పుట్టిన శిశువు 0-3 నెలలు వరకు ప్రేరణ కృత్యాల క్యాలెండర్ ఆరోగ్యకరమైన ఆహారం దశలు: శిశువును చూస్తున్నప్పుడు, చిరునవ్వు చిందించి, శిశువు తిరిగి నవ్వుతుందో లేదో చూడండి.మీ నోరు తెరిచి, మూసి, శిశువు కోసం సున్నితమైన ధ్వనులు చేయండి.శిశువు చేతులను పట్టుకుని, మీ ముఖం మీద సున్నితంగా తాకుతూ మార్గనిర్దేశం చేయండి.శిశువును మీ ముక్కును పట్టుకుని ఆనందించనివ్వండి. కృత్యం ప్రాధాన్యత: దృశ్య / పరిశీలనా నైపుణ్యాలను మెరుగుపరచటం, ముఖాలను గుర్తించేలా ప్రోత్సహించటం, స్పర్శతో గుర్తించే నైపుణ్యాన్ని ప్రోత్సహించటం, శిశువు మరియు సంరక్షకునికి మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుంది. ధ్వనులను అనుకరించడం దశలు: శిశువుతో కూర్చుని, వారు చేసే ధ్వనులను వినండి.శిశువు ధ్వని చేసినప్పుడు, అదే ధ్వనిని తిరిగి వారికి వినిపించండి.మళ్ళీ ధ్వని చేయమని బిడ్డను ప్రోత్సహించండి.శిశువు చేసే ధ్వనులను మెచ్చుకుంటున్నట్లుగా, మీ నవ్వు ద్వారా మీ ఆనందాన్ని వ్యక్త పరచండి. – "శిశువు మాట్లాడగలడు!" కృత్యం ప్రాధాన్యత: సమాచారాన్ని ప్రోత్సహిస్తుంది, సంరక్షకుడు-శిశువు సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. ప్రతిస్పందిత సంరక్షణ అందించడం ద్వారా సౌకర్యవంతంగా ఉంటుంది. సున్నితమైన ఉపశమనం దశలు: శిశువుకు ఏమి అవసరమో గుర్తించండి; వారు తడిగా, ఆకలితో, అలసిపోయారా లేదా అసౌకర్యంగా ఉన్నారా?శిశువు అలసిపోయినట్లుయితే లేదా అసౌకర్యంగా ఉంటే, వారిని దగ్గరగా పట్టుకోండి. నెమ్మదిగా కదలండి మరియు మృదువుగా మాట్లాడండి.వారికి భరోసా ఇవ్వడానికి శిశువు పేరును నిశ్శబ్దంగా చెప్పండి.శిశువుకు ఉపశమనం కలిగించడానికి అతని వీపును సున్నితంగా తాకండి మరియు రుద్దండి. కృత్యం ప్రాధాన్యత: సురక్షితమైన అనుబంధాన్ని పెంపొందిస్తుంది, భావోద్వేగ నియంత్రణను ప్రోత్సహిస్తుంది. ప్రతిస్పందించే సంరక్షణ ద్వారా పిల్లలు సౌకర్యంగా ఉంటారు. బేబీ కోసం పాడటం దశలు: ఏదైనా పాట లేదా లాలి పాటను ఎంచుకుని మీ బిడ్డకు మృదువుగా పాడి వినిపించండి.మీరు పాడుతున్నప్పుడు బిడ్డను చూస్తూ మృదువైన స్వరంతో పాడండి.పాడుతున్నప్పుడు పిల్లలు ఎలా ఆనందిస్తున్నారో, ప్రతిస్పందిస్తున్నారో గమనించండి.మీ పెద్ద వారినుండి నేర్చుకున్న శ్రావ్యమైన పాటలు పాడటం ద్వారా ఈ బంధాన్ని ఆస్వాదించండి మరియు మీకు సమయం దొరికినప్పుడల్లా తిరిగి పాడుతూ ఉండండి! కృత్యం ప్రాధాన్యత: పాటల వలన భాషాభివృద్ధి, భావోద్వేగ అనుసంధానం మరియు భద్రతా భావాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రేమించడం మరియు కాగిలించుకోవడం దశలు: హాయిగా, సురక్షిత భావాన్ని కలిగించడానికి బిడ్డను దగ్గరగా కౌగిలించుకోవాలి.మీ బిడ్డను సున్నితంగా ఊపుతూ కౌగిలించుకోండి మరియు వారికీ ఆప్యాయమైన ముద్దులు ఇవ్వండి.మీ బిడ్డకు సురక్షితమైన అనుభూతిని కలిగించడానికి మీరు వారిని ప్రేమిస్తున్నారని మృదువుగా చెప్పండి.మీ ప్రేమను చూపించడానికి తరచుగా కౌగిలించుకోండి! కృత్యం ప్రాధాన్యత: మీ బిడ్డతో బలమైన, ప్రేమపూర్వక బంధం ఏర్పడుతుంది. వారికీ ప్రేమ మరియు సురక్షితమైన అనుభూతిని కలిగిస్తుంది. ఆధారం: మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ