ధనుర్వాతము అనే జబ్బు శరీరానికి గాయం తగిలినప్పుడు ఆ గాయం ద్వారా ఇన్ పెక్షన్ అయినప్పుడు వస్తుంది. క్లాస్ట్రిడియా టెటని అనే క్రిములు గాయం ద్వారా శరీరంలో ప్రవేశించి - ధనుర్వాతం వ్యాధిని కలిగిస్తాయి. లక్షణాలు ధనుర్వాతం ప్రధానంగా కేంద్రనాడీ మండల వ్యవస్ధ (మెదడు,వెన్నెముక )పై ప్రభావము చూపుతుంది. ధనుర్వాతం మొదటి లక్షణము,దవడ కండరాలు బిగుసుకుపోయి నోరు తెరవలేకపోవడం ఈ లక్షణం చిన్న పిల్లలలో అయితే తల్లిపాలు త్రాగలేరు ఏ కారణం లేకుండా ఎవరైన నోరు తెరవలేక పోయినట్లు అయితే వేంటనే డాక్టరు వద్దకు తీసుకువెళ్ళాలి స్వల్పంగా జ్వరం రావడం గుండె స్పందన వేగంగా వుండడం పొత్తికడుపు వీపు ఇతర కండరాలు కూడ బిగుసుకు పోవచ్చు నివారణ ధనుర్వాతం రాకుండా నివారించడానికి సంవత్సరము లోపు పిల్లల్లో 1 నెల వయస్సు నుండి మూడు మోతాదులు వ్యాధి నిరోధక టీకా ఇవ్వాలి. అనగా డిప్తీరియా కోరింత దగ్గు ధనుర్వాతము ఈ మూడు వ్యాధులకు నివారణ లా పని చేస్తుంది. గాయం తగిలిన వెంటనే ప్రాధమిక చికిత్స చేసి ధనుర్వాతం టీకా డాక్టరు సలహా మేరకు వేయించాలి. గాయం తగిలినా తగలకపోయినా ప్రతి 5 సంవత్సరాలకు యుక్త వయస్సు అమ్మాయిలు డాక్టరు సలహా ప్రకారము టి.టి సూది వేయించుకోవడం మంచిది. ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు