7 నెలలు - ప్రేరణ కృత్యాల క్యాలెండర్

బిడ్డతో దొంగాట ఆడటం

వస్తువులు: ఏమీ లేదు.

దశలు:

చేతులతో ముఖాన్ని కప్పుకుని, “అమ్మ ఎక్కడ ఉంది?” అని అడగండి.

చేతులు తెరిచి, ఆనందంగా, “బూ! ఇక్కడే ఉన్నాను!” అని తెలియచేయండి.

బిడ్డ మిమ్మల్ని కనుగొన్న ప్రతిసారీ బిడ్డతో నవ్వును పంచుకోండి.

కృత్యం ప్రాధాన్యత: దృశ్య నైపుణ్యాలను ప్రోత్సహిస్తుంది, బిడ్డతో దొంగాట ఆడటం ద్వారా సంతోషకరమైన బంధం అనుభవాన్ని కలిగించటమే కాక వస్తువు/మనిషి అక్కడే ఉన్న భావాన్ని పెంపొందిస్తుంది.

బంతిని చేరుకోవడం

వస్తువులు: మృదువైన, తేలికపాటి బంతి.

దశలు:

బిడ్డను వెల్లకిలా లేదా బోర్లా పడుకోబెట్టి, దగ్గరలో మృదువైన బంతిని ఉంచండి.

బంతి అందే దూరంలో, నెమ్మదిగా అటు ఇటు తిప్పండి.

ఉత్సాహంతో బంతిని తాకేలా బిడ్డను ప్రోత్సహించండి.

బంతిని తాకడానికి లేదా పట్టుకోవడానికి బిడ్డ చేసే చిన్న ప్రయత్నాలను కూడా ఉత్సాహంగా ఆస్వాదించండి.

బిడ్డను ఉల్లాసభరితంగా ఉంచటానికి బంతితో చేసే కదలికను పునరావృతం చేయండి.

కృత్యం ప్రాధాన్యత: స్థూల కండర నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది, పట్టుకునే కదలికలను ప్రోత్సహిస్తుంది మరియు చేతి-కంటి సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది.

పెదవి కదలికలు

వస్తువులు: ఏమీ లేదు.

దశలు:

దుస్తులు ధరింపచేసేటప్పుడు మీ బిడ్డ చేసే "ఆ, ఎస్, ఎస్, ఈ, ఎస్, బీ, ఎస్, ఎస్" వంటి ధ్వనులను తిరిగి మీరు కూడా చేయండి.

మీ బిడ్డ అనుకరణకు ఎలా స్పందిస్తాడో గమనించండి, పునరావృతం చేయమని బిడ్డను ప్రోత్సహించండి.

మీ పిల్లల వేళ్లను మీ పెదవులపై ఉంచండి, వారికి కదలికలు మరియు కంపనాలను అనుభూతి చెందడానికి వీలు కల్పించండి.

ఉల్లాసభరితమైన మరియు పరస్పర అనుభవం కోసం విభిన్న ధ్వనులను కలిపి అన్వేషించండి.

కృత్యం ప్రాధాన్యత: ఇంద్రియ అవగాహనను పెంచుతుంది, భాషపై అవగాహన పెరగటం, సంరక్షకుడు మరియు పిల్లల మధ్య సంబంధం బలోపేతం అవుతుంది.

స్నాన సమయం – సరదా

వస్తువులు: ప్లాస్టిక్ కంటైనర్ లేదా కప్పు, నీరు.

దశలు:

స్నానం చేసే సమయంలో నీటిని సున్నితంగా ఎలా చల్లాలో బిడ్డకు చూపించండి.

బకెట్ లో నీళ్ళు నింపి, "పూర్తి" అని చెప్పి, ఆపై స్నానం అయిన తరువాత "ఖాళీ" అని చూపించి చెప్పాలి.

మీ సహాయంతో మరల మరల ప్రయత్నించటానికి బిడ్డను ప్రోత్సహించండి.

ప్రతి అనుభవాన్ని ఆస్వాదిస్తూ, బిడ్డతో కలిసి సంతోషకరమైన సమయాన్ని గడపండి.

కృత్యం ప్రాధాన్యత: స్నాన సమయం ఒక ఉల్లాసభరితమైన అభ్యాస అనుభవంగా మారుతుంది, నిండు మరియు ఖాళీ భావనలను నేర్పించటం, ఇంద్రియ అన్వేషణను పెంచుతుంది.

ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ