ఈ చిన్న వుస్తకం గురించి వివరణ. బీమా నియంత్రణ మరియు అభిషృద్ధి అధికారవర్గం (ఐఆర్‌డిఎ) వారి ద్వారా ఈ చిన్న పుస్తకం ఆరోగ్య బీమాపై ఒక మార్గదర్శినిగా రూపొందించబడినది మరియు ఇది సాధారణ సమాచారం మాత్రమే అందజేస్తుంది. ఇందులో ఇవ్వబడిన సమాచారం ఏదీ కూడా ఒక బీమా పాలసీ యొక్క నియమాలు ఈ చిన్నపుస్తకం గురించి వివరణ మరియు షరతులను మార్చవు లేదా అధిగమించవు. ఒక పాలసీ గురించిన నిర్దిష్టమైన సమాచారం కొరకు లేదా మరే ఇతర అదనపు సమాచారం కొరకు ఒక లైసెన్సు పొందిన ఏజెంటును లేదా బోకరును లేదా ఐఆర్డిఎతో నమోదు చేయబడిన ఒక బీమా కంపెనీని సంప్రదించగలరు. ఆరోగ్య బీమా "ఆరోగ్య బీమా' అనే పదం, మీ వైద్య ఖర్చులకు తప్పనిసరిగా ఆచ్చాదన కల్పించే ఒక రకం బిమాకు వర్తిస్తుంది. ఇతర పాలసీల లాగానే ఒక ఆరోగ్య బీమా పాలసి, బీమా కంపెనీ వారు మరియు ఒక స్వతంత్ర వ్యక్తి/బృందం మధ్య ఒడంబడిక, ఇందులో బీమా కంపెనీ వారు పాలసీలో నిర్దిష్టంగా తెలుపబడిన నియమాలు మరియు షరతులకు లోబడి ఒక నిర్ధారిత . “ప్రీమియమ్” వద్ద నిర్దిష్టమైన ఆరోగ్య బీమా ఆచ్చాదనను అందజేయడానికి అంగీకరిస్తారు. ఒక ఆరోగ్య బీహా పాలసీ సాధారణంగా ఆచ్చాదన కల్పించేది ఏమిటి ? ఒక ఆరోగ్య బీమా పాలసీ సాధారణంగా బీమా చేయబడిన ప్రతి వ్యక్తికి సంబంధించి ఈ క్రింద పద్దుల క్రింద భరాయించిన సముచితమైన మరియు అవసరమయిన ఖర్చులకు ఆచ్చాదన కల్పిస్తుంది, బీమా వేయబడిన మొత్తంమీది గరిష్ట పరిమితికి (సీలింగ్) లోబడి కల్పించబడుతుంది (ఒక పాలసీ వ్యవధిలో చేసే అన్ని దావాలు) గది, భోజన ఖర్చులు నర్సింగ్ ఖర్చులు సర్జన్, మత్తుమందిచ్చే డాక్టరు, డాక్టరు, కంసట్టెంట్లు , నిపుణుల ఫీజు మత్తు, రక్తం, ప్రాణవాయువు, ఆపరేషన్ ధియేటర్ ఛార్జీలు, శస్త్రచికిత్స ఉపకరణాలు, మందులు, కౌషధ్రాలు, రోగనిర్ధారణ వస్తువులు, ఎక్స్-రే, డయాలసిస్, కమోథెరపి, రేడియో థెరవి, పేస్ మేకర్ ఖరీదు, కృత్రిమ అవయాలు, వీటి ఖరిదు లేదా అవయవాలు మరియు ఇలాంటి ఖర్చులు. బీమా చేయబడిన మొత్తం ఆఫర్ చేయబడిన బీమా చేయబడే మొత్తం వ్యక్తి ఆధారంగా లేదా మొత్తం కుటుంబానికి ఫ్లోటర్ ఆధారంగా ఉంటుంది. సంచిత (క్యుములేటివ్) బోనస్ (సిబి) ఆరోగ్య బీమా పాలసీలు సంచిత బోనస్‌ను అందజూపవచ్చును, ఇందులో దావా (క్లెయిమ్) చేయని ప్రతి సంవత్సరం, బీమా చేయబడిన మొత్తం ఒక నిశ్చితమైన శాతం చొవ్పున, ఒక గరిష్ట శాతానికి లోబడి (సాధారణంగా 50%) పునరుద్ధరణ (రెన్యూవల్ సవుయుంలో ఎక్కువ చేయబడుతుంది, దావా చేసినట్లయితే. తదుపరి పునరుద్ధరణ సమయంలో సిబి 10% తగ్గించబడుతుంది. ఆరోగ్య పరీక్షల ఖర్చు ఆరోగ్య పాలసీలు ఆరోగ్య పరీక్షల ఖర్చునుకూడా తిరిగి చెల్లించే వెసులుబాటుని కలిగియుండవచ్చును. ఏది అనుమతించబడుతుందో అర్థం చేసుకోవడానికి మీ పాలసీని జాగ్రత్తగా చదవాలి. ఆసువత్రిలో ఉండపలసిన కనీస వ్యవధి పాలసీ క్రింద దావా చేయడానికి అర్హత పొందడానికి, కొన్ని గంటల పాటు ఆసుపత్రిలో కనీసంగా ఉండాల్సి ఉండటం అవసరం. మామూలుగా ఇది 24 గంటలు ఉంటుంది. ఈ సమయ పరిమితి ద్యుర్ధటన వల్ల కలిగిన గాయాల చికిత్సకు మరియు కొన్ని నిర్దిష్టమైన చికిత్సలకు వర్తించకపోవచ్చును. వివరాలను అర్ధం చేసుకోవడానికి పాలసీ నియమాలను వదవాలి. ఆసుపత్రిలో చేరక ముందు మరియు చేరిన తరువాత ఖర్చులు ఆసువత్రిలో చేరక ముందు కొన్ని నిశ్చితమైన సంఖ్యలోని రోజులలో భరాయించిన ఖర్చులు మరియు డిశ్చార్డి . చేసిన తరువాత నిర్దిష్టమైన వ్యవధిలో ఆసుపత్రి తరువాతి ఖర్చులు కూడా, ఖర్చులు వ్యాధి/సుస్తీకి సంబంధించడానికి లోబడి, దావాలో భాగంగా పరిగణించబడవచ్చును, ఈ విషయంలో నిర్దిష్టమైన ఏర్పాట్లను పరిశీలించాలి. నగదురహిత సౌకర్యం దేశంలోని ఆసుపత్రుల నెట్‌వర్క్‌తో బీమా కంపెనీలు ఒక ఒప్పందం ఏర్పాటును కలిగియుంటాయి. పాలసీ దారుడు కనుక నెట్ వర్క్ ఆసుపత్రులు దేనిలోనైనా చికిత్స చేయించుకుంటే, అప్పుడు బీమా చేయించుకున్న వ్యక్తి ఆసుపత్రి బిల్లులు చెల్లించవలసిన. పని లేదు. బీమా కంపెనీ తన. థర్డ్ పార్టి ఎడ్మిన్స్టేటర్(టివిఎ) ద్వారా సరాసరి ఆసుపత్రికి డబ్బులు చెల్లిస్తుంది. పాలసీ ద్వారా నిర్ధారించబడిన ఉప పరిమితులను మించిన ఖర్చులు లేదా పాలసీ క్రింద ఆచ్చాదన కల్పించబడని అంశాలకు ఖర్చులు ఆసుపత్రికి బీమా చేయబడిన వ్యక్తి నేరుగా చెల్లించాల్సి ఉంటుంది. బీమా చేయబడిన వ్యక్తి జాబితాలో చేర్చబడని ఆసుపత్రులలో కూడా చికిత్స చేయించుకోవచ్చును, అలా చేస్తే, బిల్లులను అతడు ముందుగా చెల్లించాలి, తరువాత బీమా కంపెనీ నుండి తిరిగి చెల్లింపును పొందాల్సి ఉంటుంది. ఇక్కడ నగదు రహిత సౌకర్యం లభ్యం కాదు. అదనవు ప్రయోజనాలు మరియు ఇతర స్టాండ్ ఎలోన్ పాలసీలు బీమా కంపెనీలు “ఏడ్ ఆన్స్” లేదా రైడర్లని పిలిచే పలు ఇతర రకాల ప్రయోజనాలను అందజూపుతాయి. “హాస్పిటల్ క్యాష్”, “క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్”, “సర్జికల్ ఎక్స్పెన్సెస్ బెనిఫిట్స్” వొొదలయినటువంటి ప్రయోజనాలు అందజేయడానికి రూపొందించబడిన స్టాండ్. ఎలోన్ పాలసీలు కూడా ఉన్నాయి. ఈ పాలసీని విడిగా లేదా ఆసుపత్రిలో చేరే పాలసీకి అదనంగా తీసుకోవచ్చును. కొన్ని కంపెనీలు టాప్ అప్ పాలసీల స్వభావం కల పథకాలతో ముందుకు వచ్చాయి, ప్రాథమిక ఆరోగ్య పాలసీలో లభ్యమయ్యే పరిమితిని అధిగమించి ఆయిన అసలు ఖర్చులను చెల్లింవడానికి ఇవి రూపొందించబడ్డాయి. మినహాయింపులు ఆరోగ్య పాలసీల క్రింది ఈ క్రిందివి సాధారణంగా మినహాయించబడతాయి: ముందుగానే ఉన్న అన్ని జబ్బులు (ముందుగానే ఉన్న వ్యాధుల మినహాయింపును, అన్ని సాధారణ బిమా మరియు ఆరోగ్య బీమా కంపెనీలు ఒకే రీతిగా నిర్వచించాయి) పాలసీ క్రింద మొదటి సంవత్సరంలో , కవర్ తేదీ నుండి మొదటి 30 రోజుల సమయంలో సుస్తీ/వ్యాధికి వేసే ఏదైనా దావా. దుర్టటన కారణంగా కలిగిన గాయాలకు సంబంధించిన దావాకు ఇది వర్తించదు. ఆచ్చాదన యొక్క మొదటి సంవత్సరం -కంటిశుక్ల్షం, బెనిన్ ప్రోస్టోటిక్ హైవర్ట్రాఫి, మెనోరాజియా లేదా ఫైబోమైయోమా కొరకు హిస్ట్రోరిక్టమి, హెర్నియా, హైడ్రోసెల్ పుట్టుకతో వచ్చిన అంతర్గతంగా ఉన్న వ్యాధి, గుదంలో ఫిస్టులా, మొలలు, సైనసైటిస్ మరి సంబంధిత అపవ్యవస్థలు ఒకవ్యాధి చికిత్సకైతే తప్ప సుంతి చేయించుకోవడం కళ్ళద్దాలు, కాంటాక్ట్ లెన్సులు, వినికిడి యంత్రాలు ఆసుపత్రి చేరవలసిన ఆవసరం వస్తే తవ్ప పంటి చికిళ్స/శస్త్రచికిత్స వ్యాధి నుండి కోలుకోవడం, సాధారణ. అసక్తత, పుట్టుకతో వచ్చిన బాహ్య లోపాలు, వి.డి. కావాలని స్వయంగా గాయపరమకోవడం, మత్తును కలిగించే బౌషధాలు/మద్యాన్ని ఉపయోగించడం, ఎయిడ్స్, రోగినిర్థారణ ఖర్చులు, ఆసుపత్రిలో చేరవలసిన అవసరం ఉన్న వ్యాధికి సంబంధంలేని ఎక్స్-రే, లేదా లేబరేటరీ పరీక్షలు సిజేరియన్ విభాగంతో సహా గర్భధారణ. లేదా బిడ్డ జననంకు సంబంధించిన చికిత్స నేమరోపతి చికిత్స యదార్ధంగా చేసే మినహాయింపులు పథకం నుండి పథకానికి మరియు కంపెనీ నుండి కంపెనీకి మారతాయి. (గగ్రూవు పాలసీలలో, ఆదనంగా ప్రీమియమ్ వెళ్లిస్తే మినహాయింపులను పట్టించుకోకపోవడానికి /తొలగించడానికి అవకాశం ఉన్నది. అల్చ్బ సమయానికి పాలసీలు జారీచేయబడవు అరోగ్య బీమా పాలసీలు ఒక సంవత్సరం కన్నా తక్కువ సమయానికి జారిేచేయబడవు. ఆరోగ్య బీమాపైన తరమగా అడిగే ప్రశ్నలు ఆరోగ్యబీమా అంటే ఏమిటి ? నమాధానం-' ఆరోగ్య బీమా" అనే పదం, మీ వైద్య ఖర్చులకు ఆచ్భాదన కల్పించే ఒక రకం బీమాకు వర్తిస్తుంది. ఒక ఆరోగ్య బీమా పాలసి బీమా కంపెనీ మరియు ఒక స్వతంత్ర వ్యక్తిబృందం మధ్య ఒడంబడిక, ఇందులో బీమా కంపెనీ పాలసీలో నిర్దిష్టంగా తెలుపబడిన నియమాలు మరియు షరతులకు లోబడి ఒక నిశ్చితమైన ప్రీమియమ్ వద్ద నిర్దిష్టమైన ఆరోగ్య బీమా ఆచ్భాదనను అందజేయడానికి అంగీకరిస్తారు. లభిస్తున్న ఆరోగ్య బీమా రకాలేమిటి ? ఇండియాలోని ఆరోగ్య బిమా పాలసీలు సాధారణంగా ఆసుపత్రిలో చేర్చబడినందువల్ల భరించిన ఖర్చులకు ఆచ్చాదన కల్పిస్తాయి, ఆయితే ప్రస్తుతం పలు రకాల పథకాలు లభ్యమవుతున్నాయి, ఇవి బీమా చేయబడుతున్న వారి అవసరం మరియు అభిమతం ఆధారంగా ఒక శ్రేణి ఆరోగ్య బీమా అందిస్తాయి. ఆరోగ్య బీమా చేసేవారు సాధారణంగా ఆసుపత్రికి నేరుగా డబ్బు చెల్లించే పద్ధతి (నగదు రహిత సౌకర్యం) లేదా జబ్బులు మరియు గాయాలతో సహసంబంధంగా కల ఖర్చులను తిరిగి చెల్లించే పద్ధతి లేదా ఒక జబ్బు చేసిన మీదట ఒక స్థిరమైన మొత్తాన్ని అందజేసే పద్ధతిని అందజేస్తారు. ఆరోగ్య ప్రణాళిక ద్వారా ఆచ్చాదన కల్పించబడే ఆరో! గ్య సంరక్షణ రకం మరియు మొత్తం ముందుగానే నిర్దిష్టంగా తెలియపరవడం జరుగుతుంది. ఆరోగ్య బీమా ఎందుకని ముఖ్యమైనది ? మన అవసరాలను బట్టీ మనందరం మనం మనకొరకు మరియు మన కుటుంబ నభ్యులందరి కొరకు ఆరోగ్య బీమా తప్పకుండా కొనుగోలు చేయాలి. ఆరోగ్య బీమాను కొనుగోలువేయడం ద్వారా ఆకస్మాత్తుగా, అనుకోని విధంగా ఆసుపత్రిలో చేరితే దాని ఖర్చులనుండి (లేదా క్రిటికల్ ఇల్నెస్ లాంటి ఆచ్చాదన కల్పించబడే ఇత ఆరోగ్య సంబంధిత సంఘటనలు). మనల్ని వరిరక్షిస్తుంది, లేకపోతే ఇంట్లో దామకున్న డబ్బుకు చిల్లి పడుతుంది లేదా అప్పుల బారిన పడవలసి వస్తుంది. వలు రకాల ఆరోగ్య సమస్యల బారిన మనలో ప్రతి ఒక్కరూ పడవచ్చును మరియు ముందుగా హెచ్చరికలు లేకుండా వైద్య సంబంధిత అత్యవసర పరిస్థితి మనలో ఎవరినైనా దెబ్బతీయవచ్చును. సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతి కొత్త వ్రక్రియలు మరియు మరింత ప్రభావం కలిగిన మందులు, వీటన్నిటి ఖరిదు పెరగడంతో ఆరోగ్య సంరక్షణ కూడా రోజురోజుకి మితిమీరి ఆర్థికపరంగా భారమయిపొోతున్నది. ఈ అధిక ఖర్చుతో కూడిన చికిత్స వాలా మంది మనుషులకు భరించలేనిది, అయితే, ఆరోగ్య బీమా అనే భద్రతను కల్పించకోవడం చాలా మందికి వీలయ్యేపని. ఏఏ రకాల ఆరోగ్య బీమా ప్రణాళికలు లభ్యమవుతున్నాయి ? ఒక సూక్ష్మ-బీమా పాలసీ క్రింద రూ. 5000. బీమా చేయబడిన మొత్తంలోనే ఆరోగ్య బీమా పాలసీలు లభ్యమవుతున్నాయి, అక్కడి నుండి రూ. 50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తానికి కూడా కొన్ని నిశ్చితమైన క్లిటికల్ ఇల్నెస్ ప్లానుల క్రింద లభ్యమవుతున్నాయి. బీమా చేసే చాలా మంది రూపాయలు 1 లక్ష రూపాయల నుండి 5 లక్షల మధ్య మొత్తానికి పాలసీలు జారీచేస్తారు. బీమా చేసేవారి చెల్లించవలసిన. గది అద్దెలు మరియు ఇతర ఖర్చులు , ఎంచుకున్న బీమా చేయబడే మొత్తానికి లింకు చేయడం ఎక్కువైపోతున్నది కాబట్టి, చిన్న వయస్సులోనే తగినంత మొత్తానికి ఆచ్చాదన తీసుకోమని సలహా ఇవ్వబడుతున్నది, ఎందుకనగా, ప్రత్యేకించి ఒక దావా చేసిన తరువాత బీమా చేసే మొత్తాన్ని పెంచడం అంత సులభం కాదు. ఇంకా, సాధారణ: బీమా కంపెనీలు చాలా మటుకు ఒక సంవత్సరం వ్యవధికి ఆరోగ్య బీమా పాలసీలను అందజూపుతాయి, అయితే రెండు, మూడు, నాలుగు మరియు ఐదు సంవత్సరాల వ్యవధికి కూడా జారిచేయబడే పాలసీలున్నాయి. జీవిత బీమా కంపెనీలు ద్లీర్ణకాల వ్యవధికి జారీ చేయబడే ప్లానులను కలిగియున్నాయి. అనువత్రిలో చేరిన దానికి ఇప్పే పాలసీ, ఇది పాలసీ వ్యవధిలో ఆసుపత్రిలో చేర్చిన తరువాత చికిత్సకు వాస్తవంగా అయ్యే ఖర్చులను పాక్షికంగా లేదా పూర్తిగా ఆచ్చాదన కల్పిస్తాయి. ఇదొక విస్పతమైన ఆచ్చాదన రూపం, పలు రకాల ఆసుపత్రి. ఖర్చులకు వర్తిస్తుంది, దీనిలో కొంత నిర్దిష్ట సమయానికి ఆసుపతిలో చేరకముందు మరియు చేరిన తరువాత ఖర్చులకు వర్తిస్తుంది. అలాంటి పాలసీలు ఒక. వ్యక్తికి బీమా చేసే మొత్తంపై లేదా కుటుంబ ఫ్లోటర్ పై ఆధారపడి లభ్యమవుతాయి, ఫ్లోటర్‌లో బీమా చేయబడిన. మొత్తం కుటుంబ సభ్యుల మధ్య పంచుకోవడం జరుగుతుంది. హాస్పిటల్ డెయిలీ క్యాష్ భెనిఫిట్ పాలసీ అనే మరొక పథకం, ఆసుపత్రిలో ఉన్న ప్రతి రోజుకు స్థిరమైన మొత్తంలో బీమా మొత్తం చెల్లిస్తుంది. ఐసియులో చేర్చబడితే లేదా నిర్దిష్టమైన జబ్బులకు లేదా గాయాలకు ఎక్కువ మొత్తంలో రోజు వారీ ప్రయోజనం అందించే ఆచ్చాదన కూడా ఉంటుంది. క్రిటిల్ ఇల్నెస్ బెనిఫిట్ పాలసీ, ఒక నిర్దిష్టమైన జబ్బు ఉందని రోగనిర్ధారణ చేయబడితే. లేదా ఒక నిర్దిష్టమైన ప్రక్రియను చేయించుకుంటుంటే, బీమా చేయబడిన. వారికి ఒక స్థిరమైన. ఏక మొత్తం డబ్బు అందజేయబడుతుంది. ఒక చాలా తీవ్రమైన. జబ్బు కారణంగా పలు ప్రత్యక్షలేదా పరోక్ష ఆర్ధిక పర్యవసానాలను వీలైనంతవరకూ తగ్గించడంలో ఈ మొత్తం సహాయపడుతుంది. సాధారణంగా, ఈ మొత్తం ఒకసారి వెల్లింపబడితే, ప్లాను అమలు కావడం పూర్తవుతుంది. ఒక నిర్దిష్టమైన శస్త్రచికిత్స చేయించుకుంటే ఏకమొత్తంలో చెల్లించడాన్ని అందజూపే ఇతర రకాల పథకాలున్నాయి (సర్జికల్ క్యాష్ బెనిఫిట్) మరియు వయోవద్ధుల అవసరాలను నిర్దిష్టమైన రీతిలో లక్ష్యంగా చేసుకుని వారి అవసరాలను నెరవేర్చే పథకాలు కూడా ఉన్నాయి. నగదు రహిత వ్రయోజనం అంటే ఏమిటి ? దేశంలోని ఆసుపత్రుల నెట్‌వర్క్‌తో బీమా కంపెనీలు ఒక ఒప్పంద ఏర్పాటును కఠిగియుంటాయి. నగదు రహిత బీమా పాలసీ క్రింద, పాలసీ దారుడు కనుక నెట్ వర్క్ ఆసుపత్రులు దేనిలోనైనా చికిత్స చేయించుకుంటే, అప్పుడు బీమా చేయించుకున్న వ్యక్తి ఆసుపత్రి బిల్లులు చెల్లించవలసిన పని లేదు. బీమా కంపెనీ తన థర్డ్ పార్టి ఎడ్మిన్ఫ్టేటర్(టివిఎ) ద్వారా సరాసరి ఆసుపత్రికి డబ్బులు చెల్లిస్తుంది. పాలసీ ద్వారా నిర్ధారించబడిన పరిమితులు లేదా ఉప పరిమితులను మించిన ఖర్చులు లేదా పాలసీ క్రింద అచ్చ్భాదన కల్పింంబడని అంశాలకుఖర్చులు ఆసుపత్రికి బీమా చేయబడిన వ్యక్తి నేరుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే నెట్‌వర్క్‌లో లేని ఒక ఆసుపత్రిలో మీరు కనుక చికిత్స చేయించుకుంటే నగదు రహిత సౌకర్యం లభ్యం కాదు. నేను కనుక ఆరోగ్య బీమా తీనుకోవాలనుకుంటే నాకు లభించే. వన్ను సంబంధిత వ్రయోజనాలేమిటి ? ఒక జతవేయబడిన ప్రోత్సాహకంగా ఆకర్షణీయమైన వన్ను సంబంధిత ప్రయోజనాలతో ఆరోగ్య బీమా లభిస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలో ఒక ప్రత్యేక విభాగం ఉన్నది, దీని ప్రకారం, ఆరోగ్య బీమాకు పన్ను ప్రయోజనాలను అందజేస్తుంది, ఇదే సెక్షన్ 80 డి మరియు జీవిత బీమాకు వర్తించే సెక్షన్ 80 సి లాగా కాదు, సెక్షన్ 80 సి క్రింద ఇతర రకాల పెట్టుబడులు/ఖర్చులు కూడా తగ్గింపుకు అర్జ్చుక పొందుతాయి. ప్రస్తుతం, నగదు కాకుండా మరే విధంగానైనా డబ్బు చెల్లించి ఆరోగ్య బీమాను కొనుగోలు చేసిన వారు, తమకు స్వయంగా, భార్య లేదా భర్తకి మరియు తనపై ఆధారపడిన పిల్లల కొరకు చెల్లించిన ఆరోగ్య బీమా ప్రీమియమ్ ద్వారా తమ పన్ను చెల్లించవలసిన ఆదాయంలో రూ. 15000 వార్షిక తగ్గింపును లభ్యం చేసుకోవమ్చును. వయోవద్ద్భులకు ఈ తగ్గింపు అధికంగా ఉంటుంది, ఇది రూ. 20,000. ఇంకా, ఆర్థిక సంవత్సరం 2008-09 మొదలుకుని, తల్లిదండ్రుల తరపున చెల్లించిన ఆరోగ్య బీమా ప్రీమియమ్‌కు ఆదనంగా రూ. 15,000 తగ్గింపు లభ్యం అవుతుంది, ఇది మరలా తల్లిదండ్రులు కనుక వయోవద్ద్ధులయితే. ఈ మొత్తం రూ.20,000. ఆరోగ్య బీమా వ్రీమియమ్ను ప్రభావితం చేసే అంశాలేమిటి ? ప్రీమియమ్ని నిర్ధారించే వ్రధాన అంశం వయస్సు. మీకెంత ఎక్కువ వయస్సు ఉంటే మీ ప్రీమియమ్ అంత. అధికంగా ఉంటుంది ఎందుకుంటే, మీరు జబ్బు బారిన పడే అవకాశం ఎక్కువ కాబట్టి. ప్రీమియమ్‌ను నిర్ధారించే మరొక. ప్రధాన అంశం, మీ గత వైద్య చరిత్ర. ముందటి వైద్య చరిత్ర ఏది లేకపోతే, ప్రీమియమ్ దానంతట అదే. తగ్గిపోతుంది. ప్రీమియమ్ ఖర్చును నిర్దారించే మరొక అంశం, దావా రహిత సంవత్సరాలు, ఎందుకంటే దాని ద్వారా కొంత శాతం రాయితీ వల్ల మీరు ప్రయోజనం పొందుతారు కాబట్టి. ఇది. దానంతట అదే మీ ప్రీమియమ్ తగ్గిపోవడానికి సహాయపడుతుంది. ఆరోగ్య బీమా పాలసీ వేటికి ఆచ్భాదన కల్పించదు ? ప్రకటన పత్రిక/పాలసీని పూర్తిగా చదివి, దాని క్రింద ఆచ్చాదన కల్పించబడనిదేమిటో మీరు అర్ధం చేసుకోవాలి. సాధారణంగా ముందే. ఉన్న వ్యాధులు(ముందుగానే ఉన్న వ్యాధి అనేదానిని ఎలా నిర్వచించారో అర్ధం చేసుకోవడానికి పాలసీని చదవాలి) ఆరోగ్య బీమా పాలసీ నుండి మినహాయించడం జరుగుతుంది. తదుపరి, ఆచ్చాదన యొక్క మొదటి సంవత్సరం నుండి. కొన్ని వ్యాధులను పాలసీ సాధారణంగా మినహాయిస్తుంది మరియు వేచి ఉండవలసిన. వ్యవధి కూడా విధించబడుతుంది. కళ్ళద్దాలు, కాంటాన్ట్ లెన్సులు మరియు వినికిడి సాధనాలు లాంటి ప్రమాణికమైన మినహాయింపులు ఉంటాయి, అలాగే దంత చికిత్స / శస్త్రచికిత్స (ఆసుపత్రిలో చేర్చవలసిన అవసరం రాకపోతే తవ్ప) ఆచ్చాదన. కల్పించబడదు, మూర్చలు, సాధారణ అసక్తత, పుట్టుకతో వచ్చిన బాహ్య లోపాలు, వి.డి, కావాలని స్వయంగా గాయపరచుకోవడం, మత్తును కలిగించే. బౌషధాలు/మద్యాన్ని ఉపయోగించడం, ఎయిడ్స్, రోగినిర్జ్థారణ ఖర్చులు, ఆసుపతిలో చేరవలసిన అవసరం ఉన్న వ్యాధికి సంబంధంలేని ఎక్స్-రే లేదా లేబరేటరీ పరీక్షలు, సిజేరియన్ విభాగంతో సహా గర్భధారణ: లేదా బిడ్డ జననంకు సంబంధించిన చికిత్స, నేచురోపతి చికిత్స పాలసీ క్రింది వేచిండపలసిన వ్యవధి ఏదైనా ఉందా ? అవును. మీరొక కొత్త పాలసీ తీసుకున్నప్పుడు, సాధారణంగా, పాలసీ ప్రారంభ తేదీ నుండి 30 రోజుల వేచి ఉండవలసిన వ్యవధి ఉంటుంది, ఈ వ్యవధి సమయంలో ఏదైనా ఆసుపత్రిలో చేర్చబడిన ఛార్జీలను బీమా కంపెనీ చెల్లించదు. అయిత్తే ద్యుర్రటన కారణంగా అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్చవలసి పస్తే ఇది పర్తించదు. రెన్యువల్ చేయబడ్డ తదుపరి పాలసీలకు ఈ వేచియుండే వ్యవధి వర్తించదు. ఆరోగ్య బీమా పాలసీ క్రింద ముందుగానే ఉన్న సితి అంటే ఏమిటి? మీరు ఆరోగ్య బీమా పాలసీని తీసుకోకముందే. మీకున్నటువంటి స్థితి/వ్యాధి, మరియు ఇది విశిష్టమైనది, ఎందుకంటే, మొదటి పాలసీకి త8 నెలల ముందు అలా ముందుగానే ఉన్న పరిస్థితులకు బీమా కంపెనీలు ఆచ్చాదన. కల్పించవు. దీనర్థం, బీమా ఆచ్చాదన. కొనసాగుతున్న 48 నెల పూర్తయిన తరువాత ముందుగానే స్థితికి చెల్లింపు చేయడానికి పరిగణించవచ్చు అని. ముగింపు తీదీ ముందుగా నా పాలసీని పునరుద్ధరించకపో, వునరుద్ధరించడానికి సేను నిరాకరించబడతానా ? ముగింపు తేదీ కి 15 రోజు లోపల (దీనిని ఉదార వ్యవధి (గ్రేస్ పిరియడ్) అంటారు)మీరు కనుక ప్రీమియమ్ చెల్లించినట్లయితే. పాలసీ పునరుద్ధరింపబడుతుంది. అయితే, బీమా కంపెనీ చేత ప్రీమియమ్ అందుకోని సమయానికి ఆచ్చాదన లభించదు. ఉదార వ్యవధి లోపల ప్రీమియమ్ కనుక చెల్లించకపోతే, పాలసీ రద్దయిపోతుంది. వునరుద్ధరణ ప్రయోజనాన్ని పోగొట్టుకోకుండా ఒక బీమా కంపెనీ నుండి మరొకదానికి నేను బదిలీ చేసుకోవ్చునా ? అవును. బీమా నియంత్రణ మరియు అభివద్ధి అధికారవర్గం (ఐఆర్‌డిఎ) వారు దీనిని 1 అక్టోబరు 2011 నుండి అవోఎలం చేయాలని ప్రకటన పత్రికను జారీచేసారు, దీని ప్రకారం ఒక బిమా కంపెనీ నుండి మరొకదానికి, ఒక ప్లాను నుండి మరొక దానికి బదిలీ చేసుకోవడాన్ని, ఇంతకు మునుపటి పాలసీ ద్వారా లభించిన ముందుగానే ఉన్న షరతులతో బీమాచేయబడిన వ్యక్తి పునరుద్ధరణ కెడిట్టను నష్టపోకుండా అనుమతించమని నిర్దేశించడం జరిగింది. అయితే, ఇంతకు మునుపటి పాలసీ క్రింద బీమా వేయబడిన మొత్తానికి (బోనస్‌తో కలిపి) ఈ కైెడిట్ పరిమితం చేయబడుతుంది. వివరాల కొరకు, బీమా కంపెనీతో మీరు సంప్రదించవచ్చును. ఒకదావా సమర్పించిన తరువాత పాలసీ ఆచ్భాదనకు ఏమి జరుగుతుంది? ఒక క్లెయిమ్ సమర్పించిన తరువాత మరియు అది పరిష్కరించబడిన తరువాత, పరిష్కారం సందర్భంగా చెల్లించిన మొత్తం పాలసీ ఆచ్భాదన నుండి. తగ్గించడం జరుగుతుంది. ఉదాహరణకు, జనవరిలో సంవత్సరానికి రూ. 5 లక్షలతో ఆచ్చాదనతో ఒక పాలసీని మీరు పప్రారంభించారనుకోండి. ఏప్రిల్‌లో, మీరురూ. 2 లక్షలకు దావా సమర్పించారు. మే నుండి డిశంబరు వరకూ మీకు లభించే ఆచ్చాదన, మిగిలిన రూ. ౩ లక్షరూపాయలు. “ఏదైన ఒక అస్వస్థత” అంటే ఏమిటి? “ఏదైన ఒక అస్వస్థత “అంటే అర్ధం, అస్వస్థత కొనసాగే వ్యవధి అని, దినిలో పాలసీలో నిర్దిష్టంగా తెలియజేసినట్టుగా నిశ్చితమైన రోజులలో తిరగబెట్టడం కూడా కూడియున్నది. సాధారణంగా ఇది 45 రోజులు ఉంటుంది. ఒక సంవత్సరంలో గరిష్టంగా అసనుమతించబడే దావాలు ఎన్ని? పాలసీ దేనిలోనైనా నిర్దిష్టంగా పరిమితి విధించకపోతే తప్ప పాలసీ వ్యవధిలో ఎన్ని దావాలనైనా చేసుకోవచ్చును. ఆయితే, పాలసీ క్రింద బీమా వేయబడిన మొత్తం, గరిష్టంగా పరిమితి. “ఆరోగ్య తనిఖీ” సౌకర్యం అంటే ఏమిటి ? కొన్ని ఆరోగ్య బీమా పాలసీలు కొన్ని సంవత్సరాలలో ఒకసారి సాధారణ ఆరోగ్య తనిఖీకి నిర్దిష్టమైన ఖర్చులను చెల్లిస్తాయి. సాధారణంగా ఇది నాలుగు సంవత్సరాల కొకసారి లభిస్తుంది. కుటుంబప్లోటర్ పాలనీ అంటే అర్ధం ఏమిటి? కుటుంబ ఫ్లోటర్ పాలసీ అనేది మీ పూర్తి కుటుంబపు ఆసువత్రి ఖర్చులను వెళ్లించే ఒక సింగిల్ పాలసీ. పాలసీకి ఒకే బీమా చేయబడిన మొత్తం ఉంటుంది, దీనిని బీమా చేయబడిన వ్యక్తులు ఎవరైనా / అందరూ నిష్పత్తి దేనిలోనైనా లేదా మొత్తం ఉపయోగించుకోవచ్చును, అయితే బీమా చేయబడిన పాలసీ మొత్తం యొక్క మొత్తం మీది పరిమితి వరకూ ఇలా చేయవచ్చును. చాలా తరమగా కుటుంబ ఫ్లోటర్ ప్లానులు విడిగా ఒక్కో వ్యక్తికి పాలసీలు తీసుకోవడం కన్నా మెరుగెనవి. అకస్మాత్తుగా జబ్బు చేయడం, శస్త్రచికిత్సలు మరియు ద్యుర్టటనల సందర్భాలలో వైద్య ఖర్చులన్నిటి. పట్ల కుటుంబ ఫ్లోటర్ పాలసీలు శ్రద్ధ వహిస్తాయి. ఆధారం : మీ బీమా కంపెనీ మీ ఫిర్యాదులను పట్టించుకుంటోందా