లక్షణాలు గొంతు నొప్పి, మింగలేకపోవడము, జ్వరము, జలుబు, నీరసము కొన్ని సమయాలలో గొంతు క్రింద గడ్డలు వస్తాయి. ఈ జబ్బు సాధారణంగా చిన్నపిల్లలలో వస్తుంది. ఎలా వ్యాపిస్తుంది: కంఠసర్పితో బాధపడుతున్న పిల్లలు దగ్గినప్పుడు తుమ్మినప్పుడు గాలి తుంపర్ల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఎక్కువ జనసాంద్రత ఉన్న ప్రాంతాలలో నివశించువారిలో వస్తుంది. ఇంటి పరిసరాలు శుభ్రంగా లేకపోయనా ఈ వ్యాధి వ్యాపిస్తుంది చిన్న పిల్లలలో వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వకపోవడం వలన వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఈ వ్యాధి సోకుతుంది. 1 1/2 సం వయస్సులో D P T బూస్టరు మోతాదు ఇవ్వాలి. 3 సం వయస్సులో D T రెండు మోతాదులు ఇవ్వాలి. సూచిక D P T అనగా : కంఠసర్పి , కోరింత దగ్గు, ధనుర్వాతము D T : కంఠసర్పి, ధనుర్వాతము గమనిక: ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు తెలిసిన వెంటనే దగ్గరలోని ఆరోగ్యకార్యకర్తకు కాని వైధ్యాధికారికి గాని తెలియ చేయవలెను. ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు