స్వైన్ ఫ్లూ అంటే ఏమిటి? స్వైన్ ఇన్పఫ్లూయెన్జా (స్వైన్ ఫ్లూ) అంటే, పందులలో వచ్చే శ్వాసకోశవ్యాధి. ఒక రకమైన ఇన్పఫ్లూయెన్జా వైరస్ ద్వారా పందులలో ఈ వ్యాధి వస్తుంది. సాధారణంగా మనుషులకి స్వైన్ ఫ్లూ రాదు కాని మానవ అంటురోగములు రావచ్చు మరియు వచ్చితీరతాయి. స్వైన్ ఫ్లూ వైరస్ ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తాయని తెలిసింది. కాని గతంలో, ఈ వ్యాధి పరిమితంగా ఉండి మరియు ముగ్గురికి మించి వ్యాపించేది కాదు. 2009 సంవత్సరం మార్చి చివరలో మరియు ఏప్రిల్ మొదటిలో దక్షిణ కేలిఫోర్నియాలో మరియు సేన్ ఏంటోనియా, టెక్సాస్ దగ్గర తొలిసారిగా స్వైన్ ఇన్ ఫ్లూయెన్జా ఎ( హెచ్1 ఎన్1) వైరస్ ద్వారా మానవ అంటువ్యాధి కేసులు వచ్చినట్లు తెలిసింది. ఇతర అమెరికా సంయుక్త రాష్టాల మనుషులలో స్వైన్ ఫ్లూ అంటువ్యాధి వచ్చినట్టు సమాచారమందింది. అంతర్జాతీయంగా కూడా ఈకేసులు వచ్చినట్లు తెలిసింది. మనుషులలో వచ్చే స్వైన్ ఫ్లూ యొక్క చిహ్నాలు మరియు లక్షణాలు ఏమిటి? మనుషులలో వచ్చే స్వైన్ ఫ్లూ యొక్క లక్షణాలు సాధారణంగా వచ్చే ఫ్లూని పోలి ఉంటాయి. ఈ లక్షణాలు జ్వరం,దగ్గు,గొంతు నొప్పి,ఒంటి నొప్పులు,తల నొప్పి,చలి మరియు అయాసములని కలిగి ఉంటాయి. కొంత మందికి అతిసారవ్యాధి మరియు స్వైన్ ఫ్లూతో వచ్చే వాంతులు వచ్చినట్లు తెలిసింది. గతంలో, స్వైన్ ఫ్లూ వచ్చిన వారు తీవ్రవ్యాధి (నిమోనియా మరియు శ్వాస ఆగి పోవడం) మరియు మరణం చెందినట్టు తెలిసింది. సీజనల్ ఫ్లూ వలె స్వైన్ ఫ్లూ అవసరమైన దీర్ఘకాల ఆరోగ్య పరిస్థితులను క్షీణించేలా చేస్తుంది. ఇన్ ఫ్లూయెన్జా ఉన్న వారు దగ్గడం లేదా తుమ్మడం ద్వారా ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి ముఖ్యంగా ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఒక్కొక్కప్పుడు ఫ్లూ వైరస్ ఉన్న వారిని ముట్టు కున్నపుడు, ఆ తరువాత వారి నోటిని లేదా ముక్కుని ముట్టుకున్నపుడు వ్యాధి సంక్రమిస్తుంది. ఫ్లూ ఉన్నవారు ఇంకొకరికి వ్యాధిని ఎలా వ్యాపిస్తారు? వ్యాధి లక్షణాలు కనిపించడం మొదలు పెట్టిన ఒకరోజు ముందు మరియు వ్యాధి సోకిన ఏడు రోజులు వరకు లేదా అంతకన్నాఎక్కువ, వ్యాధి సోకిన వారు ఇతరులకు వ్యాధి సోకించ గలరు. అంటే మీకు వ్యాధి సోకిందని తెలిసే మునుపే లేదా మీరు వ్యాధిగ్రస్థులైనప్పుడు కూడా ఇతరులకు ఫ్లూని సోకించగలరు. ఫ్లూ రాకుండా ఉండాలంటే నేను ఏమి చేయాలి? అన్నిటికన్నా ముందు ముఖ్యమైనది: చేతుల్ని శుభ్రంగా కడుగుకోవాలి,ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నించాలి,ఎక్కువగా నిద్రపోవాలి, శారీరకంగా చురుకుగా ఉండాలి,ఆందోళన పడకుండా ఉండాలి, ఎక్కువ ద్రవ పదార్థాలని తీసుకోవాలి మరియు పోషకాహారాన్ని తీసుకోవాలి. ఫ్లూ వైరస్ తో మురికిగాఉన్న ఉపరితలాలని ముట్టుకోవడానికి ప్రయత్నించకూడదు. వ్యాధి ఉన్నవారి దగ్గరకు వెళ్ళకుండా ఉండండి. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే నన్ను నేను ఏ విధంగా రక్షించుకోవాలి? స్వైన్ ఫ్లూ రాకుండా రక్షించుకోవడానికి ఇప్పుడు వేక్సీన్ లు లేవు. శ్వాసకోస వ్యాధిని కలిగించే ఇన్ ఫ్లూయెన్జా వంటి క్రిముల్ని వ్యాప్తి చెందకుండా ఆపడానికి దోహదపడే, ప్రతిరోజు తీసుకునే చర్యలు ఉన్నాయి. ప్రతిరోజు మీ ఆరోగ్యం కాపాడుకోవడానికి ఈ క్రింద ఇచ్చిన సలహాలను పాటించాలి. దగ్గు లేదా తుమ్ములు వచ్చినప్పుడు మీరు నోటిని మరియు ముక్కుని టిస్యూతో కప్పాలి. తరుచుగా మీచేతుల్ని సబ్బు మరియు నీటితో కడగాలి. మీకు దగ్గు మరియు తుమ్ములు వచ్చిన తరువాతైతే తప్పనిసరిగా కడగాలి. ఆల్కహాల్ ఆధారితమైన ‘చేతులను శుభ్రపరిచేవి’ కూడా ప్రభావితం కలిగి ఉంటాయి. దగ్గు మరియు తుమ్ముల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మంచి మార్గం ఏమిటి? మీరు వ్యాధి గ్రస్థులయితే, వీలైనంత వరకు ఇతరులను కలవకుండా పరిమితంగా ఉండాలి. వ్యాధితో ఉన్నపుడు పనికి లేదా పాఠశాలకి వెళ్ళకుండా ఉండాలి. దగ్గు లేదా తుమ్ములు వచ్చినప్పుడు మీరు నోటిని మరియు ముక్కుని టిస్యూతో కప్పాలి. ఇది మీ చుట్టు ప్రక్కన ఉన్నవారికి ఈ వ్యాధి సోకకుండా చేయవచ్చు. మీరు ఉపయోగించిన టిస్యూని చెత్త బుట్టలో పారవేయాలి. మీ దగ్గర టిస్యూ లేకపోతే, దగ్గు లేదా తమ్ము వచ్చినపుడు చేతితో అడ్డుపెట్టాలి. అప్పుడు మీ చేతులను శుభ్రపరచుకోవాలి. మీరు దగ్గు లేదా తుమ్ము వచ్చిన ప్రతిసారి ఈ విధంగా చేయాలి. ఈ ఫ్లూ రాకుండా ఉండడానికి మాచేతులను శుభ్రపరచుకునే మంచి పద్ధతులు ఏమిటి? తరుచుగా మీచేతుల్ని కడుగుకోవడం వలన క్రిములు నుంచి మిమల్ని రక్షించుకోడానికి దోహద పడుతుంది. సబ్బు మరియు నీటితో కడుగుకోవాలి లేదా ఆల్కహాల్ ఆధారిత ‘చేతిని శుభ్రపరిచే వాటిని’ ఉపయోగించి శుభ్రపరచుకోవాలి. మీచేతుల్ని కడుగుకొనేటపుడు, 15-20 సెకన్ల పాటు సబ్బు మరియు వేడి నీటిలో మీచేతులని శుభ్రపరచుకోవడం మంచిది. సబ్బు మరియు నీరు దొరకనప్పుడు, ఒకసారే ఉపయోగించడానికి వీలుగల ఆల్కహాల్ ఆధారిత ‘చేతిని శుభ్రపరిచేవి’ లేదా జెల్ సానిటైజర్స్ని ఉపయోగించాలి. ఇంచుమించు అన్ని సూపర్ మార్కెట్ మరియు మందుల దుకాణాలలో ఇవి దొరుకుతాయి. జెల్ ని ఉపయోగిస్తే చేతుల్ని జెల్ ఆరి పోయేవరకు రుద్దాలి. జెల్ పనిచేయడానికి నీరు అవసరం లేదు,అందులో ఉన్న ఆల్కహాల్ మీచేతుల మీదున్న క్రిములను చంపివేస్తుంది. మీరు వ్యాధిగ్రస్థులయితే ఈ క్రింద ఇచ్చిన హెచ్చరించే చిహ్నాలు కనిపిస్తే అత్యవసర ఆరోగ్య సదుపాయాన్ని పొందాలి. పిల్లలలో అత్యవసర వైద్య జాగ్రత్త అవసరమయ్యే, అత్యవసర హెచ్చరించే చిహ్నాలు ఏమిటంటే: వేగంగా శ్వాస తీసుకోవడం లేదా కష్టంగా శ్వాస తీసుకోవడం నీలి రంగు చర్మం చాలినంత ద్రవపానీయాలు తీసుకోకపోవడం. లేవకపోవడం లేదా మాట్లాడక పోవడం వారిని ముట్టుకుంటే అయిష్టత కనబరిచి చాలా చిరాకుగా ఉండడం ఫ్లూ లాంటి లక్షణాలు మెరుగుపడి కాని తిరిగి జ్వరం మరియు విపరీతమైన దగ్గు రావడం పొక్కులతో జ్వరం పెద్దవారిలో అత్యవసర జాగ్రత్త అవసరమయ్యే, అత్యవసర హెచ్చరించే చిహ్నాలు ఏమిటంటే కష్టంగా శ్వాస తీసుకోవడం లేదా కొద్దిగా శ్వాస తీసుకోవడం ఛాతీలో లేదా పొత్తికడుపులో నొప్పి లేదా వత్తిడి అకస్మాత్తుగా తల తిరగడం తికమకగా ఉండడం తీవ్రమైన లేదా నిరంతరంగా వాంతులు ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు స్వైన్ ఫ్లూ.. జాగ్రత్తలు పాటించండి.. స్వైన్‌ఫ్లూ అంటే..? తెల్ల పందిలో దాగి ఉండే స్వైన్‌ఫ్లూ వైరస్ మనిషి శరీరంలో ప్రవేశిస్తుంది. స్వైన్ అంటే పంది. ఫ్లూ అంటే ఇన్ఫ్లూయెంజ విభాగానికి చెందిన వైరస్‌తో వ్యాప్తి చెందే జలుబు. ఈ రకమైన వైరస్ తరచూ తనలో ఉన్న జన్యువులను ఇతర వైరస్‌లతో మార్చుకోవడంతో కొత్త రకం వైరస్లు పుట్టుకొచ్చి ఫ్లూ జ్వరం కలుగజేస్తుంటాయి. పంది శ్వాసకోశ వ్యాధికి కారణమయ్యే ఒక వైరస్‌లోని జన్యువులతో పోలి ఉంటుంది. పందుల్లో ఉండే వైరస్ తన యాంటి జెనిక్ స్వరూపాన్ని మార్చుకుని మనుషుల్లో వ్యాప్తి చెందడంతో స్వైన్‌ఫ్లూగా పేరుపెట్టారు. ‘ఇన్‌ఫ్లూయెంజా ఏ’ రకానికి చెందిన వైరస్ కేవలం మనుషుల నుంచి మనుషులకే సంక్రమిస్తుంది. స్వైన్‌ఫ్లూను వైద్యులు తమ పరిభాషలో హెచ్1ఎన్1 అని పిలుస్తారు. ఎదుటివారికీ ముప్పే.. చలికాలంలో జలుబు వైరస్లు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్వైన్‌ఫ్లూ కూడా ఇదే తరహాలో వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి గాలి ద్వారా సంక్రమిస్తుంది. బాధిత రోగి జాగ్రత్తలు పాటించకపోతే అది ఎదుటి వారికీ సంక్రమించే ప్రమాదం ఉంది. దగ్గు, తుమ్ము వస్తే.. తుంపర్లు ఎదుటివారిపై పడకుండా చేతి రుమాలు అడ్డుపెట్టుకోవాలి. చేతులపై తుంపర్లు పడితే.. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఫ్లూ సోకిన వారి నుంచి ప్రజలు దూరంగా ఉండాలి. లక్షణాలు.. వ్యాధి సోకిన వ్యక్తికి ఇది ఫ్లూ జ్వరంలాగే కనిపిస్తుంది. వ్యాధి సోకిన వారు తీవ్ర జ్వరం, జలుబు (ముక్కు నుంచి నీరు కారుతుంది), గొంతులో ఇన్ఫెక్షన్, తలనొప్పి, చలి, శరీర నొప్పులు, దగ్గు, నీరసం, అలసటతో బాధపడతారు. వాంతులు, విరేచనాలు అయినప్పుడు స్వైన్‌ఫ్లూగా అనుమానిస్తారు. సాధారణంగా జ్వరం మూడు నుంచి ఏడు రోజుల వరకు ఉంటుంది. కానీ స్వైన్‌ఫ్లూ రోగికి ఎక్కువ రోజులు ఈ లక్షణాలు కనిపిస్తాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడంతో చిన్నారుల్లో ఈ జబ్బు శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. శ్వాస తీసుకోవడం, చర్మం నీలిరంగుగా మారడం, నీళ్లు, ద్రవ పదార్థాలు తీసుకోకపోవడం, త్వరగా నిద్రలేవలేకపోవడం, జ్వరం తగ్గినా, దగ్గు తగ్గదు. పెద్దలలో ఆయాసం, ఛాతి, పొట్టలో నొక్కేస్తున్నట్లు నొప్పి, వాంతులు ఉంటే స్వైన్‌ఫ్లూ వెంటనే పరీక్ష చేయించుకోవాలి. విదేశాల్లో ఉండి వచ్చిన వారికి అప్పుడే వ్యాధి నిర్ధారణ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు వెలుగులోకి వచ్చే వీలుంటుంది. వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆధారము: సాక్షి స్వైన్ ఫ్లూ లక్షణాలు - తీసుకోవాల్సిన జాగ్రత్తలు దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి, ముక్కు నుంచి నీరు కారడం, చిన్నపిల్లల్లో వాంతులు, విరేచనాలు ఉండడం స్వైన్ ఫ్లూ లక్షణాలు. ఇవి ఉన్నంత మాత్రాన స్వైన్ ఫ్లూ అనడానికి వీలులేదు. ఈ లక్షణాలు ఉంటే మందులు వాడిన 48 గంటల్లో తగ్గకపోతే స్థానిక వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. ఇలా వ్యాపిస్తుంది వ్యాధిగ్రస్తులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, తుంపర్ల ద్వారా వెలువడే వైరస్ చుట్టు పక్కలకు వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తులతో భుజించినా, కలిసి నడిచినా, కరచాలనం చేసినా, నిద్రించినా, ఆలింగనం చేసుకున్నా ఈ వ్యాధి సోకుతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు బహిరంగ ప్రదేశాల్లో సంచరించకూడదు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే మూతికి మాస్క్, బట్ట ధరించాలి. చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే వారికి వ్యాధి వేగంగా సోకే అవకాశముంటుంది. మధుమేహం, క్యాన్సర్, వృద్ధులు, పిల్లలు, గర్బిణులకు, శ్వాసకు సంబంధించి వ్యాధి ఉన్న వారికి, స్టెరాయిడ్స్ వాడే వారికి ఎక్కువగా ఈ వ్యాధి వచ్చే అవకాశముంది. చికిత్స ఇలా.. స్వైన్ ఫ్లూ టీకా తాత్కాలికమైంది. అవసరాన్ని బట్టి వైద్యుల సలహాల మేరకు తీసుకోవాలి. టీకా, మందులు వైద్యుడి పర్యవేక్షణలోనే తీసుకోవాలి. ఐసొలేషన్ తప్పని సరిగా ఉండాలి. ఇతర రోగులు ఆ వార్డులో లేకుండా చూడాలి. ఆక్సిజన్‌తో పాటు బీపీ సరైన మోతాదులో ఉండేలా మందులు ఇవ్వాలి. సాధారణ మహిళలతో పోలిస్తే గర్బిణులకు ఈ వ్యాధి తీవ్రత ఎక్కువ ఉంటుంది. గర్భంలో పిండం పెరగడం కారణంగా ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గుతుంది. స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షల కోసం శ్యాంపిల్స్‌ను తీసి పంపించాలి. వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలందించేవారు ఎస్-95 మాస్క్‌లు వాడాలి. ఆధారము: నమస్తే తెలంగాణా స్వైన్ ఫ్లూ డైట్... స్వైన్ ఫ్లూ వైరస్ సోకకుండా ఎలాంటి వైద్యం చేయించుకోవాలి, ఎలాంటి ఆహారం తినాలి లాంటి విషయాలు తెలియక చాలామంది వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్వైన్ ఫ్లూ వైరస్ సోకకుండా ఎలాంటి డైట్ తీసుకోవాలో ఈ వారం తెలుసుకుందాం... స్వైన్ ఫ్లూ వైరస్ సోకకుండా జాగ్రత్తలు బాగా నీళ్లు తాగాలి. శరీర బరువుకు తగ్గట్టు ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. ఉదాహరణకు 80 కేజీల బరువున్న వాళ్లు 40 ఔన్సుల ఫ్లూయిడ్స్ అంటే 1200ఎంఎల్ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. మంచినీళ్లు ఎంత తాగితే అంత మంచిది. పళ్లు తోముకున్న వెంటనే గోరువెచ్చని నీటితో నోటిని పుక్కిలించి మంచినీళ్లు తాగాలి. ఆ తర్వాత నానబెట్టిన పది బాదం పప్పులు తినాలి. ఎండిన రెండు అంజీరాలు కూడా తినాలి. బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ఒక గ్లాసుడు కమలాపండురసం తీసుకోవాలి. అలాగే ఒక టీ స్పూను అల్లం జ్యూసు కూడా తాగాలి. మధ్యాహ్నం పూట క్యాబేజీ సూప్‌లో మిరియాలు, అల్లం దంచి ఆ పొడిని కలుపుకుని తాగాలి. లంచ్ తర్వాత అల్లం నీటిలో నానబెట్టిన పుచ్చకాయముక్కలను కాస్త మిరియాల పొడి చల్లుకుని తినాలి. పాలకూరలాంటి ఆకుకూరలతో తయారు చేసిన సూప్ తీసుకోవాలి. సాయంత్రం బాదంపప్పులు, వాల్నట్స్, జీడిపప్పులు, సన్‌ఫ్లవర్ విత్తనాలను కలిపి రోస్టు చేసి స్నాక్‌లా తీసుకోవాలి. కాస్త రుచిగా తినాలనుకుంటే వీటికి కొద్దిగా కారం, మిరియాలపొడి, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టొమాటోలు చేర్చి అందులో కాస్త ఉప్పు కలిపి స్నాక్‌లా తినొచ్చు. ఆ తర్వాత అల్లం వేసిన గ్రీన్ టీ లేదా నిమ్మకాయ టీ తాగాలి. డిన్నర్తోబాటు అల్లం, మిరియాలపొడి, సన్‌ఫ్లవర్ విత్తనాలు మెత్తగా దంచి ఆ మిశ్రమాన్ని క్యారెట్ జ్యూసులో కలుపుకుని తాగితే మంచిది. ఇతర జాగ్రత్తలు వేడినీళ్లతో నోటిని పుక్కిలిస్తుండాలి. శానిటైజర్‌తో చేతులు శుభ్రంగా కడుక్కుంటుండాలి. చేతులు కడుక్కోకుండా కళ్లు, ముక్కు, నోటిని తాకకూడదు. దగ్గినా, తుమ్మినా టిష్యు పేపర్ లేదా కర్చీఫ్‌ను అడ్డం పెట్టుకోవాలి. వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. ఆధారము: ఆంధ్ర జ్యోతి