‘ఆయుష్మాన్ భారత్'తో నవభారతానికి సాధికారత దేశంలోని లక్షలాది కుటుంబాలకు 'ఆయుష్మాన్ భారత్ యోజన' ప్రాణదాతగా నిలుస్తోంది. ఈ పథకం 2018 సెప్టెంబరు 23న ప్రారంభం కాగా, 60 కోట్ల మందికి పైగా పౌరులకు ఏటా ₹5 లక్షల విలువైన నగదు రహిత చికిత్స సదుపాయం లభిస్తోంది. ఇప్పటిదాకా 47 కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డులు జారీ చేయగా, 11 కోట్ల మందికి పైగా ఉచిత చికిత్స పొందడంతో ఎన్నో కుటుంబాలు ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాయి. 'ఆరోగ్య-సౌభాగ్య భారత్' స్వప్నాన్ని ఈ పథకం సాకారం చేస్తోంది. దేశంలో ఒకనాడు ఆనారోగ్య పీడితుల జీవితంతో పాటు వారి కుటుంబ ఆర్థిక పునాది కుప్పకూలే దుస్థితి ఉండేవి.. అసుపత్రి గడప తొక్కే పేదలు చికిత్స కోసం తమ భూమిని, అభరణాలను తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది. అయితే, ఆరోగ్య సంరక్షణ రంగంలో నవ శకానికి భారత్ నాంది పలికింది. ఈ దిశగా ప్రారంభించిన 'ఆయుష్మాన్ భారత్' పథకం ఓ ప్రభుత్వ కార్యక్రమంగా మిగిలిపోకుండా లక్షలాది పేద-వెనుకబడిన వర్గాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందిస్తూ ప్రాణదాతగా మారింది. తీవ్ర అనారోగ్యం నుంచి అత్యాధునిక శస్త్రచికిత్స దాకా ₹5 లక్షల విలువైన ఉచిత చికిత్స సౌలభ్యంతో సామాన్యులకు గౌరవప్రద జీవన హక్కు లభించింది. దేశవ్యాప్తంగా వేలాది. ప్రభుత్వ-ప్రైవేట్ ఆసుపత్రులలో సాంకేతికత- పారదర్శకతల మేళవింపుతో గ్రామీణ, పట్టణ ప్రజలకూ పైసా ఖర్చు లేకుండా అత్యుత్తమ, నాణ్యమైన చికిత్స అందుబాటులోకి వచ్చింది. ఇక 70 ఏళ్లు పైబడిన వృద్ధులను ఈ భద్రత వలయంలో చేర్చడం ద్వారా మానవీయ దృక్పథానికి ఈ పథకం సరికొత్త ఉదాహరణగా నిలిచింది. సత్సంకల్పంతో, నిజాయితీతో, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా విధానాలు రూపొందితే ప్రతి పౌరుడికీ ఆరోగ్య సంరక్షణ హక్కు కల్పన సాధ్యమేనని 'ఆయుష్మాన్ భారత్' రుజువు చేసింది. ఏబీ-పీఎంజేఏవై కీలక వాస్తవాలు ఆయుష్మాన్ భారత్ -ప్రధానమంత్రి జనారోగ్య యోజన (ఏజీ-పీఎంజేఏవై) ఝార్ఖండ్ రాష్ట్రం నుంచి 2018 సెప్టెంబరు 23న ప్రారంభమైంది. ఆరోగ్య బీమాపై ప్రభుత్వ వ్యయం పెంపు ద్వారా పేద కుటుంబాల వైద్య వ్యయం తగ్గించడంలో ఈ పథకం ఎంతగానో దోహదం చేసింది. దీనివల్ల 2024-25లో ప్రజలకు ₹1.25 లక్షల కోట్లకు పైగా ఆదా అయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2026-27) బడ్జెట్లో ఈ పథకం అంచనా వ్యయాన్ని ₹9,500 కోట్లకు పెంచారు... 2025-26తో పోలిస్తే ఇది ₹500 కోట్లు అధికం. ఈ పథకం ద్వారా ఉన్నత, సూపర్ స్పెషాలిటీ (ద్వితీయ, తృతీయ స్థాయి) ఆసుపత్రులలో చికిత్స కోసం ప్రతి కుటుంబానికీ ఏటా 75 లక్షల విలువైన ఆరోగ్య బీమా రక్షణ లభిస్తుంది. ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సహాయకులకూ (సుమారు 37 లక్షల కుటుంబాలు) 2024 మార్చిలో ఈ పథకాన్ని వర్తింపజేస్తూ, దీని పరిధిని మరింత విస్తరింపజేశారు. అటుపైన 2024 అక్టోబరులో సామాజిక-ఆర్థిక స్థితిగతులతో నిమిత్తం లేకుండా 70 ఏళ్లు, అంతకు పైబడిన (4.5 కోట్ల కుటుంబాల్లోని 6 కోట్ల మంది) వృద్ధులకూ ఈ పథకాన్ని వర్తింపజేశారు. జాతీయ ఆరోగ్య ఖాతాల అంచనా 2022-23 మేరకు... మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రజల సొంత ఖర్చు 2014-15లో 62.6 శాతం కాగా, ఈ పథకం వల్ల 2022-23కల్లా 43.4 శాతానికి తగ్గింది. ఆధారం : న్యూ ఇండియా నమాచార్