పైల్స్‌తో బాధపడుతున్నారా? ఒకే చోట కదలకుండా కనీసం పది నిముషాలైనా కూర్చోకుండా, కుర్చీలో అటు ఇటూ కదిలే వారిని చూస్తే పక్క వారికి కాస్తా చిరాకుగానే ఉంటుంది. కానీ అది పైకి చెప్పలేని బాధ. ఇంతగా బాధించే వ్యాధి పేరే ‘పైల్స్’. ఈ సమస్యను బయటకు చెప్ప కోలేక చాలా మంది లోలోన మధనపడుతుంటారు. ప్రారంభ దశలోనే ఈ వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. పైల్స్ (హెమరాయిడ్స్)లను సాధారణంగా అర్శమొలలు అంటారు. పైల్ అంటే గడ్డ అని హెమరాయిడ్ అంటే రక్త స్రావం కావడం అని అర్థం. మొలలు చూడటానికి పిలకలుగా కనబడినా, రక్తంతో ఉబ్బి ఉంటాయి. ఇవి మలద్వారం వెంట బయటకు పొడుచుకొని వచ్చినట్లు కనిపిస్తాయి. కారణం తీవ్రమానసిక ఒత్తిళ్లు. మల విసర్జన సరిగా జరగక మలబద్దకం ఏర్పడటం. ఎక్కువసేపు కుర్చీలోనే కూర్చొని కదలకుండా విధులను నిర్వర్తించడం. తక్కువగా నీరు తాగడం. మద్యం అతిగా సేవించడం. ఫాస్ట్ ఫుడ్స్, వేపుల్లు అతిగా తినడం. మాంసాహారం తరుచూ తినడం వల్ల పైల్స్ సమస్య వస్తుంది. లక్షణాలు మల విసర్జన సాఫీగా జరగక తీవ్ర నొప్పి, మంట వుంటాయి. అప్పుడప్పుడు రక్తం పడుతూ ఉంటుంది. మల విసర్జన అనంతరం కూడా కొందరిలో నొప్పి, మంట రెండు గంటల వరకు ఉంటుంది. మల విసర్జన సమయంలో మొలలు (పైల్స్) బయటకు పొడుచుకొని వచ్చి బాధిస్తాయి. జాగ్రత్తలు పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి (కనీసం రోజుకు 4 నుండి 5 లీటర్లు). రోజూ వ్యాయామం చేయాలి. రోజూ మల విసర్జన సాఫీగా జరిగేటట్టు చూసుకోవాలి. మద్యం అతిగా సేవించడం, ఫాస్ట్ ఫుడ్స్, వేపుల్లు, మాంసాహరం, చిరుతిళ్లు తినటం మానుకోవాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. చికిత్స వెంటనే వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. వ్యాధి ఆరంభంలోనే హోమియో మందులను వాడుకుని ప్రయోజనం పొందవచ్చును. హోమియో వైధ్యవిధానంలో ప్రతి ఔషధం మానసిక లక్షణాలతో ముడిపడి ఉంటుంది. మందుల ఎంపికలో కూడా మానసిక శారీరక తత్వాన్ని ఆధారంగా చేసుకొని మందులను సూచిస్తారు. పైల్స్ చికిత్సలో వాడే మందులు.. నక్స్‌వామికా శారీరక శ్రమ లేకుండా, మలబద్దకంతో బాధపడుతూ తరచుగా మలబద్దకం నివారణ మాత్రలు వాడే వారికి ఈ మందు పనిచేస్తుంది. తరుచుగా మల విసర్జన చేయాలనిపించడం, తీరా మలవిసర్జనకు వెలితే మలం సాఫీగా జరుగక బాధగా అనిపిస్తుంది. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు పనిచేస్తుంది. సల్ఫర్ పైల్స్ వ్యాధి నయం చేయుటలో ఈ మందు అతి ముఖ్యమైంది. మలబద్దకంతో బాధపడుతూ, మలవిసర్జనకు వెలితే మలం సాఫీగా జరుగక మంట, నొప్పి బాధాకరంగా ఉంటుంది. నొప్పి మలవిసర్జన అనంతరం కూడా ఉండి బాధపెడుతుంది. మలవిసర్జన సమయంలో మొలలు (పైల్స్) బయటకు వచ్చి వేధిస్తాయి. అస్కులస్‌హిప్ మల ద్వారం పొడిగా ఉండి నొప్పిగా అనిపిస్తుంది. ఆసనంలో పుల్లలు గుచ్చుతున్నట్లుగా ఉంటుంది. విరేచనానికి వెళ్లాంటేనే భయపడి పోతారు. విరేచనం తరువాత నొప్పిగా, బాధగా అనిపిస్తుంది. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు తప్పక గుర్తుంచుకోదగినది. రటానియా వీరికి ఆసనంలో గాజు పెంకులు గుచ్చు తున్నట్లుగా ఉంటుంది. విరేచనం వెళ్లిన తరువాత కొంత సేపు వరకు నొప్పిగా బాధగా అనిపిస్తుంది. మలవిసర్జన సమయంలో అప్పుడప్పుడు రక్తం పడుతూ ఉంటుంది. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు పనిచేస్తుంది. హెమామెలీస్ మలబద్దకంతో బాధ పడుతూ ఉంటారు. మలవిసర్జనకు వెళ్తే మలం సాఫీగా జరగక మంట, నొప్పి కూడా రక్తం విస్తారంగా పడుతూ ఉన్నప్పుడు ఈ మందు పనిచేస్తుంది. ఈ మందులే కాకుండా పైల్స్‌తో బాధ నివారణకు నైట్రిక్ ఆసిడ్, అలోస్, మ్యురాటిక్ ఆసిడ్, గ్రాఫాయిటీస్, మెర్కుసాల్, ఫాస్పారస్ వంటి మందులను వ్యాధి లక్షణాల ఆధారంగా వాడుకొని పైల్స్ నుండి విముక్తి పొందవచ్చు. అయితే వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే మందులు వాడాలి. డాక్టర్ పావుశెట్టి శ్రీధర్ ,హోమియోఫిజీషియన్అంజనా హోమియోక్లినిక్, హన్మకొండ, వరంగల్సెల్ : 9440229646 మొలలు – చికిత్స, నివారణ కొందరు పైల్స్ వంటి సమస్యలతో ఎంతో బాధపడుతుంటారు. మల విసర్జన ద్వారం వద్ద వచ్చే ఇటువంటి వ్యాధులు వారికి మనశ్శాంతి లేకుండా చేస్తాయి. పైల్స్‌తో పాటు ఫిషర్, ిఫిస్టులా వంటి వ్యాధులు నేడు సాధారణంగా అందరికీ వస్తున్నాయి. అవసరమైన వైద్యం చేయించుకొని ఈ వ్యాధులను పూర్తిగా నయం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆహార నియమాలు, తగిన జాగ్రత్తలతో ఈ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. పైల్స్: సాధారణంగా వస్తున్న వ్యాధుల్లో పైల్స్ ఒకటి. పైల్స్ ఎక్కువగా మధ్య వయ స్సులో ఉన్నవారికి వస్తుంది. పీచు పదా ర్థాలు తక్కువగా తీసుకున్నవారికి, మంచి నీళ్లు తక్కువగా తాగేవారిలో ఈ వ్యాధి కని పిస్తుంది. సై్పసీ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుం ది. పైల్స్ వల్ల విరోచనాలకు ముందు లేదా తర్వాత రక్తం రావడం జరుగుతుంది. కొన్ని సార్లు రక్తం గడ్డలు,గడ్డలుగా కూడా వస్తుంది. మరికొన్నిసార్లు లోపలి మాంసం బయటకు కూడా రావచ్చు. పైల్స్ వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. పైల్స్‌ను మూడు గ్రేడులుగా విభజించవచ్చు. మొదటి గ్రేడులో పైల్స్ లోపల మాత్రమే కనిపిస్తుంది. రెండవ గ్రేడులో లోపలి నుంచి బయటకు వచ్చి మ ళ్లీ వాటంతట అవే లోపలికి వెళ్లిపోతాయి. మూడవ గ్రేడులో బయటకు వచ్చి బయటే ఉంటాయి. నాలుగవ గ్రేడులో బయటకు వచ్చిన వాటికి ఇన్ఫెక్షన్ రావచ్చు. కొన్ని సార్లు పైల్స్ ఆపరేషన్ తర్వాత కూడా మళ్లీ వచ్చే అవకాశం ఉంది. వీటిని సెకండరీ హెమరాయిడ్స్ అని అంటారు. ఫిషర్: ఈ వ్యాధి ఏ వయస్సు వారికైనా రావచ్చు. ఇది రావడానికి ముఖ్య కారణం మలబద్ధకం. మలద్వారం పగిలి ఫిషర్ వస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారికి విపరీతమైన నొప్పి వస్తుంది. కొన్నిసార్లు రక్తం కూడా రావచ్చు. రక్తం ఒకటి, రెండు చుక్కలు మా త్రమే వస్తుంది. విరోచనాలు అయిన తర్వా త నొప్పి ప్రారంభమై మూడు, నాలుగు గం టల వరకు ఉంటుంది. కొన్నిసార్లు ఫిషర్ మలద్వారానికి ముందు వైపు, వెనుకవైపున కూడా ఉంటుంది. మరికొన్నిసార్లు ఫిషర్‌తో పాటు చర్మం కూడా ముందుకు చొచ్చుకు వస్తుంది. దీన్ని సింటినైన్‌పైల్ అంటారు. ఫిస్టులా: ఈ వ్యాధిని కొందరు లూటి అని కూడా అంటారు. ఇది ఈ రకం వ్యాధు లన్నింటికెల్లా ఇబ్బందికరమైన సమస్యగా చెప్పుకోవచ్చు. పెద్ద పేగు నుంచి బయటకు వచ్చే చర్మానికి ఇన్ఫెక్షన్ వల్ల ఈ వ్యాధి వ స్తుంది. పిస్టులా వ్యాధి రెండు రకాలు. మల ద్వారానికి పోయే పై దారిలో ఏర్పడేది ఒక రకం, కింది భాగంలో ఏర్పడేది మరో రకం. పైభాగంలో వచ్చేది సామాన్యంగా సమాంతరంగా ఉంటుంది. కింది భాగంలో వచ్చే దారి వంకరగా ఉంటుంది. ఈ వ్యాధి ఏ వయస్సులో ఉన్నవారికైనా రావచ్చు. ము ఖ్యంగా ఎక్కువ సేపు కూర్చొని ఉన్నవారిలో ఈ వ్యాధి వస్తుంది. బయటకు చిన్న రంధ్రా లుగా కనపడవచ్చు. కొన్నిసార్లు అవి మూ సుకుపోయినప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చి చీము పట్టే అవకాశాలు ఉంటాయి. నొప్పి కూడా ఉండవచ్చు. ఇన్ఫెక్షన్ వల్ల నొప్పి వస్తుంది. పిస్టులాను లోలెవెల్, హైలెవెల్ రకాలుగా వర్గీకరిస్తారు. లోలెవెల్ రకం దోవ పొడవు గా ఉంటుంది. ఇది రెండు సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. హైలెవెల్లో దోవ పొడవు కొన్నిసార్లు నాలుగు, అయిదు సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు విరోచనాలు కంట్రోల్ కాకపో వచ్చు. చీము, రక్తం కూడా రావచ్చు. పరీక్షలు: పైల్స్ వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. వీరికి ప్రాక్టోస్కోపిక్ పరీక్షను నొప్పి లేనప్పు డు చేస్తారు. ఈ పరీక్షలో పైల్స్ బాగా కనిపిస్తాయి. కొలోస్కోపిలో పైల్స్, ఫిషరీ, ఫిస్టులా వ్యాధులను తెలుసుకోవచ్చు. పొట్ట స్కానింగ్‌లో వేరే పేగులకు ఏమైనా గడ్డలు ఉన్నాయా తెలుస్తుంది. పిస్టులోగ్రామ్ పరీ క్షను పిస్టులా ఉన్నవారికి నిర్వహిస్తారు. దారి పొడవు ఎంతోఉందో తెలుసుకోవడం జరుగుతుంది. బేరియన్ ఎనిమా పరీక్ష ద్వా రా పెద్ద పేగు ఎలా ఉండో తెలుసుకోవచ్చు. వైద్యం: పైల్స్ వ్యాధి వచ్చిన వారిలో మొదటి, రెండు గ్రేడులుగా ఉన్నవారికి చాలా వరకు మందులతో నయమవుతుంది. కొన్నిసార్లు స్ల్కీరో థెరపీ ద్వారం పరీక్ష చేస్తూ డాక్టర్ పైల్స్‌లోకి ఇంజెక్షన్ చేస్తారు. ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల వాటిలో రక్త ప్రసరణ తగ్గి కృశించుకుపోతాయి. పైల్స్ బాగా ముదిరిన వారికి ఎమరోయెక్టమీ ఆపరేషన్ ద్వారా వాటిని తొలగిస్తారు. ఫిషర్ వచ్చినవారి ఆహారంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. విరోచనాలు సాఫీగా సాగేందుకు మందులు వాడాలి. ఈ విధంగా చేసినా ఇబ్బంది మళ్లీ వస్తుంటే విరోచనాలు జరిగే దారి బిగుసుకు పోతుంది. ఆ సమయంలో ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆపరేషన్‌ను స్పింటరాటమి అని అంటారు. పిస్టులా వ్యాధిని హై లెవెల్, లో లెవెల్‌ను బట్టి వైద్యం చేస్తారు. కొన్నిసార్లు వీటిని తీసివేయాల్సి ఉంటుంది. ఈ ఆపరేషన్ చేసేటప్పుడు విరో చనాలను ఆపుకునేందుకు ఎలాంటి ఇబ్బం ది కలగకుండా చూసుకోవాలి. ఈ ఆపరేష న్ను ఫిస్టురెక్టమీ అని అంటారు. జాగ్రత్తలు: ఈ వ్యాధులు వచ్చినవారు సమతుల ఆహారం తీసుకోవాలి. ఆహారం లో పీచు పదార్థాలు(పండ్లు, కూరగాయలు) ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఉప వాసాలు చేయకూడదు. విరోచనాలు అ య్యేందుకు మందులు ఎక్కువగా వాడ కూ డదు. మన జీవన విధానంలో కొన్ని మార్పు లు చేసుకోవడం ద్వారా ఇటువంటి వ్యాధులకు చాలావరకూ దూరంగా ఉండవచ్చు. ముఖ్యంగా పీచు పదార్ధాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీర క్రియలు ఆరోగ్యంగా ఉంటాయి. ఆధారము : వైద్యం.ఇన్ఫో