ఆహారంలో కలిపే పదార్థాలు ఆహారంలో కలిపే పదార్థాలు (ఫుడ్ ఎడిటివ్స్) అనేవి ఆహారంలో తక్కువ మోతాదులో కలుపే రసాయనాలు. ఆహారం బాగా కనిపించడానికి, రుచిగా ఉండటానికి, పోషక విలువను పెంచడానికి, తాజాగా ఉండటానికి ఆహారం తయారు చేసేటప్పుడు కావాలనే ఈ రసాయనాలని కలుపుతారు. ఎడిటివ్స్ అనేవి రసాయినిక పదార్థాలు కాబట్టి, వాటి వాడకం కల్తీ ఆహారాన్ని నిరోధించే (ఫుడ్ అడల్ ట్రేషన్) చట్టం క్రింద నియంత్రించబడుతుంది. ఈ రసాయినిక పదార్థాలు కేన్సర్, జీర్ణసమస్యలు, నరాల సంభంధించిన సమస్యలు, అధిక బరువు ఇంకా గుండె జబ్బుల్లాంటి సమస్యలకు కారణం అవుతున్నాయి. కావున వాటిలో వాడమన్న వాటినే వాడాలి. ఎక్కువ మోతాదులో వాడితే ప్రకృతిపరమైన ఎడిటివ్స్ కూడా చాలా హానికరం కావచ్చు. (ఉప్పు ఒక ఉదాహరణ) ఆహారం తయారు చేసే సంస్థలలో సాధారణంగా వాడే ఎడిటివ్ లు. ఆమ్లములు - వెనిగర్, సిట్రిక్ ఆమ్లము, టార్ టారిక్ ఆమ్లము, మాలిక్ ఆమ్లము, ఫుమారిక్ ఆమ్లము, లాక్టిక్ ఆమ్లము. యాంటి కేకింగ్ ఏజంట్లు - పాలపొడి లాంటి పొడులను అంటుకోకుండా ఆపుతుంది. ఉదాహరణకి - కాల్షియం సిలికేట్ మరియు మెగ్నీషియం స్టీరేట్. యాంటి ఆక్సిడెంట్స్ - విటమిన్ సి లాంటి యాంటి ఆక్సిడెంట్లు ఆమ్లజని యొక్క ప్రభావం పడకుండా ఆహారం నిల్వఉంచడంలో సహాయపడతాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బల్కింగ్ ఏజంట్లు - గెంజి లాంటి బల్కింగ్ ఏజంట్లు పోషక విలువలు ఏమి చెదరకుండా ఆహార పరిమాణాన్ని పెంచడానికి దోహద పడతాయి. ఆహారం తయారు చేసేటప్పుడు కోల్పోయిన రంగులను మళ్ళీ రావడానికి లేదా ఆహారం ఇంకా ఆకర్షణీయంగా కనపడటానికి రంగులు వాడతారు. యమల్సి ఫైయర్లు - ఇవి నీరు మరియు నూనె కలిసి పోవటానికి ఉపయోగపడతాయి. దీనివల్ల ఆహారం ఐస్ క్రీం లాగా సమానంగా, మెత్తగాను ఉంటుంది. ఉదాహరణకి - గుడ్డు సొన, లెసిథిన్ మరియు మోనో గ్లిసరైడ్లు. ఫ్లావర్లు - ప్రత్యేకమైన ఆహారం రుచి కొరకు మరియు మంచి సువాసన కొరకు వాడే ఎడిటివ్ లను ప్లావర్లు అంటారు. ఇవి ప్రకృతి మిశ్రితాలు లేక కృత్రిమమైనవి కూడా కావచ్చు. ఫుడ్ ప్రిజర్వేటివ్స్ - ఉప్పు లేక హైడ్రోజన్ సల్ఫైడ్ లాంటి రసాయనాలు, స్టెబిలైజర్స్ - ఒక నిర్ధిష్టమైన రూపును ఇస్తాయి. ఉదా - జామ్ లో వాడేది అగర్ లేక పెక్టిన్ స్వీట్నర్స్ - ఉదాహరణకి - ఆస్పెర్టేమ్ మరియు సుక్రాలోజ్. థిక్నర్స్ – ఆహారం యొక్క ధర్మాల్ని పెద్దగా మార్పుచేయకుండా దాని యొక్క సాంద్రతను పెంచుటకు ఉపయోగపడునవి. ఉదాహరణకి గార్ జిగురు మరియు జెలెటిన్. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు