జికా వైరస్ ప్రపంచాన్ని గడ గడలాడిస్తుంది. ఈ వైరస్ గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అమెరికాలో వేగంగా వ్యాప్తిస్తోందని తెలిపింది. ఈ వైరస్ సోకిన కేసులు 40 లక్షలకు చేరి ఉంటుంది అని డబ్ల్యూహెచ్ఓ తెలియజేసింది . బ్రెజిల్లో దాదాపు పది లక్షల మందిని చుట్టబెట్టి కలకలం రేపుతున్న జికా వైరస్ ఇతర ఖండాలకు విస్తరించింది. కీలక వాస్తవాలు జికా వైరస్ వ్యాధి సాధారణంగా ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం సమయంలో ఇది ఏదేస్ దోమల కాటు వలన వ్యాపిస్తాయని కలుగుతుంది జికా వైరస్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు సాధారణంగా జ్వరం , చర్మం దద్దుర్లు ( వైరస్ వ్యాధివలన కలుగు జ్వరము ) మరియు కండ్లకలక వస్తాయి ఈ లక్షణాలు సాధారణంగా 2-7 రోజుల పాటు ఉంటాయి జికా వైరస్ వ్యాధి కి ప్రస్తుతం ఎలాంటి నిర్దిష్ట చికిత్స లేదా టీకా అందుబాటులో లేదు ఈ వైరస్ ఆఫ్రికా, అమెరికాలు, ఆసియా మరియు పసిఫిక్ లో వ్యాపించినది జికా వైరస్ సోకి తే లక్షణాలు జికా వైరస్ సోకితే తలనొప్పి కీళ్ల నొప్పులు జ్వరం వాంతులు కళ్లు ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి జికా వైరస్ ఒంట్లో చేరిన అందరిలోను లక్షణాలు కనిపించకపోవచ్చు. జ్వరం వంటి లక్షణాలు వారం రోజుల లోపు తగ్గిపోతాయి. జికా వైరస్ ప్రభావం జికా వైరస్ సోకితే సాధారణ వ్యక్తులకు పెద్దగా ఏం కాదు. గర్భిణీలపై బాగా ప్రభావం చూపుతుంది. పైగా పుట్టే బిడ్డలకు మెదడు సరిగా పెరగకపోవడం వంటి సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. జికా బాగా ఉన్న బ్రెజిల్లో ఇప్పటికే వేలాది మంది పిల్లల్లో తల చిన్నగా, మెదడు లోపంతో పుట్టినట్లు అంచనా ఉంది. విదేశాల నుంచి గర్బిణీలు జికా వైరస్ ఉన్న దేశాలకు వెళ్లవద్దని సూచిస్తున్నారు. జికా వైరస్ లేకుండా చూసుకోవడానికి.. దోమలు కుట్టకుండా చూసుకోవాలి. పెద్ద చేతుల చొక్కాలను ఒళ్లంతా కప్పుకోవాలి. దోమతెరలు వాడాలి. మన చుట్టుపక్కల పరిశుభ్రత పాటించాలి. కాగా, జికా పైన మన కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తోంది. నివారణ దోమ కాటు నుండి తమను తాము రక్షించుకోవడానికి ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవాలి, ఆదారము: ప్రపంచ ఆరోగ్య సంస్థ (W H O)