రక రకాల కిడ్నీ వ్యాదులకు లక్షణాలు వేరు వేరుగా వుంటాయి. వాటిలో ముఖ్య లక్షణాలు ఈ విధముగా వుంటాయి. ఉదయము నిద్ర లేచిన వెంటనే కండ్లు వాచి ఉండటము ముఖము మరియు కళ వాచి ఉండటము ఆకలి తక్కువగా ఉండటము, వాంతులు చేసుకోవడము, వికారముగా అనిపించడము. తరచుగా మూత్ర విసర్జన అవసరము అవ్వటము, ప్రత్యేకంగా రాత్రుల్లు చిన్న వయస్సులోనే రక్తపోటు వ్యాధి ఉండటము. నీరసముగా ఉండటము, రక్తము నిస్సారముగా అవ్వటము కొంచెము నడిచే సరికి ఆయాసము రావటము, నీరసముగా అనిపించటము. 6 సంవత్సరాల వయసు తరువాత కూడా మంచము మీద మూత్రము అవ్వటము మూత్రము తక్కువగా అవ్వటము *మూత్ర విసర్జన సమయములో మంట పుట్టడము, మూత్రములో రక్తముగానీ, చీము గానీ రావటము మూత్ర విసర్జన కష్టముగా అవ్వటము, బొట్టు బొట్టుగా అవ్వటము కడుపులో పుండు అవ్వటము, కాళ్ళలోన, నడుములోన నొప్పి కలగటము. పైన వివరించిన లక్షణాలలో ఏ ఒక్క లక్షణము ఉన్నా కూడా కిడ్నీ రోగము ఉండటానికి అవకాశం ఉందని అనుకుని, వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి చికిత్స చేయించుకొనవలెను. ఉదయము పూట ముఖము, కళ్ళు వాచి ఉండడము కిడ్ని రోగానికి సర్వ ప్రదమ లక్షణముగా భావించవచ్చును. ఆధారం : కిడ్నీ ఎడ్యుకేషన్