కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి శరీరములోని రక్తాన్ని శుభ్రపరచడము కిడ్నీ యొక్క ಮಿ೩) కార్యము. వ్యాధి మూలంగా రెండు కిడ్నీలు వాటి యొక్క సామాన్య పని చెయ్యలేక పోయినప్పుడు, కిడ్నీలు పని చేయగలిగే శక్తిని కోల్పోయినప్పుడు అటువంటి వ్యాధిని కిడ్నీ ఫెయిల్యూర్ అని అంటారు. కిడ్నీ ఫెయిల్యూర్ రోగ నిర్ధారణ ఎలా చేస్తారు రక్తములోని క్రియాటినిన్, యూరియాల పరిమాణముల పరీక్ష చేయిస్తే, కిడ్నీ పనిచేసే విధానము, కిడ్నీ యొక్క శక్తి గురించిన విషయాలు తెలుస్తాయి. కిడ్నీ పని చేసే శక్తి శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువగా ఉంటుంది. అందుచేత ఏదైనా వ్యాధివలన కిడ్నీకి కొంచెము నష్టము కలిగినా, రక్తపరీక్షలో ఏవిధమైన తేడాలు కనపడవు. అయితే రోగం కారణంగా రెండు కిడ్నీలు 10 శాతము కంటే ఎక్కువగా పాడైతే అప్పుడు రక్తములోని క్రియాటినిన్, యూరియాల పరిమాణము సామాన్యముగా కంటే ఎక్కువగా ఉంటాయి. ఒక కిడ్నీ పాడైపోతే కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుందా కాదు. ఏ వ్యక్తికైనా రెండు ఆరోగ్యమైన కిడ్నీలలో ఒక కిడ్నీ పాడైపోతే లేక ఏదైనా కారణము మూలంగా ఒక కిడ్నీ తీసివేయవలసి వచ్చినా, రెండవ కిడ్నీ దానియొక్క పని చేసే శక్తిని పెంచుకుని శరీరము యొక్క అవసరాన్ని పూర్తి చేస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్ ముఖ్యముగా రెండు విధాలుగా ఉంటుంది. ఎక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ మరియు క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్, ఈ రెండు రకాల కిడ్నీ ఫెయిల్యూర్ల మధ్య ఉండే తేడా స్పష్టముగా తెలుసుకోవాలి. ఎక్యుట్ కిడ్నీఫెయిల్యూర్ ఎక్యుట్ కిడ్నీ ఫెయిల్యూర్ మామూలుగా పని చేస్తున్న రెండు కిడ్నీలు, విభిన్న రోగాల మూలంగా నష్టము వాటిల్లడము వల్ల అతి తక్కువ పనిచేయకపోవడము జరుగుతుంది. ఈ రోగానికైతి వెంటనే చికిత్స చేస్తే, తక్కువ వ్యవధిలో కిడ్నీ సంపూర్ణంగా తిరిగి పనిచేయడం మొదలవుతుంది, తరువాత రోగికి మందులు వేసుకునే అవసరము కానీ ఆహార నియమాలు పాటించవలసిన అవసరము కానీ ఉండదు. ఎక్యుట్ కిడ్నీ ఫెయిల్యూర్ రోగులందరికి చికిత్స మందుల ద్వారా, ఆహార నియమాల ద్వారా చేయడము అవుతుంది. కొంతమంది రోగులలో కొన్ని రోజుల వరకు డయాలసిస్ చేయవలసిన అవసరము కూడా ఉంటుంది క్రానిక్ కిడ్నీఫెయిల్యూర్ క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్లో పలు రకములైన రోగముల కారణంగా కిడ్నీ యొక్క పనిచేసే శక్తి క్రమేపి కొద్ది నెలలుగా కానీ కొన్ని సంవత్సరాలుగా కానీ తగ్గుతూ వస్తుంది. రెండు కిడ్నీలు మెల్లమెల్లగా పని చేయడము పూర్తిగా నిలిచిపోతుంది. క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ వ్యాధికి ప్రస్తుతము చికిత్సా విధానాలలో పూర్తిగా నయము చేసే మందులు ఏమీ లేవు. క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు మందుల ద్వారా ఆహార నియమములతోను, ఎప్పటికప్పుడు పరీక్షలు చేయడము ద్వారా చికిత్స చేయడమవుతుంది. మొదట్లో బలహీనముగా ఉన్న కిడ్నీల యొక్క దర్శకతను సంక్రమించుకోవడము, కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క లక్షణాలను నిర్మాణంలో ఉంచడము, ఏదైనా జరగాల్సిన ప్రమాదాలను ఆపటానికి ప్రయత్నము చేయడము ఉద్దేశ్యముగా ఉండాలి. ఏ చికిత్స యెక్క్ ముఖ్య ఉద్దేశ్యము రోగియొక్క ఆరోగ్యము సంతృప్తిగా ఉండేలా చేయడము, డయాలసిస్ ఎంత వరకు వీలైతే అంతవరకు ఆపడము, కిడ్నీ ఎక్కువ పాడయిపోవటంతో సరైనా చికిత్స చేస్తున్నా కూడా రోగ లక్షణాలు పెరుగుతూ ఉండటము, రక్త పరీక్షలలో క్రియాటిన్ యూరియాల పరిమాణాములు పెరుగుతూ ఉండటము జరుగుతుంది. ఇటువంటి రోగులకు డయాలసిస్కిడ్నీ ట్రాన్స్పాస్ట్ తప్ప మరోదారి లేదు. రెండు కిడ్నిలు 50 శాతము కంటే ఎక్కువగా పాడయినప్పుడే కిడ్ని ఫెయిల్యూర్ యొక్క రోగ నిర్దారణ సంభమవమవుతుంది.