చికెన్ గునియా వ్యాధిని చికెన్ గునియా జ్వరము అని అంటారు.ఈ వ్యాధి వైరస్ అనే అతి సూక్ష్మక్రిముల ద్వారా వస్తుంది. చికెన్ గునియా వ్యాధిని చికెన్ గునియా జ్వరము అని అంటారు.ఈ వ్యాధి వైరస్ అనే అతి సూక్ష్మక్రిముల ద్వారా వస్తుంది. చికెన్ గునియా ఎలా వ్యాపిస్తుంది చికెన్ గునియా వ్యాధి 'ఏడీస్ 'అనే దోమ ద్వారా వ్యాపిస్తుంది.ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి నుండి ఆరోగ్యవంతమైన వ్యక్తికి ఈ దోమ ద్వారా సంక్రమిస్తుంది. లక్షణాలు చలి,జ్వరము. తలనొప్పి. వాంతులు వచ్చినట్లు ఉండడం. వాంతులు. కీళ్ళనొప్ఫులు. కొన్ని సందర్భాలలో చర్మముపై దద్దుర్లు కూడా రావచ్చు. విపరీతమైన కీళ్ళు నొప్పులు ఈ వ్యాధి ప్రధాన లక్షణము. జ్వరతీవ్రత తగ్గినా,ఈ కీళ్ళ నొప్ఫులు కొంత కాలము వ్యక్తికి ఉంటాయి. వ్యాధి నివారణ దోమల నివారణ చర్యలన్నీ తీసుకోవాలి. 'ఏడీస్ ' దోమ సాధారణంగా పగలు కుడుతుంది. నీటిని 2 - 3 రోజుల కంటే ఎక్కువ నిలువ ఉంచరాదు. నీళ్ళ ట్యాంకులు,ఇతర నీటి నిల్వ పాత్రలపై మూతలు తప్పని సరిగా ఉంచాలి. ఎయిర్ కూలర్లు,పూల కుండీలు,రబ్బరు ట్యాబులు,మొదలగు ప్రాంతాలలో నీటిని నిలువ వుంచరాదు. వ్యక్తి గతంగా దోమల నుండి రక్షణ పొందాలి. దోమ తెరలు,దోమలను నివారించు క్రీములు,కాయిల్స్,ఆల్ అవుట్ లాంటి వేపరైసిగ్ ద్రవాలు వాడుట మంచిది. ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు