ఆహారం పాడవటం వాసన,రుచి మొదలైనవాటిమీద ఆధారపడి ఉపయోగించటానికి పనికిరాదని వ్యక్తిగతంగాగ్రహించటంద్వారా ఆహారం పాడయిపోయిందని నిర్ధారించవచ్చు. పాడయిపోయే సున్నితత్వాన్ని ఆధారం చేసుకుని ఆహారపదార్ధాలను పాడవనివి(ఉదాహరణ:ధాన్యాలు)కొద్దిగా పాడయ్యేవి(పళ్ళు మరియు కూరగాయలు)పాడయ్యేవి(మాంసం మరియు పాలు) సాధారణంగాపాడయ్యేవాటిని,కొద్దిగా పాడయ్యేవాటిని శీతలీకరణంలో ఉంచటంద్వారా వాటిని పాడవకుండా నిలపవచ్చు మరియు అవిమన్నేకాలాన్ని పెంచవచ్చు. సాధారణ ఆహారపదార్ధాలు పాడవకుండా ఆరోగ్యచిట్కాలు మాంసం:తాజా మాంసాన్ని చలిపుట్టించే,గడ్డకట్టించే ఉష్ణోగ్ర్తతలవద్ద శీతలీకరణం లో ఉంచాలి. గుడ్లు:అప్పుడే పెట్టిన గుడ్డు దాదాపు సూక్ష్మజీవిరహితంగా ఉంటుంది కానీ ఏమన్నా పగుళ్ళు ఏర్పడితే కలుషితం అవుతుంది.కొవ్వొత్తి వెలుతురు లో తిప్పటం వల్ల పగుళ్ళు,చీడలు మొదలైనవాటిని కనుగొనవచ్చు. చేపలు మరియు యితర సముద్ర ఉత్పత్తులు:తాజా చేపలు మరియు చిన్నరొయ్యలు పాడయితే విపరీతమయిన వాసనవస్తుంది.ఉప్పు పట్టించిన చేపలు మరియు నత్తలు పలచని ఎరుపురంగులోకి మారతాయి.పాడవకుండా ఉండాలంటే చేపలను సరైనపద్ధతిలో పట్టుకోవాలి మరియు భధ్రపరచాలి . ఫలాలు మరియు కూరగాయలు:పంటకొతకు ముందు,తర్వాత కలుషితం కావచ్చు.సరిగా సేకరించటం,రవాణా మరియు భధ్రపరచటం కీలకమైనవి. పాలు:పితికినవెంటనే పాలను మరిగించాలి,పాశ్చరైజేషన్ కూడా పాలలోని అతిసూక్ష్మజీవులను సంహరిస్తుంది.పాలు మరియు పాల ఉత్పత్తులని మరొక సారి ఉపయోగించేవరకూ వాటిని శీతలీకరణలో ఉంచాలి. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు