కుష్ఠు వ్యాధిగా ఎప్పుడు అనుమానించాలి :

శరీరముపై పాలిపోయిన లేదా రాగి రంగు మచ్చలు ఉన్నప్పుడు

ఆ మచ్చలపై స్పర్శజ్ఞానము లేనపుడు మరియు నొప్పి తెలియనపుడు

శరీరమందు ముఖ్యంగా పాదములు, చేతులు, వ్రేళ్లు తిమ్మెరలు ఉన్నప్పుడు

చర్మం దళసరిగా ఉన్నప్పుడు

చర్మము ముఖ్యంగా ముఖం నూనె రాసినట్లు నిగనిగలాడుతూ కన్పించినపుడు ఈ వ్యాధిగా అనుమానించాలి.

కుష్టు వ్యాధి ఎందుకు వస్తుంది :

కుష్ఠువ్యాధి ఇతర అంటు వ్యాధులవలె సూక్ష్మ క్రిమి, ఇది మైక్రో బాక్టీరియల్ ద్వారా సంక్రమించు ఒక అంటు వ్యాధి.

1873వ సం.లోనే హన్ సన్ అను నార్వే శాస్త్రవేత్త ఈ వ్యాధి కారకమైన సూక్ష్మ జీవిని సూక్ష్మ దర్శనితో కనుగొన్నాడు.

ఈ వ్యాధి, వ్యాధి గ్రస్తుని నుండి గాలి ద్వారా, సన్నిహిత సాన్నిధ్యం ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది.

కుష్టు వ్యాధిగ్రస్తులు చేయవలసినదేమిటి:

కుష్ఠు వ్యాధిగా అనుమానించిన వెంటనే సమీపంలో కుష్ఠు వ్యాధి నిర్మూలనా కేంద్రంలో చూపించుకోవాలి

వెంటనే వైద్యం ప్రారంభించండి

వ్యాధి తీవ్రతను అనుసరించి 6 నెలలు లేదా 12 నెలలు సక్రమంగా మందులు సేవించండి

వ్యాధిని దాచవద్దు, ఇతర అనుమానితులను కూడా వైద్యుని దగ్గరకు వెళ్ళుటకు ప్రోత్సహించండి

కుష్టువ్యాధి నయమౌతుందా :

బహుళ ఔషధ (మల్టీడ్రగ్) చికిత్స కుష్ఠు వ్యాధికి ఒక నమ్మకమైన చికిత్స,

ఈ చికిత్సతో వ్యాధి ఏ దశలోనైనా నయమవుతుంది

ప్రారంభ దశయందే గుర్తించి సరైన చికిత్స సక్రమంగా తీసుకుంటే అంగవైకల్యం కూడా నివారించవచ్చు

కుష్టువ్యాధి గురించి వ్యక్తిగత బాధ్యతలేమిటి :

శిక్షణ పొంది, మీ విజ్ఞానమును బంధుమిత్రులతో పాలుపంచుకొని వాస్తవ విషయాల గురించి చర్చించండి

ఎవరిలోనైనా కుష్ఠు వ్యాధి యొక్క ప్రారంభ చిహ్నములను గమనించినా, వారిని వెంటనే వైధ్య పరీక్షకు ప్రోత్సహించండి

కుటుంబ సభ్యులకు, ఇతరులకు కుష్ఠు రోగులను బహిష్కరించకుండా ఉండుటకు సరైన శిక్షణ, అవగాహన కల్పించండి

కుష్ఠు రోగులను కుటుంబంలోనూ, సంఘంలోనూ ఆదరణతో చూడండి మరియు వారు సంతోషముతో, ఆరోగ్యదాయకమైన జీవితం గడుపుటకు సహాయం చేయండి

చదువు సంధ్యలయందు, ఉద్యోగ వివాహములందు కుష్ఠు రోగులకు, వారి పిల్లలకూ, సమానంగా అవకాశాలు కల్పించండి

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు