పిల్లలలో కిడ్నీ మరియు మూత్రమార్గము యొక్క సంక్రమణ పెద్దలతో పోలిస్తే పిల్లలలో ఈ ప్రశ్న ఎందుకు అధికముగా గణనీయమైనది పిల్లలలో తరచుగా జ్వరము రావడానికి చాలా ముఖ్య కారణమూ కిడ్నీ మరియు ముత్ర మార్గములో సంక్రమణ కావచ్చును. చిన్న వయస్సు ఉన్న పిల్లలలో కిడ్నీ మరియు మూత్రమార్గము లో సంక్రమణను ఆలస్యముగా నిర్ధారణ కావడము మరియు అసంపూర్ణ చికిత్స చేయడముతో కిడ్నీకి పాక్షిక నష్టం కలగవచ్చు. తరచుగా కిడ్నీ పూర్ణ రూపకంతో చెడిపోయే ప్రమాదము ఉన్నది. ఈ యొక్క కారణము చేత పిల్లల మూత్రములో సంక్రమణ యొక్క నిర్ధారణ త్వరగా చేసి అవసరమైన చికిత్స చేయడము ద్వారా కిడ్నీకి సంభందించిన నష్టమును నివారించవచ్చును. పిల్లలలో ముత్రవ్యాధి కలుగడానికి అవకాశాలు అధికముగా ఎప్పుడు ఉంటాయి పిల్లలలో మూత్రమార్గము యొక్క సంక్రమణ అధికమయ్యే ముఖ్య కారణాలు క్రింద వ్రాయబడినవి. ఆడ పిల్లలలో మూత్రనాళిక పొడవు చిన్నదిగా ఉండటము, అలాగే మూత్రనాళిక మరియు మలద్వారము దగ్గరగా ఉండటము వలన మలమార్గము లోని బాక్టీరియా మూత్రనాళికలో సులభంగా వెల్లగలుగుతుంది మరియు సంక్రమణ కావొచ్చును . మలవిసర్జన చేసిన తరవాత దానిని కడిగే సమయములో వెనక నుంచి ముందు వైపునకు కడిగే అలవాటు. జన్మ జాతి క్షతి కారణంగా ముత్రశయము నుండి మూత్రము తిరోగమన (ఉల్లా)మూత్రవాహిని మరియు కిడ్నీ వైపు పోవడము. (Vesico Ureteric Reflux) జన్మ జాతి క్షతి కారణంగా ముత్రశయము నుండి మూత్రము కిడ్నీ లోపల వైపు మద్య భాగములో నుంచి క్రిందకు పోయే భాగమును పెల్విస్ అంటారు, పెల్విస్ మరియు మూత్రవాహిని కలిపే భాగములో కుదించడము ద్వారా మూత్ర మర్గాములో ఆటంకము కలగడము. (Pelvic Ureteric Junction) మూత్రనాళికలొ వాల్వు (Posterior Urethral Valve)కారణంగా చిన్న వయస్సు లోని పిల్లలకు మూత్ర విసర్జన సమయములో సమస్యలు కలుగడము. మూత్రమార్గములో కలన (రాళ్ళు)ఉండటము పిల్లలలో తరచుగా జ్వరము రావడానికి కారణమ మూత్రమార్గములో వ్యాధి ఒక కారణము కావచ్చు మూత్రములో సంక్రమణ లక్షణాలు సామాన్యంగా నాలుగు, ఐదు సంవత్సరాల నుండి పెద్ద పిల్లలు మూత్రము లోని సమస్యల ఫిర్యాదును స్వతహాగా చేయగలరు మూత్రములో సంక్రమణ యొక్క లక్షణాల గురించి విస్తృతంగా చర్చ అధ్యాయము -19 లో చేయబడినది.చాలా చిన్న వయస్సులో ఉన్న పిల్లలు మూత్రము లో ఉన్నసమస్యల ఫిర్యాదును చేయలేరు. మూత్రము పోసే సమయములో పిల్లలు ఏడవడము మూత్ర విసర్జన సమయములో కష్టముగా అనిపించడము లేదా జ్వరము కొరకు చేసిన మూత్ర పరీక్షలో అకస్మాత్తుగా సంక్రమణ యొక్క పరిస్థితి తెలవడము ఇవి మూత్రమార్గములో సంక్రమణ యొక్క సంకేతాలు.ఆకలి కలగకపోవడము, బరువు పెరగక పోవడము లేదా గంభీరమైన సంక్రమణ కావడముతో అతిగా జ్వరము దానికి తోడు కడుపు ఉబ్బడము, వాంతులు కావడము, అతిసారం రావడము, పచ్చకామెర్లు రావడము, లాంటి అనేక లక్షణాలు కూడా మూత్ర మార్గము యొక్క సంక్రమణ కారణాల చిన్న వయస్సు పిల్లలలో కనబడుతుంది పిల్లలలో మూత్రమార్గము యొక్క సంక్రమణ లక్షణము; జ్వరము,బరువు పెరగకపోవడము మరియు మూత్రము లో సమస్య ఇతరములు. మూత్రమార్గము సంక్రమణ యొక్క నిర్ధారణ కిడ్నీ మరియు మూత్రమార్గములో ని సంక్రమణ నిర్ధారణ కొరకు ముఖ్య మైన పరీక్షలు ముఖ్యముగా రెండు భాగాలలో విభజించబడుతుంది మూత్రమార్గము యొక్క సంక్రమణ నిర్ధారణ మూత్రమార్గము యొక్క సంక్రమణ కలిగే కారణం కొరకు నిర్ధారణ. 1. మూత్రమార్గము సంక్రమణ యొక్కనిర్ధారణ మూత్రములో సామాన్యంగా మరియు కల్చర్లో చీము యొక్క ఉనికి మూత్రమార్గములో సంక్రమణ యొక్క సంకేతము . ఈ పరీక్ష సంక్రమణ యొక్క నిర్ధారణ మరియు చికిత్స కొరకు గణనీయమైనది. 2. మూత్రమార్గములో సంక్రమణ కలుగడానికి కారణమ కొరకు నిర్ధారణ ఇతర ముఖ్యమైన పరీక్షల ద్వారాకిడ్నీ మరియు మూత్రమార్గములో కూర్పులో దోషము , మూత్రమార్గములో ఆటంకము మరియు మూత్ర విసర్జన సమయము కలుగుట ఇతర సమస్యల యొక్క నిర్ధారణ జరుగవచ్చు . ఈ సమస్యలు మూత్రమార్గములో తరచుగా సంక్రమణ కలగడానికి కారణము అవుతాయి . ఈ సమస్యల నిర్ధారణ కొరకు అవసరమైన పరీక్షల గురించి మనము ముందు గమనించాము.(చూడండి అధ్యాయము –4 మరియు అధ్యాయము -19)లో చర్చించడం జరిగింది అధికశాతం పిల్లలలోమూత్రము యొక్క సంక్రమణ కారణాల నిర్ధారణ చేయడానికి అవసరమైన ఎంసియు పరీక్ష (ఖ్ప.ఏ) ఏ ప్రకారముగా చేస్తారు. ఇది దేనికి గణనీయము. మూత్రమార్గము యొక్క సంక్రమణ కారణాల నిర్ధారణ కొరకు సోనోగ్రఫి, ఎక్స్రే, ఎం.సి.యు. మరియు అయ్.వి.పీ.ఇతర పరీక్షలు చేయబడుతాయి మిక్యురేటింగ్ సిస్టో యురిత్ర గ్రామ్ ఎం.సి.యు. ఎం. సి. యు.రూపములో పిలవబడే ఈ విధమైన పరీక్ష విశేషమైన అయోడిన్ కలిగిన ద్రవమును క్యాధ్యేటర్ ద్వార మూత్రాశయములో నింపబడుతుంది దాని తరవాత పిల్లల ను మూత్రము పోయామని చెపుతారు మూత్రవిసర్జన సమయములో ముత్రశాయము మరియు మూత్రనాళిక యొక్క ఎక్స్ రే తీయబడుతుంది ఈ పరీక్ష ద్వారా మూత్రము ను మూత్రాశయము నుండా తిరోగమన (ఉల్టా ) వైపు మూత్రావాహిని లోనికి పోవాలి మూత్రాశయములో ఏదైనా ఉండటము లేదా మూత్రాశయములో మూత్రము బయటికి వచ్చే మార్గములో ఏదైనా ఆటంకము ఉన్నచో ఇతర నిర్ధారణలు దొరకుతాయి. ఇంట్ర వెనస్ పైలోగ్రఫి l.V.Pఎప్పుడు మరియు ఎందుచేత చేయబడుతుంది మూడు సంవత్సరాల కన్నా అధిక వయస్సు ఉన్నపిల్లలలో తరచుగా మూత్రసంక్రమణ కలుగుతుంటే అప్పుడు కడుపు యొక్క ఎక్స్-రే మరియు సోనోగ్రఫి పరీక్ష తరువాత ఒకవేళ అవసరము అయితే ఈ యొక్క పరీక్ష చేయబడుతుంది. ఈ విధమైన పరీక్ష ద్వారా సంక్రమణ యొక్క పుట్టుక జాతి స్డితి లేదా మూత్రమార్గములో ఆటంకమునకు సంభందించిన సమాచారము తెలుసుకొనవచ్చు. మూత్రమార్గము యొక్కసంక్రమణ చికిత్స : పిల్లలకు దినములో ఎంత వీలైతే అంత అధికముగా మరియు రాత్రి కూడా 1 లేదా 2 సార్లు నీరు ఇవ్వాలి. మలబద్ధకం కలగనివ్వవద్దు నియమించిన సమయానికి మలవిసర్జన మరియు తరచుగా కొంత సమయానికి మూత్ర విసర్జన యొక్క అలవాటు చేయాలి. మూత్రము మరియు మలవిసర్జన సమయములో పరిసరాలు శుభ్రంగా పెట్టాలి. మలవిసర్జన తరవాత అధికమైన నీటితో ముందు నుంచి వెనక వైపునకు శుభ్రము చేయడము ద్వారా మూత్రసంక్రమణ కలిగే అవకాశము తక్కువగా ఉంటుంది పిల్లలలో సామాన్యమైన ఆహారము తీసుకోవడములో కొంత రాయితీ ఇవ్వబడుతుంది పిల్లలలో జ్వరము ఉంటే జ్వరమును తగ్గించే మందు ఇవ్వబడుతుంది మూత్ర సంక్రమణ యొక్క చికిత్స తరవాత మూత్ర పరీక్ష చేసి సంక్రమణ పూర్తిగా తగ్గినది లేనిది తెలుసుకోవడము చాలా ముఖ్యమైనది మూత్రములో సంక్రమణ మరలా రాకుండా ఉంటె చికిత్స పూర్తి అయిన ఏడు రోజుల తరువాత కూడా డాక్టర్ యొక్క సలహా మేరకు తరచుగా మూత్రపరీక్ష చేయించాలి. ఇది చాలా ముఖ్యము మూత్ర పరీక్ష మూత్రమార్గములోని సంక్రమణ నిర్ధారణ కొరకు మరియు చికిత్స నియమాల కొరకు చాలా అవసరము మందుల ద్వారా చికిత్స: మూత్రము యొక్క వ్యాధి నిర్ధారణ తరవాత దాని పైన నియంత్రణ పొందడానికి పిల్లలలో వ్యాధి యొక్క లక్షణాలను దాని యొక్క గంభీరత్వము మరియు పిల్లల వయస్సు ను దృష్టిలో పెట్టుకొని యాంటి బయోటిక్స్ ద్వారా చికిత్స చేస్తారు. ఈ యొక్క చికిత్స ప్రారంభించక ముందు మూత్రము (Urine Culture & Sensitivity) మరియు సున్నితత్వం పరీక్షలు చేయించడము అవసరము. ఈ యొక్క రిపోర్ట్ ఆధారంగా డాక్టర్ ద్వారా సర్వ శ్రేష్టమైన మందు తీసుకోబడుటవలన సంక్రమణ యొక్క చికిత్స చాలా ప్రభావంతముగా చేయవచ్చును చిన్న వయస్సులో ఉన్న పిల్లలలో ఒకవేళ మూత్రమార్గము వ్యాధి విపరీతంగా కలిగిఉంటే యంటిబయోటిక్ ఇంజక్షన్ ఇవ్వడము చాలాఅవసరము. సాదారనముగా వాడబడే యాంటిబయోటిక్స్ లో ఎమోక్సిలిన్, ఎమినోగ్ల్యేకో సైడాస్, సిఫెలోలోస్పోరిన్, కోట్రాయిమేక్సేజోల్, నైట్రో ఫరెంట్ టైన్, తదితర మందులు ఈ జాబితాలో ఉంటాయి. ఈ ప్రకారమైన చికిత్స సామాన్యంగా ఏడు నుంచి పది రోజుల వరకు చేయబడుతుంది. సంక్రమణ యొక్క చికిత్సతో పాటు సంక్రమణ కలుగడానికి గల కారణాల ప్రకారము ముందు చేయ బోయే చికిత్స నిర్ణయాలు తీసుకుంటారు. మూత్రమార్గము యొక్క వ్యాధి లో యాంటిబయోటిక్స్ ఎన్నుకోవడము మూత్రము యొక్క సంస్కృతి పరీక్షలో ముఖ్యమైనది మూత్రమార్గములో తరచుగా కలుగుతున్న వ్యాధికి మందుల ద్వారా చికిత్స లభిసుoది : ఏ రోగికి అయితే సంవత్సరమంతా కలిపి మూడుకన్నా అధికసార్లు మూత్రములో సంక్రమణ వస్తుందో అటువంటి రోగికి విశేషమైన మందులు తక్కువ మోతాదులో రాత్రి పూట ఒక్కసారి చాలా కాలము (మూడు నెలల) వరకు తీసుకోమని సలహా ఇస్తారు . ఈ మందులు ఎంత సమయము వరకు వాడవలన్నానది ఇది 5ಗ್ನಿ యొక్క సమస్యను, వ్యాధి యొక్క మోతాదు , వ్యాధి కలుగడానికి గల కారణాలు ఇతరములను దృష్టిలో పెటుకొని డాక్టర్ ద్వారా నిర్ణయించబడుతుంది. మూత్రమార్గములో తరచుగా కలుగుతున్న వ్యాధి యొక్క చికిత్స చాలాకాలము వరకు తక్కువ మోతాదులో మందులు తీసుకోవడము ద్వారా మూత్రవ్యాధి తరచుగా రాకుండా నివారించవచ్చు, తద్వారా ఈ మందు యొక్క విపరీత ప్రభావము ఉండదు. మూత్రమార్గములో వ్యాధి కలుగడానికి గల కారణాల యొక్క విశేషమైన చికిత్స. ఈ యొక్క వ్యాధి యొక్క విశేషమైన చికిత్స ఫిజీషియన్, నెఫ్రారాలజిస్ట్ కిడ్నీ సర్జన్ లేదా పిల్లల సర్జన్ ద్వారానిర్ణయించబడుతుంది. పిల్లలలో మూత్రమార్గము యొక్క సంక్రమణకు సరైన చికిత్స లేకపోవడము కారణముగా కిడ్నీ యొక్క స్థితిలో నష్టము కలుగవచ్చు. పెల్విస్ యురేటరిక్ జంక్షన్ ఆబ్జక్షన్ (PU.J. Obstruction) అనగా ఏమిటి ఈ యొక్క జన్మ జాతి శతిలో ఏమివుతుంది ఈ యొక్క జన్మ జాతి శతి లో కిడ్నీ యొక్క భాగము పెల్విస్(కిడ్నీలోపల వైపున మద్య భాగాములో ఉంటుంది మరియు కిడ్నీలో తయారయ్యే మూత్రమును క్రిందివైపు మూత్రావాహిని లోకి పంపుతుంది) మరియు మూత్రవాహినిని కలిపే ప్రదేశములో కుదించబడినప్పుడు మూత్రమార్గములో ఆటంకము కలుగుతుంది, ఈ యొక్క ఆటంకము కారణంగా కిడ్నీలో వాపు వస్తుంది మరియు కొంత మంది రోగులలో మూత్రము లో తరచుగా సంక్రమణ కలుగుతుంది . ఒకవేళ సరిఅయిన సమయానికి చికిత్స చేయక పోతే చాలాకాలము తరవాత వాపు ఉన్న కిడ్నీ బలహీనమైపోయి (Fail) విఫలమౌతుంది. ఈ యొక్క జన్మ జాతి శతి చికిత్స ఎలాంటి మందుతో నయము కాదు. ఈ శతి యొక్క విశేషమైన చికిత్సలో పైలోప్లాస్టి ఆపరేషన్ ద్వారా మూత్రమార్గము యొక్క ఆటంకమును తొలగించవచ్చు. మూత్రనాళిక యుక్క వాల్వ్ (Posterior Urethral Valve)అంటేపముటి దీని జన్మ జాతి శతిలో ఏమి ఉంటుంది పిల్లలలో కనిపించే ఈ సమస్య లో మూత్రనాళిక లో స్థిరపడిన వాల్స్ యొక్క కారణముగా ఆటంకము వలన మూత్రవిసర్జన సమయములో సమస్య కలుగుతుంది. మూత్రవిసర్జన సమయములో ఒత్తిడి పెట్టవలసి వస్తుంది మూత్రము యొక్క ధార సన్నగా వస్తుంది లేదా చుక్కలు చుక్కలు గా పడుతుంది. జన్మించక ముందు మొదటి నెలలో మరియు అప్పుడప్పుడు గర్భ స్థితి యొక్క చివరి నెలలో చేయబడే సోనోగ్రఫి పరీక్షలో ఈ యొక్క వ్యాధి సంకేతం చూడడానికి వీలు కలుగుతుంది . మూత్రము యొక్క మార్గములో అధిక ఆటంకము కలుగుట కారణంగా ముత్రాశయము యొక్క గోడ మందముగా అవుతుంది. దీనికి తోడుగా ముత్రాశయము యొక్క ఆకారము పెరుగుతుంది ముత్రాశయములో నుంచి మూత్రము పూర్తి మోతాదు రాక పోవడము ద్వారా ఈ మూత్రము ముత్రాశయములో నిండిపోయి ఉంటుంది. అధిక మూత్రము సంగ్రహము వలన ముత్రాశయములో ఒత్తిడి పెరగటముతో దీని యొక్క విపరీత మైన ప్రభావముతో మూత్రవాహిని మరియు కిడ్నీకి కూడా వాపు కలగొచ్చు ఈ యొక్క పరిస్థితిలో ఒక వేల సరైన చికిత్స చేయక పోతే కిడ్నీకి మెల్ల మెల్లగా నష్టము కలగవచ్చు. చిత్త ఈ ప్రకారమైన సమస్యలో మూత్రనాళికలో స్థిరపడిన వాల్స్ ను ఆపరేషన్ ద్వారా దూరము చేయబడుతుంది కొంత మంది పిల్లలలో కంటి భాగములో కత్తిరించి ముత్రాశయములో నుండి మూత్రము బయటకి తీసే ఆపరేషన్ చేయబడుతుంది. పిల్లలలో జన్మ జాతి శతి కారణంగా మూత్రమార్గాములో వ్యాధి కలుగే సంబవాలు అధికముగా ఉంటాయి. కలన (రాళ్ళు) చిన్న పిల్లలలో కలుగే కలన సమస్య యొక్క చికిత్స కొరకు కలన యొక్క స్థానము ఆకారము, ఆధారముగా ఇవి అన్ని దృష్టిలో పెట్టుకొని అవసరఅనుసారంగా దుర్బిన్ యొక్క సహాయముతో ఆపరేషన్ ద్వారా లేదా లితోట్రిప్సి ద్వారా చికిత్స చేయబడుతుంది. వి యు ఆర్ (వెసికో యురెటరిక్ రిప్లక్స్) పిలల్లలో మూత్రము యొక్క ఇన్ఫెక్షన్ అన్ని కారణాలలో అనింటి కన్నా ముఖ్యమైనవి వియుఆర్ వెసికో యురెటరిక్ రిఫ్లక్స్ (VU.R. - Vesico Ureteric Reflux). వియుఆర్లో జన్మ జాతి శతి యొక్క కారణము మూత్రము మూత్రాశయములో నుండి (తిరోగమన) వెనుకవైపు మూత్రావాహిని మరియు కిడ్నీ వైపునకు పోతుంది. పిల్లలలో మూత్రమార్గము యొక్క సంక్రమణ మరియు క్రానిక్ కిడ్నీ వైఫల్యము యొక్క ముఖ్య కారణము జన్మ జాతి శతి .వి.యు .అర్ వియు ఆర్ యొక్క చర్ష ఎందుకు ముఖ్యమైనది వి. యు. అర్. పిల్లలలో మూత్ర వ్యాధి, అధిక రక్తపోటు మరియు క్రానిక్ కిడ్నీ వైఫల్యము (Failure) కావడానికి అన్నింటి కన్నా ముఖ్యమైన కారణము. వియుఆర్లో ఏమి అవుతుంది సాధారనంగా మూత్రాశయము లో అధికముగా ఒత్తిడి కలుగడము వలన కూడా మూత్రవాహిని మరియు మూత్రాశయము మద్యలోన రిత్ వాల్స్ మూత్రమును మూత్రావాహినిలో వెల్ల నివ్వకుండా ఆపుతుంది. మరియు మూత్ర విసర్జన క్రియలో మూత్రము మూత్రాశయము నుండి ఒక్క వైపునకు మూత్రనాళిక ద్వారా బయటికి వస్తుంది. వియుఆర్లో ఈ యొక్క శతి కావడము ద్వారా మూత్రాశయములో అధికముగా మూత్రము సేకరించబడుట వలన మరియు మూత్రవిసర్జన సమయములో మూత్రము (తిరోగమన) వెనుకవైపు మూత్రాశయములో నుండి ఒకటి లేదా రెండవ మూత్రవాహిని వైపుకు పోతుంది . ప్రత్యేకమైన ఎక్స్ - రే ఎం సి యు పరీక్ష ద్వారా. వి.యు .ఆర్ నిర్ధారణ అవుతుంది వెసికో యురెటరిక్ రిప్లక్స్, (V.U.R - Vesico Ureteric Reflux) వి.యు.ఆర్ లో ఏ రకమైన సమస్యలు ఎదురవ్వవచ్చు? ఈ వ్యాధి లో క్రలిగే సమస్యలు వ్యాధి యొక్క తీవ్రతను బట్టి ఉంటాయి. తక్కువ తీవ్రత ఉన్న రోగిలో (తిరోగమన) వెనుక వైపుకు వెళ్ళే మూత్రము తక్కువ మోతాదులో ఉంటుంది. మరియు మూత్రము కేవలము మూత్రావాహినిమరియు కిడ్నీ యొక్క పెల్విస్ భాగము వరకే పోతుంది. ఈ రకమైన పిల్లలలో మూత్రములో తరచుగా మూత్ర సంబంధ వ్యాధి కలుగుతుందో తప్పక వేరే ఇతర సమస్యలు కలగవు. వ్యాధి యొక్క తీవ్రత ఎప్పుడైతే అధికముగా ఉంటుందో మూత్రము యొక్క అధిక మోతాదు (తిరోగమన) కారణంగా కిడ్నీలోవాపు వస్తుంది మరియు మూత్రము యొక్క ఒత్తిడి కారణంగా దీర్ఘ కాలము తరవాత కిడ్నీకి నష్టము కలుగుతుంది ఈ సమస్యకు సరైన చికిత్స చేయక పోతే కిడ్నీ పూర్తిగా చెడిపోవచ్చును. వి.యు.అర్ యొక్క చికిత్స ఈ వ్యాధి యొక్క చికిత్స, వ్యాధి యొక్క లక్షణాల, దాని యొక్క మోతాదు పిల్లల వయస్సును దృష్టిలో పెట్టుకొని నిర్ణయించబడుతుంది. మూత్రము యొక్క ఇన్ఫెక్షన్ యొక్క నివారణ రోగి యొక్క చికిత్సలో ఘననీయమైన భాగము ఇన్ఫెక్షన్ యొక్క నియంత్రణ కోసం యాంటిబయోటిక్స్ ఇవ్వడము అవసరము. ఎలాంటి ఏంటిబయోటిక్స్ అధిక ప్రభావంతముగా ఉంటుందో ఇది నిర్ణయించడానికి మూత్రము యొక్క (కల్చర్)పరీక్ష సహాయపడుతుంది . మందు తీసుకునేటపుడు వ్యాధి పూర్తిగా నియంత్రణలో వస్తే దాని తరువాత పిల్లలలో మరల ఇన్ఫెక్షన్ రాకుండా తక్కువ మోతాదులో ఏంటిబయోటిక్స్ రోజు ఒకసారి రాత్రి నిద్రపోయేటపుడు చాలాకాలము వరకు (రెండు నుండి మూడు సంవత్సరాలు)ఇవ్వబడుతుంది చికిత్స సమయములో ప్రతీ నెలలో మరియు అవసరము వస్తే దాని కంటే ముందు కూడా మూత్ర పరీక్ష యొక్క సహాయముతో వ్యాధి పూర్తిగా నియంత్రణలోకి వచ్చిందా లేదా అనేది నిర్ధారణ చేయబడుతుంది మరియు దాని పైన ఆధారపడి మందు మార్పు చేయబడుతుంది. ఎప్పుడైతే వ్యాధి తక్కువ తీవ్రతతో ఉంటుందో అప్పుడు దాదాపుగా ఒకటి లేదా మూడు సంవత్సరాల వరకు ఇదే తరహాలో మందుల ద్వారా చికిత్స చేయించడము ద్వారా ఆపరేషన్ లేకుండా ఈ యొక్క వ్యాధి మెల్ల మెల్లగా సంపూర్ణంగా నయము అవుతుంది చికిత్స సమయములో ప్రతి ఒకటి నుండి రెండు సంవత్సరాల లోపు తిరోగమన (ఉల్లా) వైపు వెళ్ళే మూత్రము యొక్క మోతాదు ఎంత పరివర్తనము అయిందో కనుక్కోవడానికి ఏం సి యు (M.C.U) పరీక్ష మరల చేయబడుతుంది ఆపరేషన్ ఎప్పడైతే వి.యు.ఆర్ అధికముగా తీవ్రముగా ఉన్నదో మరియు దాని కారణము మూత్రావాహిని మరియు కిడ్నీ వాపు ఉందో ఎలాంటి పిల్లలలో శతిని నయము చేయడానికి మరియు కిడ్నీ వి యు .ఆర్ యొక్క సులభమైన సమస్యలలో యాంటిబయోటిక్స్ మరియు ప్రమాదకరమైన సమస్యలలో ఆపరేషన్ యొక్క అవసరం ఎంతైనా ఉంటుంది. ఏ పిల్లలలో అయితే వ్యాధి అధిక తీవ్రముగా ఉంటుందో దానికి కారణము మూత్రము అధికముగా ఉల్టా వైపు పోవడము ఇలాంటి పిల్లలలో సమయానికి ఆపరేషన్ చేయకపోతే కిడ్నీ శాశ్వతముగా చెడిపోవచ్చును. ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉదేశ్యము మూత్రావాహిని మరియు మూత్రాశయము మధ్యలోని వాల్స్ ఎలాంటి స్థితి ఉండే నరాలు స్తితము చేయడము మరియు మూత్రము వెనక్కు పోవడమును ఆపడము .ఇది చాలా నాజకైన ఆపరేషన్ కబట్టి దీనిని పిడియాట్రిక్ సర్జన్ లేదా యురోలజిస్ట్ ద్వారా చేయబడును.