్సిన్ను ధ్వంసం చేస్తుంది. ప్రోసెసింగ్ ఫుడ్ వినియోగదారునికి ఫ్యాకెట్ రూపంలో చేరుతుంది. దీని వల్ల సూక్ష్మజీవుల పెరుగు దలకు ఆస్కారం ఉంది. వైద్య చిట్కాలు ప్రోసెస్డ్ ఆహారం మితంగా తీసుకోవాలి. ప్రతి రోజు తీసుకునే ఆహారం స్ధానంలో ఈ ఆహారం చోటు చేసుకోకుండా పిల్లలు, పెద్దలు జాగ్రత్త పడాలి. దీనివల్ల న్యుట్రిషన్ తగ్గిపోయి, మైక్రోన్యుట్రియంట్స్ తగ్గిపోయి చాలా సమస్య లను ఆరోగ్య రీత్యా ఎదుర్కో వలసి వస్తుంది. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు