వైరల్ డయేరియా మన రాష్ట్రంలో చిన్న పిల్లల్లో వచ్చే అంటు వ్యాధులన్నిటిలోను దాదాపు 60-70 శాతం కేవలం డయేరియా ఆక్రమిస్తోంది అని చెపితే అశ్చర్యపోతారు. నిజానికి డయేరియా లేదా అతిసారవ్యాధి చిన్న పిల్లల ప్రాణాలు తీయడంలో అగ్రస్థానంలో ఉంది. 23 శాతం చిన్న పిల్లలు దీనివల్ల మరణిస్తున్నారు. లక్షణాలు వాంతులు విరోచనాలు (బేదులు) కడుపునొప్పి దాహం మరియు నోరు ఎండిపోవుట చర్మము సాగే గుణం కోల్పోవుట మూత్ర విసర్జన తగ్గిపోవుట కారణాలు కలుషితమైన నీరు తాగడం కలుషిత ఆహార పదార్థాలు తినడం నిలువ ఉన్న ఆహార పదార్థాలు తినడం నీటి సరఫరా గొట్టాలు పగిలి మురికి నీరుతో కలిసిపోవడం పరిసర మరియు వ్యక్తిగత పారిశుద్ధ్య లోపం వ్యాధి కారకము ముఖ్యంగా వైరస్ అనబడే సూక్ష్మ జీవులు మరియు ఇతర బాక్టీరియాలు వ్యాపించే సమయం : ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు తీసుకోవలసిన జాగ్రత్తలు వ్యాధి రాకముందు : క్లోరిన్ కలిపిన నీరు సరఫరా అవుతున్నదీ, లేనిదీ, ఊరి వాటర్ టాంక్ లో బ్లీచింగ్ సరిగ్గా అవుతుందీ లేనిదీ పరిశీలించాలి. ఇళ్లలో నీరు కాచి, చల్లార్చి, వాడే అలవాటు నేర్పించాలి. చేతులు ముంచి కుండ, బిందెలలో నీరు వాడకుండా, కేవలం డోకీ / కాడగిన్నెతో నీరు తీసుకొనే అలవాటు పెంపొందించాలి. సంబంధిత అధికారుల సమన్వయంతో పగిలిన పైపులు రిపేరు చేయించుకోవాలి. చేతి పంపులు, కుళాయిల చుట్టు ఎత్తైన ప్లాటుఫారం ఏర్పరచాలి. మరుగుదొడ్ల వాడకం అలవాటు చేయించాలి. ఓ.ఆర్.ఎస్. పాకెట్లు నిలువ ఉంచుకోవాలి. వ్యాధి ప్రబలే నెలలో : గ్రామస్తులందరు కాచిచల్లార్చిన నీరు త్రాగుతున్నారా? లేదా? పర్యవేక్షిస్తూ ఉండాలి. క్లోరిన్ కలిపిన నీరు తాగే అలవాటు అవసరం గుర్తింపజేయాలి. వేడివేడి పదార్థాలను తినడం మంచి అలవాటుగా గ్రామస్థులలో గుర్తింపచేయడం. ఆహార పదార్థాలపై మూతలు ఉంచే అలవాటు నేర్పడం. ఇంటి పరిసరాలలో మలవిసర్జన చేయనివ్వకూడదు. భోజనానికి ముందు, మలవిసర్జన తరువాత సబ్బుతో చేతులు కడిగే అలవాటు పెంపొందించాలి. వ్యాధి సోకిన పిల్లలకి ORS ప్యాకెట్లు వెంటనే సరఫరా అయ్యేటట్లు చూసి అది తల్లి తండ్రులు పిల్లలకి సరైన విధంగా కలిపి ఇస్తున్నారో లేదో స్వయంగా పర్యవేక్షించాలి. వైద్యం వైద్య సలహాతో మాత్రలు, అవసరమైతే రింగరం లాక్టేటం ద్రవం I.V. ఎక్కించడం ఏర్పాట్లు చేయాలి. సమాచారం / సమన్వయం : పంచాయత్ రాజ్ / మునిసిపాలిటీ రూరల్ వాటర్ సప్లయి సంస్థలకి తాగునీటి కలుషితం గురించి సమాచారం పంపించి వెంటనే తగు చర్యలు తీసుకునేటట్లుగా వారిని అప్రమత్తం చేయాలి. చెరువులో, మంచి నీటి కావులలో బట్టలు ఉతకడం, పశువులు కడగడం వంటివి జరుగుతుంటే పై అధికారుల దృష్టికి తేవాలి. బ్లీచింగ్ క్లోరినేషన్ పద్ధతిని RWS ఇతర స్కీం అధికారులకి, (MRO)లకి నివేదిక పంపించాలి. అవసరమైన చోట క్లోరినేషను క్లోరోస్కోప్ తో పరీక్షించాలి. (M.P.H.A. – Male) సహాయంతో ఏ గ్రామం నుంచి అయినా అతిసార వ్యాధి ఉన్నట్లు సమాచారం అందితే వెంటనే సంబంధిత పి.హెచ్.సి. డాక్టరుకి సమాచారం అందచేసి తగుచర్యలు తీసుకోవడంలో సహాయం అందించాలి. ఆరోగ్యశాఖవారు, పంచాయితీ శాఖవారు గ్రామంలో చేపట్టే వ్యాధి నిరోధించే చర్యలలో, ప్రచారంలో ఇతర సిబ్బందితో కలిసి సమన్వయంగా వ్యవహరించాలి. ప్రాథమిక చికిత్సకు లొంగక పరిస్థితి విషమిస్తుంటే పెద్ద ఆసుప్రతికి స్పెషలిస్టు వద్దకు తరలించే ప్రయత్నం / సహాయం చేయాలి. కుటుంబానికి మార్గదర్శకత చూపాలి. అతిసార వ్యాధి రాకుండా తీసుకోవలసిన నివారణ చర్యలు వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం. వంట చేసే ముందు, భోజనం వడ్డించే ముందు, భోజనం చేసే ముందు, మల విసర్జనకు వెళ్లివచ్చిన తరువాత చేతులు సబ్బుతో కడుక్కోవాలి. గోళ్ళు పెరగనివ్వరాదు. కూరగాయలు, పళ్ళు, మాంసం వండే ముందు కడగాలి. ఈగలు ఇతర కీటకాలు చేరకుండా వంట పాత్రలపై మూతలు పెట్టాలి.ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినాలి. కాచి చల్లార్చిన నీటినే త్రాగాలి. వీలైతే క్లోరిన్ బిళ్ళల్ని కలపాలి. చెరువులు, బావులు, బోర్లవద్ద బట్టలు ఉతకడం, పాత్రలు కడగడం చేయకూడదు. మురికినీరు నిల్వ ఉండకుండా చూడాలి. ఈగలు చేరకుండా పరిసరాల్లో చెత్తకుప్ప, పేడ, ఉండనీయరాదు. బహిరంగ ప్రదేశాలలో మల విసర్జన చేయరాదు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రములో అతిసార వ్యాధికి ఇచ్చే మందులు సరైన మోతాదులో ఇవ్వాలి. రోగి వయసును బట్టి ప్యూరాజోలిడిస్ మరియు మెట్రోనిడజోల్ మాత్రలు లేక సిరప్ ప్రతిరోజు జబ్బు తగ్గే వరకు రోజుకు 3 లేదా 4 సార్లు తగిన మోతాదులో ఇవ్వాలి. అతిసారం గురించి ఆరోగ్య కార్యకర్తలకు తెలియజేయాలి. వారు ఈ వ్యాధిని అదుపుచేసే చర్య తీసుకుంటారు. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు