బడికి వెళ్ళే ముందు వయసు పిల్లలకు పోషకాహారం (1-5 సంవత్శరాలవయసు) చనుబాలు మానిపించేందుకు ఇది కీలకమైన సమయం ఇతర వైవిధ్యమైన ఆహారాన్ని జోడించేందుకు పాలపరిమాణాన్ని మెల్లగా తగ్గించాలి. చిన్నబిడ్డల యొక్క ఆహారానికి ప్రత్యేకశ్రద్ధ మరియు ప్రణాళిక అవసరం శక్తి మరియు పోషకాల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఆకలి తక్కువగా ఉంటుంది మరియు ఆహారపు అలవాట్లు గడబిడగా ఉండొచ్చు.కాబట్టి,వారి ఆహారం క్రమమైన,చిన్నవైన పోషకసాంద్రతతోకూడినవిగా ఉండాలి. బడికి వెళ్ళేముందు వయసు పిల్లలకు తగిన ఆహారం ఆరవనెలనుంచి తల్లిపాలతోపాటు మంచి అనుబంధ ఆహారం తీసుకుంటున్న శిశువు తనఎదుగుదలకు,అభివృద్ధికి కావాల్సిన అన్ని పోషకాలను తీసుకుంటున్నట్లే.అదేఆహారాన్ని కొద్దిగా పరిమాణం పెంచి కోరినవెంటనే తల్లిపాలతోబాటు కొనసాగించాలి. తిండిలో అన్ని సమూహాలనుంచిఆహారాన్ని తీసుకోవాలి.1-2 సంవత్శరాల వారికి ఇచ్చే సగటు ఆహారములో ఉండాల్సినవి, వండిన తృణధాన్య లేదా పిండితో కూడిన కూరగాయలను రోజుకు మూడుసార్లు ఆవుపాలు-తల్లిపాలు తాగుతున్నవారికి కనీసం రోజుకు 200మిల్లీలీటర్లు మరియు తల్లిపాలుతాగనివారికి రోజుకు కనీసం 500 మిల్లీలీటర్లు.కొద్దిపాలకు బదులుగా జున్ను లేదా పెరుగు కూడా ఇవ్వవచ్చు.ఆవుపాలు సహించకపోతే ప్రత్యామ్న్యాయాన్ని ఇవ్వవచ్చు(సోయాపాల వంటిది),ఏదిఏమైనప్పటికీ ఆ ప్రత్యామ్నాయాలలో కొవ్వు తక్కువగా ఉండటంవల్ల రెండేళ్ళలోపు పసిబిడ్డలకు సిఫారసుచెయ్యబడలేదు. కాయధాన్యాలు,మాంసము లేదా చేపలు రోజుకొకసారి ఏ రూపములో వండినా రోజుకొక్కటిచొప్పున వారానికి కనీసం నాలుగు గుడ్లు జియల్ వి లేదా ఇతర ఉడికించినకూరగాయలు రోజుకు రెండుసార్లు ఫలాలు రోజుకొకసారి;అదనపు ఫలాలు కూరగాయలకు బదులుగా లేదా కూరగాయలకు బదులుగా ఫలాలు ఇవ్వవచ్చు. బిడ్డతినేతిండియొక్కపరిమాణము ఆ బిడ్డ యొక్కఆకారము మరియు అటపాటలమీద ఆధారపడి ఉంటుంది ఆహారపరిమాణాన్ని నెమ్మదిగా పెంచవచ్చు,కానీ ఏ నిర్దిష్టమైన దశలో ఎంత ఆహారం అవసరమన్నది తెలియజెప్పే మంచి సాధనం ఆకలి కుటుంబంతీసుకునేది గనుక మంచిఆహారమైతే పిల్లలు ఇంటితిండిని పొందవచ్చు,వారికి ఐదేళ్ళప్రాయం వచ్చేసరికి మిగతాకుటుంబసభ్యులలాగానే వారు మంచిపీచుకలిగిన ఆహారము తింటూఉంటారు. భోజనవేళలు క్రమంగా ఉండాలి.ఉదయపు అల్పాహారం చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి అది పోషకాలతో కూడినదిగా ఉండాలి. కొవ్వుతో,చక్కెరతోకూడిన పదార్ధాలను తీసుకోవటం నియంత్రించాలి.వంటనూనెలు,చక్కెర,బిస్కట్లు,కేకులు,మిఠాయిలు,చాకొలేట్లు,ఐస్ క్రీములు మరియు తీయటిపానీయాలు ఉదహరణలు.ఇవి పిల్లలయొక్క ఇతరపోషకాహార వినియోగాన్ని ప్రభావితం చేస్తాయి.వారికి భోజనము మధ్యలోకాక భోజనానంతరం ఒక చిరుతిండిగా ఇవ్వండి.తీయటితిండిపదార్ధాలు మరియు పానీయాలు(పళ్ళరసంతో సహా)పిల్లలలో దంతక్షయానికి దారితీస్తాయి.భోజనాలకు మధ్యలో పాలు లేదా నీరు మంచిపానీయాలు. చిన్నపిల్లలకు అదనపుఎ,సి,మరియు డి విటమిన్లను అనుబంధాలుగా ఇవ్వవచ్చు. పిల్లలు విపరీతంగా బరువుపెరుగుతుంటే,చిరుతిళ్ళను తగ్గించాలి,ముఖ్యంగా మిఠాయిలు మరియు చాకొలేట్,వారిని ఆటలాడవలసిందిగా శారీరకంగా చురుగ్గా ఉండేలా ప్రోత్శహించాలి. పిల్లలు సరిగ్గా బరువుపెరగకపోతే వైద్యసలహా తీసుకోవాలి జబ్బుపడ్డప్పుడు మరియు కోలుకున్నాక పిల్లలకు సరైనరీతిలో ఆహారం అందించాలి ,లేనిచో అది పిల్లల ఎదుగుదలను ఆటంకపరుస్తుంది. పాఠశాలకు వెళ్తున్న పిల్లలకు పోషకాహారము భోజనములు మరియు చిరుతిళ్ళు అన్నీ పోషకాహారము మరియు శక్తిపూర్ణమైనవిగా ఉండటం అన్నది చాలా కీలకం వారివారి వయసు మరియు చురుకుదనము స్థాయినిబట్టి పాఠశాలవయసు బాలబాలికలు ప్రతిరోజూదాదాపు 1600 నుంచి 2400 కాలరీలు అవసరమవుతాయి,ఒకసారి వారు ఎదుగుదలను అందుకున్నాక బాలికలకు అదనముగా 200కాలరీలు బాలురకు 500 అదనముగా అవసరమవుతాయి. ఆహారపదార్ధాలను అయిదు ప్రధాన ఆహారసమూహాలనుంచి ఎంపిక చెయ్యాలి.కొవ్వు మరియు తీపిచిరుతిళ్ళను మితంగా ఇవ్వాలి. ఆరోగ్యవంతమైన బరువును నిలబెట్టుకొనటానికి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవటాన్ని ప్రోత్సహించండి. పిల్లలు సరిపడినంత కాల్షియం,ఐరన్,మరియు బికాంప్లెక్స్ గ్రూపు విటమిన్లు ప్రత్యేకించి ఫాలికామ్లము తీసుకుంటున్నారో అన్నది గమనించాలి/అది ఐరన్ మాంసేతర వనరులనుండిఎక్కువప్రభావవంతముగా గ్రహించేందుకు,దానిని విటమిన్ సి సమృద్ధిగా పుల్లని ఫలాలు మరియు పళ్ళరసాలతోఉన్నవాటితో కలపండి. తల్లిదండ్రులకు మార్గదర్శకాలు పిల్లలకు ప్రధానాహారము మూడు క్రమబద్ధమైన భోజనాలు ఉదయం మధ్యలో మరియు మిట్టమధ్యాహ్నం లేదా పడుకోబోయేముందర అదనపు చిరుతిళ్ళు ఏమన్నా ఉంటే.రోజంతా తినటాన్ని ప్రోత్శహించకండి. పిల్లలను వారిఆహారం వారేతీసుకునేలా ప్రోత్శహించండి భోజనాన్ని తాజాగా ఆకర్షణీయంగా ఉండేలా వడ్డించండి పిల్లలు సులభంగా తినగలిగేలా ఆహారాన్ని ఇవ్వండి(ఉదా.చిన్నచిన్నముక్కలుగా కోసి) పిల్లలను బలవంతంగా తినేలా చెయ్యవద్దు ఆహారానికి బదులుగా పాలు ఇవ్వవద్దు పూర్తిధాన్యాల మరియు తృణధాన్యాల రొట్టెలను ఎంపికచేసుకోండి బాగావేయించిన పదార్ధాలను తీసుకోకపోవటం,ఆరోగ్యవంతమైన వంటపద్ధతుల ద్వారా కొవ్వును తగ్గించండి ఉప్పు మసాలా తక్కువగా ఉండే ఆహారాన్ని ఎంపికచేసుకోండి మీపిల్లలను భోజనము యొక్క ప్రణాళికలో తయారీలో భాగస్వాములయ్యేలా ప్రొత్శహించండి. ఆరోగ్యచిట్కా పిల్లల ఆదర్శ ఎత్తు మరియు బరువును నిర్ధారించేందుకు సులభసూత్రం ఆదర్శ బరువు ఒకటి నుంచి ఆరుసంవత్శరాల వయసున్న పిల్లలకు,వయసును రెండుతోటి హెచ్చించండి మరియు దానికి ఎనిమిదికలిపితే ఆపిల్లవాడి ఆదర్శబరువు తెలుస్తుంది.ఉదాహరణకు,పిల్లవాడికి నాలుగు సంవత్శరాల వయసు అయితే,నాలుగును రెండుతో హెచ్చిస్తే అది ఎనిమిదికి సమానం కాబట్టి,ఎనిమిది ఎనిమిది కలిపితే పదహారు.పదహారు కిలోలబరువు మంచిదే ఆదర్శఎత్తు ఎత్తుతెలుసుకొనటానికి వయసును ఆరుతో హెచ్చించి మరియు దానికి 77ను కలపాలి.ఉదాహరణకు పిల్లవాడికి నాలుగు సంవత్సరాలయితే ఆరును నాలుగుతో హెచ్చిస్తే అది 24 దానికి 77కలిపితే 101. గమనిక:ఒకవేళ పిల్లవాడు ఉండాల్సిన ఎత్తుకన్నా పొడవుగా ఉంటే ఆ ఎత్తుకు సరిపడా బరువున్నాడా లేదాఅన్నది పోలిక చార్టులనుపయోగించి కనుక్కోవాలి ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు