నిద్రలో ఉన్నప్పుడు తెలియకుండానే పడక తడుపుట కారణాలు:- 5-6 సం|| పిల్లలు నిద్రలో మూత్రవిసర్జన చేస్తే - డాక్టరు సలహా తీసుకోవలసిన అవసరం వుంది. వయస్సుకు తగ్గ మూత్రాశము లేకపోవుట - చిన్నదిగా వున్నా - ఈ లక్షణము రావచ్చు. మూత్రాశము పూర్తిగ నిండినట్లు గుర్తించ లేకపోవడం. కొన్ని దీర్ఘకాలిక మందులు కారణం కావచ్చు. మానసిక వత్తిడి - భయం - నిద్రలో భయం కల్పించే కలలు కనడం ఈ సమస్యకు కారణం కావచ్చు. చిన్నపిల్లలో శ్వాసనాళ సమస్యల వలన కూడా ఈ సమస్య రావచ్చును. చిన్న పిల్లలలో మధుమేహవ్యాధి కూడ ఈ లక్షణాలకు కారణం. వైద్యసలహా:- పిల్లలు నిద్రపోయేముందు మూత్రవిసర్జన చేయించాలి. నిద్ర మధ్యలో వీలైతే ఒకసారి నిద్ర లేపి మూత్రవిసర్జన చేయించాలి. నిద్రపోయేముందు తక్కువగా నీళ్ళుత్రాగడం - లేక ఒక గంట ముందు నీళ్ళుత్రాగడం అలవాటు వైద్య సలహా తీసుకోవడం తప్పనిసరి. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు