బిడ్డతో మృదువైన పదాలు వస్తువులు: ఏమి లేదు. దశలు మృదువైన మరియు సున్నితమైన పదాలను ఉపయోగిస్తూ మీ పిల్లలతో మాట్లాడటంలో నిమగ్నం అవ్వండి. పిల్లలు మాట్లాడే మాటలు "బేబీ టాక్స్," హావభావాలు మరియు చేసే ధ్వనులను శ్రద్ధగా వినండి. మీ బిడ్డతో సంభాషించడానికి సున్నితంగా ప్రతిస్పందించండి. శ్రద్ధతో చేసే సంభాషణ ద్వారా ఏర్పడిన బంధాన్ని ఆస్వాదించండి! కృత్యం ప్రాధాన్యత: సున్నితత్వం మరియు ప్రతిస్పందనను మెరుగుపరుస్తుంది, సంరక్షకుని - పిల్లల బంధాన్ని బలపరుస్తుంది, పోషణ మరియు సహాయక వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది. కలిసి పాట పాడండి వస్తువులు: ఏమి లేదు. దశలు బిడ్డకు ఇష్టమైన పాట లేదా లాలిపాటని ఎంచుకోండి. బిడ్డ కళ్ళలోకి చూస్తూ ఎంచుకున్న స్వరాన్ని మృదువుగా పాడండి. మీ స్వరం గురించి సిగ్గుపడకుండా పాడటంలోని ఆనందాన్ని అనుభవించండి. శిశువు యొక్క ప్రతిచర్యలను గమనించండి. ప్రేమతో మరియు చిరునవ్వులతో ప్రతిస్పందించండి. సంగీతంలోని మాయ ద్వారా ఈ ప్రత్యేక బంధ సమయాన్ని ఆస్వాదించండి. కృత్యం ప్రాధాన్యత: భాష అభివృద్ధి, భావోద్వేగ అనుబంధం మరియు వినినవాటిని గుర్తుపట్టాన్ని పెంపొందిస్తుంది. బుగ్గలతో బెలూన్స్ వస్తువులు: ఏమి లేదు. దశలు మీ పిల్లల బట్టలు మార్చిన తర్వాత, మీ బుగ్గలను బెలూన్ లాగా పెట్టండి. "ఫాట్" శబ్దం చేయడానికి మీ పిల్లల పాదాలను మీ బుగ్గలపై ఉంచండి. మీ పిల్లల దృష్టిని ఆకర్షించడానికి వివిధ ధ్వనులు చేయండి మరియు ఫన్నీగా ముఖాన్ని పెట్టండి. మీ పిల్లలతో సరదాగా గడిపే సమయాన్ని ఆస్వాదించండి. కృత్యం ప్రాధాన్యత: కళ్ళ పరిశీలనా నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది, ప్రతిస్పందనను ప్రోత్సహిస్తుంది మరియు సంభాషణ నైపుణ్యాలను బలపరుస్తుంది. ఊయల ఊపే సమయం వస్తువులు: మృదువైన వస్త్రం లేదా దుప్పటి. దశలు ఇంట్లో మృదువైన వస్త్రాన్ని ఉపయోగించి సున్నితమైన ఊయలను తయారుచేయండి. బిడ్డను సురక్షితమైన ముడితో బాగా కట్టిన ఊయలలో ఉంచండి. సుతారమైన కదలికలతో బిడ్డను ప్రేమగా ఊయలలో ఊపండి. ఊయల ఊపుతున్నంత సేపూ బిడ్డతో చిరునవ్వులు, నవ్వులు పంచుకోండి. బిడ్డకు సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన అనుభవాన్ని అందించండి. కృత్యం ప్రాధాన్యత: భద్రతా భావాన్ని పెంపొందిస్తుంది, బంధాన్ని ప్రోత్సహిస్తుంది మరియు బిడ్డలో సమతుల్య భావాన్ని పెంచుతుంది. ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ